మహబూబ్‌నగర్

అభివృద్ధే ధ్యేయంగా పని చేసిన మాజీ మంత్రి పులి వీరన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 23: మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన పులివీరన్న తన జీవిత కాలంలో జిల్లా అభివృద్ధి కోసం పరితపించారని డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. ఆదివావారం మాజీ మంత్రి పులివీరన్న జయంతిని పురస్కరించుకుని స్థానిక పద్మావతికాలనీలో గల ఆయన కాంస్య విగ్రహనికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళ్ళు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సైతం పులివీరన్న జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అందుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు బాగుపడినప్పుడు సమాజంలో మార్పు వస్తుందని భావించిన వ్యక్తి పులివీరన్న అన్నారు. పులివీరన్న నిబద్దత కలిగినేతగా పని చేశారని అన్నారు. జిల్లా కేంద్రంలో పలు నిర్మాణాత్మకమైన పథకాలను ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరి చేయించారని అన్నారు. ఆయన అడుగు జాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు తన హయాంలో ఎన్నో సేవలు అందించి పార్టీకి అట్టడుగు వర్గాల ప్రజల ఆదారాభిమాన్ని చూరగొల్పిన నాయకుడు పులివీరన్న అన్నారు. ఆయన హయాంలోనే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు తాగు నీటి పథకం జిల్లా కేంద్రానికి వచ్చిందన్నారు. జీవితకాలం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని ఆయన ఆయన సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకకర్త కృషి చేయాలన్నారు. మాజీ డిసిసి అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్ మాట్లాడుతూ మాజీ మంత్రి పులివీరన్న పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యన ఉండేవారని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాగంపై పట్టు సాధించారని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పులి అంజనమ్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, మిడియా సెల్ కన్వీనర్ సిజె బెనహర్, కాంగ్రెస్ మున్సిపల్ ప్లోర్ లీడర్ కట్టా రవికిషన్‌రెడ్డి, కౌన్సిలర్లు గంజి ఆంజనేయులు, నేతలు సంజీవ్‌ముదిరాజ్, పులి శిల్పెష్, పురుషోత్తం, రియాసత్, పటెల్ వెంకటేష్, అజ్మాత్, చంద్రకళారెడ్డి, నాగమణి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు తొలగుతున్న ప్రతిబంధకాలు
మహబూబ్‌నగర్, జూలై 23: పాలమూరు ఎత్తిపోతల పథకం తొలిదశ పనులు గాడిలోపడ్డాయి. నార్లాపూర్ నుండి మొదలుకుని కర్వెనా రిజర్వాయర్ వరకు జరుగుతున్న పనులకు ఇప్పుడిప్పుడే ప్రతిబంధకాలు తొలగిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12,30.000 ఎకరాలకు సాగునీరు 1300 గ్రామాలకు తాగునీరు అందించే బృహత్తర ప్రయత్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎత్తిపోతలకు సరిగ్గా రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కర్వేనా గ్రామంలో శంకుస్థాపన చేశారు. క్షేత్రస్థాయిలో గత రెండేళ్లుగా ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అడ్డంకులు తొలగి తొలిదశ పనుల్లో వేగవంతం పెరిగిందని చెప్పవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోసి నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుండి అర్ర టిఎంసి నీటిని డిండి ప్రాజెక్టుకు మళ్లించనున్నారు. ఈ నీటి మళ్లింపుపై ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం జిఓ సైతం విడుదల చేసింది. అయితే నీటి మళ్లింపుపై రగడ కొనసాగుతుంది. అయినప్పటికిని ప్రభుత్వం డిండికి అర్ర టిఎంసి నీటిని తరలిస్తామని స్పష్టంగా చెప్పింది. 1.5 టిఎంసి నీటిని పాలమూరు రంగారెడ్డి పథకానికి వినియోగించుకోవాల్సి ఉంది. పాలమూరు, డిండి పథకాలకు ప్రాణంగా నిలిచిన తొలిదశ పనులు ఇప్పుడిఫ్పుడే ప్రారంభమై పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు, 123 జిఓ ప్రకారంగా భూసేకరణ వద్దని హైకోర్టు తీర్పు, అలైన్‌మెంట్‌మార్పు, ఓపెన్‌పంప్‌కు బదులుగా భూగర్భ పంప్‌హాజ్‌కు నిర్మాణం, సాంకేతిన పరమైన కారణాలతో మొదటి ఫ్యాకెజి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేవలం అనుమతులు వచ్చిన పనులనే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి అప్రోచ్‌చానల్ తవ్వుతున్నారు. నీళ్లు వచ్చిన పనులకు ఆటంకం కాకుండా నిర్మిస్తున్న మట్టి ఆనకట్ట పూర్తికావచ్చింది. భూగర్భ పంప్‌హౌజ్ నిర్మాణానికి వీలుగా అడిట్ టనె్నల్ తవ్వకాలు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేస్తానని ప్రకటించగా ఇప్పటికే రెండేళ్లు పూర్తి అయింది. ప్యాకెజి-1 పనులు ఇలానే కొనసాగితే ఇంకో నాలుగైదేళ్లు గడిచిన నీరు వచ్చేది అనుమానమే. ఇక్కడ ఒక్కోపంపు 140 మెగావాట్ల గరిష్ట సామర్థ్యంలో 8 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న కల్వకుర్తిలో నాలుగు పంపుల మొత్తం సామర్థ్యం కంటే ఎక్కువ. 250 మీటర్ల ఎత్తు నుంచి ఐదు దశల్లో 670 మీటర్ల ఎత్తులో ఉన్న కెపి లక్ష్మిదేవిపల్లి పంపింగ్ చేయాల్సి ఉంది.
ఏదుల రిజర్వాయర్ పనులు వేగం
పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దాదాపు 50 శాతం పనులు పూర్తి కావస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల తొలి రిజర్వాయర్ ఎల్లూర్ గట్టుకు 30 కిలోమీటర్ల దూరంలోనే నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబందించి మట్టికట్ట పనులు నడుస్తున్నాయి. పర్యావరణం, అటవీ అనుమతులకు సంబంధించి గ్రీన్ ట్రిబ్యూనల్ కేసుల కారణంగా పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇక్కడ నుండి ఏదుల రిజర్వాయర్‌కు మధ్య 24 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఇక్కడ మాత్రం ఏదుల రిజర్వాయర్ పనులు మాత్రం వేగంగా చురుకుగా కొనసాగుతున్నాయి. ఏదుల రిజర్వాయర్‌లో పరిధిలో రోజుకు 30 మీటర్ల టనె్నల్‌ను తవ్వుతున్నారు. మరో నెలరోజుల్లో పంప్‌హౌజ్ నిర్మాణ స్థలానికి టనె్నల్ చేరుతుంది. పంప్‌హౌజ్ భూగర్భంలో నిర్మిస్తుండగా దని ఎగువన భూ ఉపరితలంపై 400 కెవి సబ్‌స్టేషన్ నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. అత్యాధునిక బామర్ వాహనంతో టనె్నల్‌ను తవ్వుతున్నారు. ఏదుల రిజర్వాయర్‌లో వచ్చే వర్షాకాలంలో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని మళ్లించి 1నుంచి 2 టిఎంసిల నీటిని నిల్వచేసే అవకాశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉన్న కల్వకుర్తి పథకం కెనాల్ వ్యవస్థ దీనికి ఉపయోగించుకునేలా సాధ్యాసాధ్యాలు, ప్రత్యామ్నాయాలపై యోచిస్తున్నారు. ఇప్పటికే ఏదుల రిజర్వాయర్ నిర్మాణం 50 శాతం పూర్తి అయింది. ఏదుల నుండి వట్టెంకు వెళ్లే దారిలో 3.5 కిలోమీటర్ వద్ద హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణం 70 శాతం పూర్తి అయింది. రెగ్గులేటర్ గేట్లు తెరవగానే వట్టెం రింగ్‌బండ్‌కు నీరు చేరేలా నిర్మాణం ప్రారంభించగా, రిజర్వాయర్ నిర్మాణం పనులు ఇప్పుడిప్పుడే వేగవంతమవుతున్నాయి. వట్టెం నుండి కర్వెనాకు నీరు వెళ్లే కాలువలు 30 శాతం పూర్తికాగా కర్వెనా రిజర్వాయర్ పనులు మాత్రం చురుకుగా సాగుతున్నాయి.
రూ.1500 కోట్లు ఖర్చు
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.35200 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో 2015-16 సంవత్సరంలో రూ.386 కోట్లు కాగా, 2016-17లోరూ.685 కోట్లు ఖర్చు చేశారు. 2017-18లో ఇప్పటి వరకు రూ.413 కోట్లు వెచ్చించారు. రాబోయే రెండు మొడేళ్లలో దండిగా నిధులు ఖర్చు చేస్తేనే ప్రాజెక్టు గట్టెక్కేది. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుకు భూమి 27290 ఎకరాలు అవసరం. ఇందులో 14457 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. ఇంకా 12833 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు 17 కేసులు వివిధ న్యాయ స్థానాల్లో నమోదయ్యాయి. నాలుగు కేసులు కోర్టు కొట్టివేయగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కొన్ని కెసులు కోర్టు కొట్టివేయడంతో ప్రస్తుతం జరుగుతున్న పనులను మాత్రం వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.

ఫేట తెరాసలో బయటపడ్డ గ్రూపు రాజకీయాలు
మహబూబ్‌నగర్, జూలై 23: నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలోనే తెరాస నేతలు తన్నుకున్నారు. ఏకంగా దాడులు చేసుకుని తలలు పగులగొట్టుకున్నారు. దాంతో నారాయణపేట టిఆర్‌ఎస్‌లో గత కొన్ని రోజులుగా ఉన్న గ్రూపురాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఆదివారం నారాయణపేట పట్టణంలోని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి క్యాంప్ కార్యాయలయంలో తెరాసవి సమావేశం జరిగింది. అనంతరం నియోజకవర్గ టిఆర్‌ఎస్ నాయకులతో ఎమ్మెల్యే పలు విషయాలను చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణపేట పట్టణానికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ మారుతితో పాటు మరో నియోజకవర్గ యువతనేత శ్రీపాద్‌ల మధ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలోనే ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీపాద్, మారుతిల మధ్య మాటకు, మాట పెరిగింది. ఒక్కసారిగా శ్రీపాద్ కౌన్సిలర్ మారుతిపై దాడికి దిగారు. దాంతో కౌన్సిలర్ మారుతి తలపగిలింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న నాయకులంతా అవక్కాయ్యారు. అయినప్పటికిని తలపగలడంతో కౌన్సిలర్ మారుతి తనను కొట్టడం ఏమిటని ఆవేశంగా శ్రీపాద్‌పైకి మళ్లి దూసుకెళ్లారు. అక్కడ ఉన్న టిఆర్‌ఎస్ నేతలు రక్తం కారుతూ తలపగిలిన మారుతిని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నేరుగా నారాయణపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శ్రీపాద్‌పై ఫిర్యాదుచేశారు. తనపై రాజకీయ కక్షలతో దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. వీరి మధ్య ఇసుక దందానే గొడవకు దారి తీసి ఉండొచ్చని జోరుగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నారాయణపేటలో ఉన్న సమయంలోనే ఈ గొడవ జరగుడం చర్చనీయాంశంగా మారింది. పేట నియోజకవర్గంలో తెరాసలో గ్రూపు రాజకీయాలకు ఇది నిదర్శనమని చెప్పకతప్పదు. ఇటీవల మంత్రి కెటిఆర్ నారాయణపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యాక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మరో నేత శివకుమార్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదిరించే ప్రయత్నం కూడా కోయిలకొండ చేశారు. కానీ 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా శివకుమార్‌రెడ్డి, టిడిపి తరపున ప్రస్తుత ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిల మధ్య హోరాహోరి పోరు జరిగింది. కేవలం తక్కువ ఓట్లతోనే రాజేందర్‌రెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కొంత కాలంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా శివకుమార్‌రెడ్డి ప్రముఖ పాత్ర పోసిస్తూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తీరా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టిడిపి గుడ్‌బై చెప్పి ఆయన కారు ఎక్కడంతో ఒక్కసారిగా శివకుమార్‌కు చెక్‌పెట్టినట్లు అయింది. దాంతో శివకుమార్ అనుచరులు నియోజకవర్గంలో నిరుత్సాహనికి గురయ్యారు. అయితే ఇటీవల పార్టీ కమిటీలు వేసిన తరుణంలో శివకుమార్ అనుచరులకు తగిన ప్రాధాన్యత ఎమ్మెల్యే ఇవ్వలేదనే విమర్శలు కూడా అప్పట్లో తెరాస కార్యకర్తలు బహిరంగంగానే వినిపించారు. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, శివకుమార్ అనుచరుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. మున్ముందు మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయేనని ఆ పార్టీ నేతలో ఈ సంఘటనతో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
మహిమాన్వితం శ్రీ రామకొండ
మహబూబ్‌నగర్ , జూలై 23 : రామనామ తారక మంత్రంతో కోయిలకొండలోని మహిమాన్వితమైన శ్రీరామకొండ నిండిపోయింది. రాష్ట్ర నలుమూల నుండి ఆదివారం అమావాస్య కావడం వేల సంఖ్యలో శ్రీరామపాద దర్శనానికి భక్తులు రావడం జరిగింది. కొయిలకొండ గ్రామం నుండి శ్రీరామకొండ వరకు భక్తుల తాకిడి నెలకొంది. గతంలో ఎన్నడు లేని విధంగా తెల్లవారుజామున మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులు క్యూలైన్‌లలో నిలబడి రామపాదాన్ని దర్శించుకున్నారు. అడుగడుగునా భక్తి భావంతో భక్తులు పులకరించిపోయారు. రామనామతారక మంత్రం పటిస్తూ వేల సంఖ్యలో శ్రీరామ దర్శనంతో భక్తులు పులకరించిపోయారు. ఆషాడమాసం ముగుస్తుండటం, శ్రావణ మాసం ప్రారంభం కావడం, ముఖ్యంగా అమావాస్య కలసి రావడంతో ఈ మారు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. ఇక భక్తులు ఆదివారం అమావాస్యరోజు శ్రీరామకొండపైకి చేరుకొని కోనేరులో పుణ్య స్నానం చేసి తడి బట్టలతో శ్రీరామపాదాన్ని దర్శించుకుంటే తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెల్లవారుజాము నుండే కొండ పైకి చేరుకొన్న భక్తులు స్వామి పుష్కరిణిలో భక్తితో స్నానం చేసి తడి బట్టలతో క్యూలో గంటల తరబడి భక్తితో నిలబడి శ్రీరామ పాదాన్ని దర్శించి తమ కోరికలు తీర్చుకున్నారు. విశేష మహిమాన్విత మైన శ్రీరామకొండకు మహిమ ఎలా వచ్చిందంటే శ్రీరామచంద్రుడు అరణ్య వాసకాలంలో ఈ కొండపై తమ పాదాన్ని పెట్టి సేదతీరడం జరిగిందని అందుకే కోండకు విశేష మహిమలు వచ్చాయని ఇక్కడి అర్చకులు పెర్కొంటున్నారు. రామ, రావణ యుద్ద సమయంలో లక్ష్మణుడు మూర్చపోందిన సమయంలో ఆంజనేయస్వామి సంజీవినీ కొండను తీసుకువేళ్లే క్రమంలో ఒక కొండ ముక్క ఇక్కడ పడటం ఆ కొండ మహిమాన్వితమైన ఔషద మూలికల కొండగా శ్రీరామకొండగా ఎర్పడింది. ఇక శ్రీరామపాదం, ఔషద మూలికల సమ్మేళంనంతో ఈ కొండకు అనేక మహిమలు రావడం జరుగుతుంది. ఇక్కడకు వచ్చిన భక్తులు ఎక్కువ మొత్తంలో తమకోరికలు తీరుతున్నాయని తమకు వ్యాదులు నయం కావడం జరుగుతుందని పెర్కొంటున్నారు. ఇక కొండపై వరకు పెద్ద సంఖ్యలో దుకాణాలు వేయడం జరిగింది. కొండ కింది భాగాన వాహనాలకు పార్కింగ్ ఎర్పాటు చేసినా అవస్థలు పడాల్సి వచ్చింది. కాగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు మాత్రం ప్రతీ ఆదివారం అమావాస్యకు లక్షల్లో ఆదాయం వస్తున్న దేవాదాయశాఖ, దేవస్థాన కమిటీ కనీస వసతులు కల్పించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు. మూత్రశాలలు, పార్కింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పెర్కొన్నారు. ఇక ఇదే అదునుగా అధిక ధరలతో టెంకాయలు, వాటర్ ప్యాకెట్లు అమ్మికొందరు. సొమ్ము చేసుకోవడం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి రాబోయో కాలానికి అయినా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇక సాయంత్రం వరకు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు శ్రీరామపాదాన్ని దర్శించుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కోయిల్‌కొండ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కొండపై పోలీసులు పలు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పోలీసుల సేవలను మాత్రం భక్తులు ప్రసంసించారు. కొండపై కొన్ని ప్రాంతాలలో భక్తులు క్యూలైన్‌ను ఆదమరిచితే కిందపడే ప్రమాదాలు ఉన్నాయి.పోలీసులు భక్తులకు అందిస్తున్న సేవలు, సూచనలు ఎంతోమేలు చేకూరుస్తున్నాయి.
మొక్కలను నాటి, పెంచండి
కల్వకుర్తి, జూలై 23: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేపట్టిన మూడవ విడత హరితహార కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని, మొక్కల పెంపకంతోనే గ్రామాలు పచ్చగా ఉంటాయని వాసవి క్లబ్ రాష్ట్ర అధ్యక్షులు సౌభాగ్య అదికేశవన్ అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో గల వాసవీ క్లబ్ భవనాన్ని సందర్శంచి మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం వాసవి క్లబ్ భవనంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ జూలురి రమేష్‌బాబుతో కలిసి వివిధ మొక్కలు నాటారు. అనంతర ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంతోనే గ్రామాలు పచ్చంగా ఉంటాయని, వాసవి క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు గోపాల్, కార్యదర్శి శ్రీ్ధర్, కోశాధికారి ప్రభాకర్, జోన్ చైర్మన్ లింగం, జిల్లా చైర్మన్ మనోహర్, సభ్యులు బాలకృష్ణ, విజయ్‌కుమార్, కృష్ణయ్య, రాఘవేంధర్, నర్సింహ్మ, శ్రీనివాసులు, వనిత క్లబ్ అధ్యక్షులు స్వాతి, రేణుక, మాదురి, స్వప్న, రఘుపతిపేట అధ్యక్షులు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.