భక్తి కథలు

బసవ పురాణం-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన చూచి జంగమయ్యకు సేవ చేసి మాట్లాడాడు. సంభాషణలో జంగమయ్య తాను దరిద్రుణ్ణనీ కిన్నర బ్రహ్మయ్యగారిని దర్శించి వారి అనుగ్రహంతో శ్రీమంతుడు కావాలనే ఉద్దేశం ఇంత శ్రమపడి వచ్చానని చెప్పాడు.
అది విని కలకౌత బ్రహ్మయ్య చాలా బాధపడ్డాడు. ‘‘జంగమయ్యా! సంపద కొరకే అయితే కలకౌత బ్రహ్మయ్య గారి వద్దకే పోనక్కరలేదు. ఇలారా’’ అని పిలిచి ఒక రాళ్ళ గుట్టను తనచేతిలోని కోలతో తాకించాడు. మరుక్షణమే గుట్ట మొత్తం నిధి క్రిందికి మారిపోయింది. అది చూచి జంగమయ్య ఆనందాశ్రువులు జాలువార్చుతూ బ్రహ్మయ్యకు శరణు చేసి నగరంలోకి పరుగెత్తుకుంటూ పోయాడు. నేరుగా బసవన్నను కలిసి జరిగినదంతా చెప్పి ‘కలకౌత బ్రహ్మయ్య నాకిచ్చిన ధనం మోయడానికి నా ఒక్కడివల్ల సాధ్యం కావడంలేదు. ఎవరినైనా ఒక భటుణ్ణి సాయం పంపు’ అని కోరాడు.
అది విని బసవన్న ఆశ్చర్యపడ్డడు. ‘‘ఇంద్రజాలాన్ని తన కాయకవృత్తిగా స్వీకరించిన కలకౌత బ్రహ్మయ్య ఇంత నిధిని నీకు ఇచ్చాడంటే అది శివభక్తులకు మాత్రమే సాధ్యం. చింతామణికి కల్పవృక్షానికీ కామధేనువుకూ కూడా సాధ్యం కాదు. అవి ఏవో ఒక్కటే ఇవ్వగలుగుతాయి. మేరువు చిన్న బంగారానే్న ఇవ్వగలుగుతుంది. కాని కలకౌత బ్రహ్మయ్య సర్వార్థసిద్ధి చేయగలడు’’ అని బసవన్న జంగమయ్యకు ఒక సేవకుణ్ణి ఇప్పించి తాను స్వయంగా వెళ్లి కలకౌత బ్రహ్మయ్య పాదాలను శరణు చేశాడు. ఈ విషయం తెలిసి కిన్నర బ్రహ్మయ్య కూడా వచ్చి కలకౌత బ్రహ్మయ్యను ప్రస్తుతించాడు. కలకౌత బ్రహ్మయ్య వారందరికీ విందు భోజనం పెట్టాడు.
మోళిగ మారయ్య కథ
కల్యాణ నగరంలో మోళిగ మారయ్య అనే శివభక్తుడు మరొకడు ఉన్నాడు. ఆయన కట్టెలు కొట్టడం తన కాయకంగా స్వీకరించాడు. అడవి నుండి తెచ్చిన కట్టెల మోపును అంగడిలో విక్రయించి ఆ ధనంతో జంగమార్చన చేస్తూ వుండేవాడు. ఇలా వుండగా ఒకసారి శివభక్తులు బసవన్న ఇంట భుజిస్తూ వున్న సమయంలో ‘‘బసవన్నా! మేము లోగడ మోళిగ మారయ్య ఇంట శివపూజ చేశాము. ఆయన మాకిచ్చింది అంజలి మాత్రమే. అయితేనేమి అది పృథ్విలోని సమస్త మధురాతిమధురమైన పదార్థాలన్నిటికన్నా గొప్పగా వుందయ్యా’’ అని ప్రశంసించారు. బసవన్నకు ఒకసారి మారయ్య ఆతిథ్యం చూడాలని కోరిక గలిగింది. అందుకని మారువేషం వేసుకొని మోళిగ మారయ్యగారింటికి వెళ్లాడు.
అప్పుడు మారయ్య అడవికి వెళ్లాడు. మారయ్య భార్య ఎవరో జంగమయ్య వచ్చాడని భావించి శరణు చేయడానికి వచ్చింది. మారయ్య భార్య బసవన్నకు అర్ఘ్యపాద్యాదులిచ్చి ‘అమ్మో! మా లింగయ్య ఆకలితో వున్నాడమ్మ! వడ్డించాలి’ అని ఇంట్లోకివెళ్లింది. ఆ సమయం చూచి రెండు వేల మాడలను ఒక మూల బసవన్న ఉంచాడు. తర్వాత మారయ్య భార్య చేసిన ఆతిథ్యం స్వీకరించి బసవన్న వెళ్లిపోయాడు.
తర్వాత మారయ్య వచ్చాడు. కట్టెల మోపు దింపి కాళ్ళు చేతులు కడుక్కొని జంగమయ్యలను పిలిచి అర్చించి తాంబూలాలు సమర్పించి గినె్నను చూచేసరికి దాని కింద రెండు వేల మాడలు అతికించబడి వున్నాయి. మారయ్య ఆశ్చర్యపడి భార్యను పిలిచి ‘ఈ ధనమెక్కడి’దని ప్రశ్నించాడు. ‘ఏమో నేనెరుగను. ఇందాక ఒక జంగమయ్య వచ్చి శివ పూజ చేసి వెళ్లాడు’ అన్నదామె.
మారయ్య తన్మయంతో చేతులు జోడించి ‘‘పిచ్చిదానా! మామూలు జంగమయ్య కాదే ఆ వచ్చింది. బసవేశ్వరుడే మారువేషంలో మనలను పరీక్షించడానికి వచ్చాడు. పేద భక్తుల వ్యధలు తనవిగానే భావించే బసవన్న మాత్రమే ఇలా రహస్యంగా ఇస్తుంటాడు. బసవా! నీ బిడ్డలమీద ఇన్నాళ్ళకు దయ వచ్చిందా తండ్రీ! ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చి నా యిల్లును పావనం చేశావా?’’ అని పరవశంతో బసవన్నను స్మరిస్తూ వుండిపోయాడు.
ఆవేశం తగ్గాక మారయ్య ‘‘బసవా! నీవు ధనమిచ్చావు కాని నాకు దానితో మాత్రమే పనిలేదయ్యా! నాకీ కాయకముండగా ఇంకో ధనమెందుకు?’’ అని ఇద్దరు జంగమయ్యలకు ఆ రెండు వేలూ తాంబూలాలతో అందించాడు.
వారా ధనాన్ని తీసుకొన్నాక పోతూ మారయ్య భక్తిని బసవని ముందు ప్రశంసించారు. ‘‘కట్టెలు కొట్టుకునే మారయ్య జంగమయ్యలు వస్తే రెండు వేల మాడలిచ్చాడు. ఇంతటి భక్తులెవరుంటారు?’ అన్నారు వారు. బసవడిది విని పరుగుపరుగున మారయ్య ఇంటికి మళ్లీ వచ్చాడు.
బసవన్న రాగానే ఆయన పాదాలపై మారయ్య పడి ‘‘బసవా! భక్త పరాధానా! కరుణించు తండ్రీ’’ అని వేనోళ్ల పొగిడాడు.
బసవన్న కంటి వెంట అశ్రువులు దొర్లాయి. ‘‘మారయ్యా! నన్ను క్షమించు. నా పాడు బుద్ధితో నీకేదో సంపద లిద్దామని వచ్చాను. ఇచ్చాననుకున్నాను. కాని నీవు పరధనాన్ని స్వీకరింపని భక్త శిఖామణివనీ, నేనిచ్చిన ధనం అప్పుడే జంగమయ్యల కిచ్చావనీ తెలిసి నివ్వెరపోయాను. మారయ్యా! నీ గొప్ప గుణం నేనెట్లా తెలుసుకోగలను? నీవు కనకాద్రివి- నేను కాకిని; నీవు పరుసవేదివి, నేను ఇనుమును; నీవు గుణనిధివి, నేను దుర్గుణడను. నాలో చిన్న మంచి గుణం కూడా లేదు మారయ్య తండ్రీ! వెలివాడలో వేదఘోష విన్పడదు. ఆవములో రాగిచెంబులుండవు. నిప్పుల కుంపటిలో తామర దుంపలు మొలవవు.
- ఇంకా ఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్