నిజామాబాద్

ప్రశాంతంగా ‘టెట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 23: పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రశాంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు టెట్‌కు హాజరుకావడంతో, పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఉదయం వేళతో పోలిస్తే, మధ్యాహ్న సమయంలో నిర్వహించిన రెండవ పేపర్‌కు అత్యధిక సంఖ్యలో ఉన్న అభ్యర్థులతో పరీక్షా కేంద్రాలు రద్దీని తలపించాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 522మంది గైర్హాజరవగా, మిగతా వారు పరీక్ష రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ తెలిపారు. ఉదయం 9.30గంటల నుండి మధ్యాహ్నం 12.00గంటల వరకు జరిగిన మొదటి పేపర్(ఎస్‌జిటి) పరీక్షకు 5204మందికి గాను 5039మంది హాజరవగా, 165మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగిన సెకండ్ పేపర్ పరీక్షకు 8899 మంది అభ్యర్థులకు గాను 8542 మంది హాజరయ్యారని, 357 మంది గైర్హాజరైనట్టు డిఇఓ వివరించారు. జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కళాశాలల్లో మొత్తం 33సెంటర్లను టెట్ పరీక్షల కోసం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను అమలు చేస్తూ గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల విషయంలో గందరగోళానికి గురి కాకుండా తగు చర్యలు చేపట్టడం ఊరటనిచ్చింది. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ముందుగానే తేల్చి చెప్పడంతో అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎక్కడ కూడా లేటుగా వచ్చిన అభ్యర్థులు వెనుదిరిగి వెళ్లిన సంఘటనలు తమ దృష్టికి రాలేదని డిఇఓ రాజేష్ పేర్కొన్నారు. హరిచరణ్ ఆదర్శ హిందీ విద్యాలయం, కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డితో పాటు డిఆర్‌ఓ రమేష్, కలెక్టరేట్ ఎ.ఓ శ్రీకాంత్ తదితరులు తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు. వీరితో పాటు డిఇఓ రాజేష్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఇతర జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు జరిపారు. ఈసారి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఇతర శాఖలకు చెందిన వారిని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లుగా నియమించారు. ఇద్దరు చొప్పున అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో ఒకరు చొప్పున జిల్లా స్థాయి అధికారులకు స్క్వాడ్ బాధ్యతలు అప్పగించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించి, అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సాఫీగా పరీక్షలు జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పలు పరీక్షా కేంద్రాల్లో టేబుళ్లు, కుర్చీలు వంటి ఫర్నీచర్ సక్రమంగా లేకపోవడంతో అభ్యర్థులు ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలాఉండగా, నిజామాబాద్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న భూమేష్ అనే ఖైదీ కూడా హరిచరణ్ స్కూల్‌లోని సెంటర్‌లో టెట్ పరీక్ష రాయగా, ఈ కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ అతనిని కలిసి వివరాలు ఆరా తీశారు.