సాహితి

సామాజిక బాధ్యతను చెప్పేదే కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్ష సంప్రదాయ కవిత్వంలో
నాది క్రొత్త త్రోవ: నాది ఉషనిషన్మార్గం
ఆర్ష సంప్రదాయ కవిత్వంలో అనుమాండ్ల భూమయ్య ఒక విలక్షణ అనుభూతి కవి. ఆయనే అనుమాండ్ల భూమయ్య. ‘వేయినదుల వెలుగు’; ‘వెలుగు నగలహంస’; ‘అగ్నివృక్షము’, జ్వలిత కౌసల్య, చలువపందిరి, త్రిజట వంటి మేలైన పది పద్యకావ్యాలు, కొరవి గోపరాజు సాహిత్య విశే్లషణ, నాయని సుబ్బారావు కృతులు పరిశీలన, వేయిపడగలు, ఆధునిక ఇతిహాసం, మాలపల్లి అభ్యుదయ మహాకార్యం, కర్పూర వసంతరాయలు కళా ఝంకృతులు, ఆంధ్ర పురాణం, భారతీయ సంస్కృతి వైభవం, తెలంగాణ భావ విపంచక గోలకొండ కవుల సంచిక, వేమన అనుభవసారం వంటి లోతైన విమర్శ గ్రంథాలు పదిహేడు రాశారు. అనుమాండ్ల భూమయ్యతో ముఖాముఖి
* మీ జీవితంలోనూ, సాహిత్య జీవితంలోనూ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన, మరచిపోలేని సంఘటనలు?
జీవితంలో అప్రయత్నంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవి ఉద్యోగంగా లభించడం; సాహితీ జీవితంలో పద్యకవితా రచనా మహోద్యోగుం లభించడం.
* సత్తెకాలపు సాదాసీదా వ్యక్తిగా ఆయన అదనపు సంగతులు తెలుపుతూ ఉపనిషత్తులు మీపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి? మీ విద్యా నేపథ్యం ఎటువంటిది?
ఇక, నేను ఉపనిషత్తులు వేదాంత బోధకుల వద్ద చదువుకున్న వాణ్ణి కాదు, శ్రీరామకృష్ణ మఠం వారు అర్థ తాత్పర్యాలతో ప్రచురించిన ఉపనిషత్తులు కొన్ని చదివాను. అంతకు మునుపు నా అధ్యయనం ఎంతవున్నా ఈ మహత్తర ఉపనిషత్తులు నన్నులోగొన్నాయి. అందులోని ఎరుక వెలుగు ఒక స్పిరిట్‌గా నన్ను పట్టుకుంది. కాలక్రమేణా వాటిని పరిశీలనాత్మకంగా అధ్యయనం చేశాను. వాటి స్ఫూర్తి నా కావ్యాలకు లభ్యమైంది. అందుకే ఆధునిక కాలంలోని సంప్రదాయ పద్య కవిత్వంలో నాది క్రొత్త త్రోవ. నాది ఉపనిషన్మార్గ కవిత్వం అని స్ఫుట ప్రకటన చేశారు.
* మీరు సంప్రదాయ వాద కవులా? సంప్రదాయాన్ననుసరించి రాసే కులా?
నేను సంప్రదాయ వాదకవిని కాను. అనుసురించే కవినే.
* మంచి భావాలతో పద్యాలు రాసే కవులు, మంచి ఇతివృత్తాలతో కావ్యాలు రాసే కవులూ ఉన్నారు. తమదైన ప్రత్యేక శైలి ఉన్న కవులు తక్కువమంది వుంటారు. అచ్చెరువు కూర్చే ‘స్వయంభువు’ అనదగిన పద్యకవితా శైలి మీకు ఉంది. ఈ శైలి సృజన మీకు ఎలా అలవడింది?
ఏమో! ఏమిటో? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రాచీనకాల ముఖ్య కవుల కవిత్వాలు పఠనశ్రవణ మననలతో భక్తిగా చదివాను. తరువాత కొన్ని దశాబ్దాలు అధ్యాపకునిగా విద్యార్థులకు వాటిని చెప్పాను. ఒక నూతన సృజనగా అమ్మవారు సరస్వతీదేవి నాకు ఆ శైలిని ప్రదానం చేసిందని నమ్ముతున్నాను.
* కవులు - ఉద్యమాలు సంబంధంగా మీ అభిప్రాయాలు?
స్వాతంత్య్రోద్యమంలో కవుల పాత్ర అందరికీ తెలిసినదే. కవులు ఉద్యమాల్ని దీప్తిమంతం చేశారే కాని నాయకత్వం వహించలేదు. వైదేశిక ప్రభావాలున్న తెలుగులో ఒక్క భావకవిత్వం మాత్రమే కవి నాయకత్వాల్లో నడిచిందనిపిస్తుంది. వివిధ కాలాల్లో తెలంగాణ ఉద్యమంలో కవులపాత్ర వుంది. దాశరథి, ఆరుద్ర, కాళోజీ, సోమసుందర్‌ల భాగస్వామ్యంగొప్పది. ఆంధ్రోద్యమంలో రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల, జాషువా మొదలైన వారి కవిత్వాలు ఉద్యమ దోహదాలు చేశాయి. మధునా పంతుల ఆంధ్ర పురాణ - ఆంధ్రోద్యమ ఫలమే!
* విమర్శల్లో ‘్భమ మార్గం’ అంటూంటారు దానికి దర్పణాలు ఏవి?
‘కర్పూర వసంతరాయలు కథా కళా ఝుంకృతులు’ వంటి నా విమర్శ గ్రంథాలు. పఠనయోద్యత బాగా వుండేలా కవి కావ్య వస్తు అనుసంధానాలు చేసి సులభంగా దగ్గరుండి ఒకరు చెబుతున్నట్లుగా విమర్శ వ్రాయడం భౌమ మార్గం అనే దానిని పెద్దలూ కొందరు ఆహ్వానించారు. విసుగనేది పాఠకునికి కలుగకుండా ఆ విమర్శ వుంటుంది. నా ఆలోచనా మధనం నా విమర్శ; నా హృదయ వ్యక్తీకరణం నా కవిత్వం. విమర్శ, కవితా సృజన నాలో సమాంతర మార్గాలే కాని ఎక్కువ తక్కువలు కావు.
* ఇటు జానపద దేశీయ సాహిత్య సంపదల్నీ, అటు తెలుగు, సంస్కృత ప్రాచీన కావ్య సంపదల్నీ వర్తమానం అనుభవించ వలసినంతగా అనుభవించడం లేదనిపిస్తుంది. ఇందుకు కారణం పాలక వ్యవస్థా? విద్యా వ్యవస్థా?
విద్యా వ్యవస్థలే ప్రధాన కారణం, మన సంస్కృతీ మూలాల్ని రక్షించుకోవాలని తరచు వింటూంటాం, అంటూంటాం. రక్షించుకుని శ్రద్ధల జాడలు అంతగా కనబడవు. జానపద, తెలుగు, సంస్కృత ప్రాచీన సాహిత్య నిధుల్ని తగినంతగా పాఠ్యాంశాల్లో పెట్టుకునే విద్యా వ్యవస్థ అన్ని శ్రేణుల్లోనూ వుండాలి. అప్పుడు వర్తమాన భవిష్యతరాలు అనుభవించగలుగుతారు.
* మీ ముఖ్య కావ్యాల గురించి కొన్ని మఖ్య విషయాలేమైనా...
వేయి నదుల వెలుగు, వెలుగు నగల హంస, అగ్నివృక్షం, చలువ పందిరి - ఈ కావ్యాలను ఉపనిషత్తుల భావజాల స్ఫూర్తి తో వ్రాశాను. ఆధునిక కాలంలో ఈనా మార్గంలో ఇలా వ్రాసిన వారు కనిపించరు. జ్వలిత కౌశల్య, త్రిజట ఈ రెండూ వాల్మీకి రామాయణ పాత్రలు. రాముడు అడవికి వెళ్ళినప్పుడు కౌసల్య పడిన వేదన నన్ను కరిగించింది. ఈ ఆలోచనలు నాజ్వలిత కౌశల్యలో దర్శనమిస్తాయి.
* విశ్వనాథ తో మీ అనుబంధం గురించి...
అది 1969 ప్రాంతం. అప్పటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల కళాశాలలో నేను చదువుకుంటున్న సందర్భం. ఆ కళాశాలలో జువ్వాడి గౌతమరావు గారికి అంకితమివ్వబడిన భ్రష్ట యోగి కావ్యావిష్కరణ. ఆ సభలో విశ్వనాథ మహాశయుని సమక్షాన మా తెలుగు అధ్యాపకులు కోవెల సంపత్కుమారాచార్య ప్రోత్సాహంతో ‘భ్రష్ట యోగి కావ్యంలోని ‘భ్రష్టయోగిని కవి జన్మబడసినాడ’ అనే మకుటమున్న నాలుగు పద్యాలు పాడాను. విశ్వనాథ ఆనందంతో వృద్ధిలోకి రాదగిన విద్యార్థి, మంచి కంఠం అని నన్ను ప్రశంసించడం ఓ తీపిగుర్తు.
‘‘సున్నితపు పద్య మెదలోన సుళ్లు తిరిగి /
తడిసి ముద్ధనై రాగాల తమలపాకు తీగనైతిని’’
అని సుకుమారంగా వ్రాసుకున్న కవికి ప్రశ్నోపనిషత్తు ఇష్టమే. కాని మృదువైన ప్రశ్నలే ఇష్టం కూడా. కేవలం సాంప్రదాయిక మార్గంలోనైనా ఈ కవి కావ్యాలు మరింత విస్తృతంగా విమర్శ గ్రంథాలవల్ల, సదస్సులువల్ల సభలవల్ల, రసజ్ఞ సహృదయులవల్ల ప్రచారం కావడం ఒక సామాజిక అవసరం అనిపిస్తోంది. ఎంత విమాన ప్రయాణం సాగించినా కుదుళ్ళ ఇళ్ళకు చేరవలసిందే. కిటికీలు తెరుచుకోవలసిందే.

సన్నిధానం నరసింహ శర్మ, 9292055531