శ్రీకాకుళం

చోరీలతో బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 23: ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పగటిపూట దొంగతనాలు జోరందుకున్నాయి. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు చోరీలకు పాల్పడటంతో పౌరులు హడలెత్తిపోతున్నారు. ఇటువంటి వరుస సంఘటనలు ఇటీవలి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన త్రివిక్రమవర్మకు మరింత సవాల్‌గా మారాయి. నగరంలో ఉన్న అతిపెద్ద అపార్డుమెంటులో ఒకటైన క్రాంతి అపార్ట్‌మెంట్‌లో తాళాలు వేసిన ప్లాట్‌లో బంగారం, నగదును అపహరించుకుపోయిన మిస్టరీని నేటివరకు పోలీసు అధికారులు చేధించలేకపోవడం నగరవాసుల సైతం ఆందోళనకు గురౌతున్నారు. దీనిని మరువక ముందే ఆమదాలవలస పట్టణంలో పట్టపగలు తాళాలను పగలకొట్టి నగదు, బంగారాన్ని దోచుకుపోవడంతో అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ సంఘటన చోటు చేసుకున్న వెనువెంటనే శ్రీకాకుళం డిసిసిబి కాలనీ, రూరల్ మండలంలో వివిధ ఇళ్లల్లో అత్యంత చాకచక్యంగా చోరీలకు దొంగలు పాల్పడ్డారు. క్లూస్‌టీమ్‌కు కూడా నమూనాలు చిక్కకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించి అగంతకులు పోలీసు అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అంతేకాకుండా నరసన్నపేటలో కూడా పగటిపూట దొంగతనాలు కలకలం రేపాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడంలో పోలీసు అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఎప్పుడూ శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ విధుల్లో బిజీగా ఉండే పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది పగటిపూట దొంగతనాలు మిస్టరీని చేధించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. అయితే చోరీలకు పాల్పడ్డ వ్యక్తులు పోలీసులకు కనీస ఆధారాలు లభించకుండా దొంగతనాలను కొనసాగించడం మరింత సవాల్‌గా మారింది. పొరుగు రాష్ట్రంగా ఉన్న ఒడిశా నేరగాళ్లు, అలాగే బీహార్‌కు చెందిన ముఠాలు ఇటువంటి అపహరణలకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు పోలీసు శాఖాధికారులు భావించి పాత నేరగాళ్లుపై మరింత నిఘా పెంచి విచారణ ముమ్మరం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచి అపరిచిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టిసారించి పోలీసు అధికారులు అన్ని కోణాల్లోదర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల మూలాలను వెతికిపట్టుకోవడంలో పోలీసు అధికారులకు మరింత కష్టంగా మారింది. వీటికి తోడు సైబర్‌నేరాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకు అధికారులు, పోలీసు సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ తరహా నేరాల సంఖ్య అరికట్టలేకపోతున్నారు. బ్యాంకు ఖాతా నెంబర్లు ఏ టి ఎం పిన్‌నెంబర్లు సమాచారం ఇవ్వాలని బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని వివరాలు సేకరించి వెనువెంటనే సైబర్‌నేరానికి పాల్పడిన సంఖ్య పెరుగుతూ వస్తుంది. జిల్లాలో ప్రతీ రోజూ ఏదో ఒక ప్రాంతంలో సైబర్ నేరం నమోదు కావడం విశేషం. బ్యాంకు ఖాతాదారులు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు పేట్రేగి పోతున్నారు. వీటిని అరికట్టేందుకు మరింత సాంకేతికత జోడించినప్పటికీ నేరాలు షరామామూల్‌గా మారాయి. అస్కా ముఠా ఆగడాలకు కూడా అడ్డూఅదుపులేకుండా ఉన్నాయి. ప్రధాన రహదారులను లక్ష్యంగా ఎంచుకుని వివిద దొంగతనాలకు ఈ ముఠా సభ్యులు పాల్పడుతున్నారు. ఇటువంటి నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పోలీసు అధికారులకు గొలుసు దుకాణాలకు తాళాలు వేసే బాధ్యతను ప్రభుత్వం తాజాగా అప్పగించడంపై సామాన్యుల సైతం విమర్శిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని సజావుగా నడిపించాల్సిన అబ్కారీ శాఖ ఉన్నప్పటికీ బెల్టుతీసే బాధ్యతను పోలీసు బాసులకు కట్టబెట్టడం వలన శాంతిభద్రతల పరిరక్షణపై ఆ శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు చోరీలకు పాల్పడే ముఠాల గుట్టు రట్టు చేసి స్థానికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ప్రశాంతంగా హోమ్‌గార్డ్(డ్రైవర్ల) రాత పరీక్షలు
* పరిశీలించిన ఎస్పీ త్రివిక్రమవర్మ
శ్రీకాకుళం(రూరల్), జూలై 23: ప్రశాంతంగా హోమ్‌గార్డు(డ్రైవర్)రాత పరీక్షలు ఆదివారం మండలంలోని మునసబుపేటలోని గాయిత్రీ కళాశాలలో ప్రశాంతంగా జరిగాయి. ఈపరీక్షలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ పరిశీలించారు. ఈయనతోపాటు 16వ బెటాలియన్ కమాండెంట్ చక్రధరరావు, విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ జి.శ్రీకాంత్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగాయి. 10 నిముషాలు ఆలస్యంగావచ్చిన అభ్యర్థులకు కూడా వారి భవిష్యత్‌లో దృష్టిని ఉంచుకొని పరీక్షకు అనుమతించారు. ఉదయం 10 నుండి 11గంటల వరకు జరిగాయి.రాతపరీక్షకు 1917మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1892మంది మాత్రమే రాత పరీక్షకు హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అభ్యర్థులు ఎటువంటి అపోహలకు పోవద్దని నిజాయితీగా ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుందని స్పష్టంచేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఖచ్చితం గా ప్రతిభ కనబరిచిన వారికి విజయం వరిస్తుందన్నారు. ఈ రాత పరీక్షలో అర్హత సాధించినవారి జాబితా ఈ నెల 25న ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్ కార్యాలయం వద్ద తెరుపబడునని తెలియజేశారు. అర్హులైన వారు 27న విశాఖపట్నం, ఆనందపురం సమీపంలో గంభీర డ్రైవింగ్ ట్రాక్ వద్ద ఉదయం 6గంటలకు హాజరు కావాల్సి ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ ఎస్పీ షేక్ షరీనాభేగం, డీ భార్గవరావునాయుడు, చంద్రబాబులు, ఆర్‌ఐ కోటేశ్వరరావు ,శ్రీనివాస్‌కుమార్ ఉన్నారు.

సాగునీటి సరఫరా పునరుద్ధరించండి
* ఎండిపోతున్న ఉభాలు * దిగులు చెందుతున్న అన్నదాతలు
ఎచ్చెర్ల, జూలై 23: ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు నాగావళి నది పోటెత్తింది. దీంతో నారాయణపురం కుడికాలువను సంబంధిత అధికారులు గండ్లు పడతాయన్న భయంతో సాగునీటి సరఫరాను నిలిపివేశారు. అయితే ఇప్పటికీ సాగునీరును పునరుద్దరించకపోవడంతో ప్రధాన కాలువలో నీరు ప్రవహించని పరిస్థితి నెలకొంది. వర్షాలు అనుకూలించడం,కాలువలో సాగునీరు సరఫరా కావడంతో ఎంతో ఉత్సాహంగా ఉబా లు పూర్తి చేసేందుకు ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం అవన్నీ ఎండలకు ఎండిపోతున్నాయి. కనీస సాగునీరు కాలువలో సరఫరా కావ డం లేదని రైతులు మరింత దిగులు చెం దుతున్నారు. కుడి కాలువ ఆయకట్టుగా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో సుమారు 45వేల ఎకరాలు ఉబాలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కాలువ పనులు చేపట్టకపోవడంతో సాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని రైతు లు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా కూడా పూడికతీత పనులు పూర్తి చేసిన తరువాత కాలువలో నీరు నారాయణపురం ఆనకట్టు నుండి అధికారులు విడిచిపెట్టేవారు. ఈ ఏడాది మాత్రం ఎచ్చెర్ల మండలం పరిధిలో ఉన్న ఏడు కిలోమీటర్ల పొడవున ఎటువంటి పనులు చేపట్టకుండానే సాగునీరు సరఫరా చేశారు. పూడిక తీత పను లు పూర్తి కాకపోవడంతో ఎక్కడికక్కడే కాలువలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగిపోవడమే కాకుండా ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ ఛానల్‌కు నీరు సరఫరా చేసే మధుములు, డ్రాపులు, పూర్తిగా శిధిలావస్థకు చేరాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల వలన తోటపాలెం, కొత్తపేట, ముద్దాడ, కొంగరాం, రామజోగిపేట, భగీరధపురం, బొంతలకోడూరు, ధర్మవరం తదితర టైలాండ్ ఆయకట్టు భూములకు సాగునీరు అందడం గగనంగా మారింది. నారు మడులు పూర్తి చేసి 21 రోజుకే ఉబాలు వేయాల్సి ఉన్నప్పటికీ సాగునీరు అనుకున్న రీతిలో సరఫరా కాకపోవడం వీటిని నిల్వ చేసుకునేందుకు ఆయకట్టు చెరువులు లేకపోవడంతో దమ్ములు చురుగ్గా సాగడంలేదని రైతులు వాపోతున్నారు. ప్రతీ ఏటా సాగునీటి కష్టాల వలన పంట దిగబడి గణనీయంగా తగ్గిపోవడం వ్యవసాయ మదుపులు కూడా రాని దయనీయ పరిస్థితులు ఆ కుటుంబాలను వెం టాడుతున్నాయి. సాగునీరు సరఫరాలో జాప్యం జరగడం వలన నారు మడులు ముదిరి తెగుళ్లబారిన పడుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేసి టైలాండ్‌కు సాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం లస్కర్ల కొరత వల్లే సాగునీరు ముందుకు సరఫరా కావడం లేదని స్పష్టంచేస్తున్నారు. ఈ సమస్యను ప్రజా ప్రతినిధులు వద్ద ఏకరువు పెట్టుకున్నా ప్రభుత్వం కాంటాక్ట్ పద్ధతిలో నియామకాలు చేయడం లేదని అధికారులే పేర్కొంటున్నారు. దీనిపై పాలకులు స్పందించి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కలిసి లస్కర్ల నియామకంపై చర్యలు తీసుకుని అన్నదాతలకు సరిపడ్డ సాగునీరును సరఫరా చేయాలని టైలాండ్ రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
* సరఫరాను పునరుద్దరిస్తాం
కాలువలో సాగునీరు సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిఇ క్రాంతికుమార్ తెలిపారు. ఆనకట్టువద్ద ఇసుమ్యాట్‌లు కాలువపై వేస్తే ఇబ్బందులు ఎదురౌతాయని నిలిపివేశామన్నారు.

ఆడపిల్లగా పుట్టడమే తప్పా?
చిన్నారులను రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టిన తల్లి
చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగింత
టెక్కలి, జూలై 23: టెక్కలి రైల్వేస్టేషన్‌లో ఓ తల్లి నలుగురు చిన్నారులను శనివారం విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఆ చిన్నారుల ఆవేదనతో అంతా ఇంతా కాదు. ఆదివారం జరిగిన ఈ సంఘటన పలువురును ఆశ్చర్యాన్ని గురిచేసింది. వివరాల్లోకి పోలాకి మండలం, వనవిష్ణుపురంకు చెందిన సింహాచలం, పద్మ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. వారంతా 8 నుంచి రెండున్నర సంవత్సరాలు వయస్సు ఉన్నవారు. నెలలు ప్రాయం గల మరో పసికందు వుందని పద్మ పెద్దకుమార్తె రమణమ్మ తెలిపింది. కొద్ది నెలలుగా తన తండ్రి కనిపించడం లేదని అతనిని వెతికేందుకు తాము తల్లితో గత కొద్ది రోజులుగా రైళ్లులో తిరుగుతున్నామని, ఈ మేరకు శనివారం సాయంత్రం నౌపడ-గుణుపూర్ రైలులో టెక్కలిలో దిగామని, తమను దింపిన తల్లి నెలలు ప్రాయం వున్న చెల్లిని పట్టుకొని బయటకు వెళ్లిపోయిందని పెద్దకుమార్తె తెలిపింది. రాత్రి ఇక్కడే నిద్రపోయామని తెలిపింది. ఆదివారం అయోమయంగా తిరుగుతున్న నలుగురు చిన్నారులను పట్టణానికి చెందిన శంకరరావు గుర్తించి టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు టెక్కలి ఎస్‌ఐ రాజేష్ తన సిబ్బందితో రైల్వేస్టేషన్‌కు చేరుకొని చిన్నారులను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సి ఐ భవానీప్రసాద్ చొరవతో తల్లిదండ్రులు వచ్చేవరకు ఛైల్డ్‌లైన్ ప్రతినిధులకు సమాచారం అందించి ఛైల్డ్‌లైన్ ప్రతినిధి బి.అరుణ ఆధ్వర్యంలో పిల్లలను అప్పగించారు. పిల్లలు యాదవ కులానికి చెందిన పేదవారు కావడంతో కుటుంబానికి ఈ పరిస్థితి దాపురించి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తల్లిదండ్రులు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

విద్యుత్ సంస్థ రక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలి
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లారుూస్ యూనియన్
శ్రీకాకుళం(రూరల్), జూలై 23: విద్యుత్ సంస్థ రక్షణకు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణకు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని యునైటెడ్ ఎలక్ట్రసిటీ ఎంప్లారుూస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగబ్రహ్మచారి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రెవెన్యూ అతిధి గృహంలో పివి రమణమూర్తి అధ్యక్షతన జరిగిన విద్యుత్ ఉద్యోగు లు, కార్మికుల జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిధిగాపాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విద్యుత్ సంస్థలను దివాళా తీయించే సవరణలకు పార్లమెంట్‌లో ఆమోదించే ప్రయ త్నం చేస్తుందని ఈ సవరణ వలన ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేశంలోని పేదలకు, రైతులకు నష్టం కలిగిస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన అనంతరం రెండవ దశ విద్యుత్ సంస్కరణలు అమలు జరపాలని ప్రకటించినట్లు తెలియజేశారు. ఇది అమ లు జరిపినప్పటికీ ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాల్లో వైఫల్యం చెందాయని వాటిని ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరిపితే రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే భూమ్‌లాంటి ప్రైవేటీ కరణ లాంటి విధానాలు అమలు జరుపుతున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరణ లేదని యనమల రామకృష్ణుని కమిటీ నివేదిక ఇచ్చిందని సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనంఅమలు జరపడం లేదని పేర్కొన్నారు. ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఆర్. సూరిబాబు, యూనైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదర్శన, రమణాచారి, ఆర్.కుమారస్వామి, భూషణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సంతోషిమాతా శ్రావణమాస మహోత్సవాలు
శ్రీకాకుళం(రూరల్), జూలై 23: నగరంలోని కలెక్టర్ బంగ్లాకు సమీపంలో వేంచేసియున్న శ్రీ సంతోషిమాతా అమ్మవారి శ్రావణమాస మహోత్సవాలు సోమవారం(నేడు) వచ్చే నెల 21వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు మోదుకూరి కిరణ్‌శర్మ తెలియజేశారు. ప్రతీ ఏటా శ్రావణమాసంలో అమ్మవారి మసోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈనెలలో ప్రతీ శుక్రవారాల్లో భక్తులు విరివిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేస్తారని ఆయన తెలియజేశారు. రక్షాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యా శక్తి, వాగ్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తులు దేవిలో నిండి నివిడీకృతమై శ్రీకాకుళంలో వెలసిన అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబి నామ సంవత్సర శ్రావణశుద్ధ పాఢ్యమి సోమవారం నుండి శ్రావణ బహుళ అమావాస్య సోమవారం వరకు ఉత్సవాలు జరుగునని నిర్వాహకులు తెలిపారు. ప్రతీ రోజూ అమ్మవారికి సుప్రబాత సేవ, ఉషఃకాలార్చన, క్షీరాభిషేకం, అర్చన, నిత్య పూజలు, ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ లు, సహస్ర నామార్చన పూజ, శ్రీచక్రార్చన పూజ, రజిత 108 వెండిపువ్వులతో అష్టోత్తర శతనామార్చన పూజ, మహారాజభోగం వంటి కార్యక్రమాల నిర్వహిస్తారని తెలిపారు.

టిడిపి సంస్థాగత బూత్ కమిటీ శిక్షణ
శ్రీకాకుళం(రూరల్), జూలై 23: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో పార్టీ సంస్థాగత బూత్ కమిటీల శిక్ష ణా కార్యక్రమం జరిగిం ది. జిల్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, పార్టీ సంస్థాగత బూత్ కమిటీల నియామకం, కంప్యూటరీ కరణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు, వారి సహాయక సిబ్బంది ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల ట్రైనింగ్ కార్యక్రమం ట్రైనింగ్ అధికారులతో నిర్వహించారు. ప్రజల నుండి వచ్చే విన్నపాలు అధికారులు చుట్టూ తిరగకుండా ఎమ్మెల్యే ద్వారా వినతు లు మీ కోసం యాప్ నుండి ఎలా పంపించాలో పార్టీ సంస్థాగత బూత్ కమిటీల శిక్షణలో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, పాలిట్‌బ్యూరో సభ్యులు కావళి ప్రతిభాభారతి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందరశివాజీ, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, జిల్లా పార్టీప్రధాన కార్యదర్శి సాదు చిన్నకృష్ణంనాయుడు, సమన్వయ కార్యదర్శి మొదలవలస రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్ తదితరులు పాల్గొన్నారు.