కరీంనగర్

మహిళల ఆర్థిక స్వావలంబన... టిడిపి ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 23: నాడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్నిరంగాల్లో ముందంజలో ఉంటూ, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతేనని ఆ పార్టీ ధర్మపురి సెగ్మెంట్ ఇన్‌చార్జి జాడి బాల్‌రెడ్డి అన్నారు. నగరంలోని విజయపురి కాలనీకి చెందిన 60 మంది మహిళలు ఆదివారం ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ పథకాలతోనే తెలంగాణలో కూడా అత్యధిక సంఖ్యలోటిడిపి పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్ళు అస్తపురం పద్మ, చడిమెల ప్రమీల, వడ్లూరి లక్ష్మి,మేరుగు కొంరమ్మ, ఎదుల్ల నర్సమ్మ, ఎ.లచ్చవ్వ, ఎ.శంకరమ్మ,,మేక లచ్చవ్వ, కోడూరి మల్లవ్వల ఆధ్వర్యంలో 60మంది మహిళలు టిడిపిలో చేరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కుంబాల కిష్టయ్య, ఆకుల కాంతయ్య, కత్తుల లక్ష్మణ్, ఎదుల్ల లింగయ్య, గొల్లె అమర్, దీకొండ కిష్టయ్య, అస్తపురం దిలీప్, రావుల భాస్కరాచారి, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసి ఏజెంట్ల సేవలు గొప్పవి
హుజూరాబాద్, జులై 23: జీవిత బీమా ఏజెంట్ల సేవలు వెలకట్టలేనివని, గొప్పవని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని సా యిగార్డెన్‌లో ఆదివారం భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫి) ఆధ్వర్యంలో హుజూరాబాద్ బ్రాంచ్ ఎల్‌ఐసి ఏజెంట్ల సమావేశం జరిగింది. దీనికి 13 బ్రాంచ్‌ల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ జీవిత బీమా ఎజెంట్లు పరోక్షంగా దేశ సేవ చేస్తున్నారని, కుటుంబాలు అనాథలు కాకుండా బీమా ద్వారా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. బీమా పై పేద, మధ్యతరగతి కుటుంబాలకు పొదుపుఅలవడుతుందని, ఆర్థిక రక్షణ ఉంటుందన్నారు. ఎల్ ఐ సి ఎజెంట్లు ప్రజలను చైతన్యం చేస్తున్నారని, గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నారని కొనియాడారు. ఎల్‌ఐసి ఏజెంట్ల చాలా మంది నిరుద్యోగులే ఉన్నారని, బీమా ద్వారా రేయింబవళ్లు కష్టపడుతూ ఉపాధి పొందుతున్నారు. జీవిత బీమా ప్రతి ఒక్కరికి అవసరమని, ప్రతి ఒక్కరికి బీమా చేసే బాధ్యతను ఎల్‌ఐసి ఎజెంట్లు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. లియాఫి డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, కార్యదర్శి గట్టు రాజయ్య, బ్రాంచ్ ఎస్ బిఎం శ్రీనివాసరావు, ఎబిఎం దేవేందర్‌రావు, స్థానిక నాయకులు ఎల్క దేవాల్‌రెడ్డి, ఎస్ సత్తయ్య, నర్సింహారెడ్డి, చందుపట్ల సదానందం, గొల్లపల్లి రవిందర్, రాజ్‌కుమార్, శ్రీనివాస్, 500 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.
హరితహారంలో ప్రవాస భారతీయులు
మానకొండూర్, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చెపట్టుతున్న హరిత హారం మూడోవిడతలో భాగంగా ప్రవాస భారతీయులు స్వగ్రామంపై మమకారంతోమొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్నారంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పాకాల చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్దమ్మతల్లి దేవాలయం, హనుమాన్, రామాలయం దేవాలయంలో మొక్కలను నాటారు. సర్పంచ్ ఆరెల్లి సంపత్, మాజీ సర్పంచ్ పాకాల నర్సింహరెడ్డి, పాకల శ్రీకాంత్ రెడ్డి, ప్రవాస భారతీయులు, పాకల సురాజ్, పాకల సుజీత్, విశ్రప్ వాడి, హనుమాన్ దేవాలయం చైర్మన్ ఆట్ల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి రాచకట్ల రామస్వామి, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
రోడ్డు ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసి బస్సు నడుపుతాం
* రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి
తిమ్మాపూర్, జూలై 23: ప్రజలకు సేవలందించడంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుంటుందని, రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసి బస్సును నడుపుతామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ మండలంలోని ఆర్‌టిఎ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు వేసిందని, గతంలో బస్సులు పోనీ గ్రాగామాలకు బస్సులు నడుపుతామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ బస్ స్టేషన్ల ఆధునీకరణకు పది కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఆర్టీసి నుండి నాలుగు కోట్లతో మొత్తం 14 కోట్లు ఆధునీకరణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి బడ్జెట్‌లో ఆర్టీసికి వెయ్యి కోట్లు కేటాయించారన్నారు. ఈ సంవత్సరం 350 కోట్లతో 1400 బస్సులను కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకరంగా తీసుకుందన్నారు. మూడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో ఆర్టీసి చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆర్‌టిఎ మెంబర్ పెద్ది రమేష్‌బాబు, డిటిసి వినోద్ కుమార్, జడ్పీటిసి ఉల్లెంగుల పద్మ, ఎంపిపి ప్రేమలత, తహశీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపిడిఓ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె వెలుగు బస్సులతోనే తీవ్ర నష్టం
కరీంనగర్, జూలై 23: పల్లె వెలుగు బస్సులతోనే ఆర్టీసి సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా..నష్టాల నుంచి గట్టెక్కించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు కష్టపడుతూ లాభాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు సైతం ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణించి సం స్థకు చేయూతనివ్వాలని కోరారు. ఆదివారం కరీంనగర్ ఆర్టీసి ప్రధాన బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్టీసి ఎండి రమణారావు, ఆర్‌ఎం చంద్రశేఖర్‌తోపాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో, ఆర్టీసి జోనల్ వర్క్‌షాప్‌లో మంత్రులు మొక్కలను నాటారు.
హుజూరాబాద్: తెలంగాణ ఆర్టీసీ వ్యాపార దృక్పధంతో పనిచేయడం లేదని, గ్రామీణ ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని బస్టాండ్‌లో హరిత హారంలో భాగంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ మొక్కలను నాటారు. అనంతరం 90 కోట్లతో బస్టాండు ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రవాణా మాట్లాడారు. సీఎం గతంలో రవాణా శాఖా మంత్రిగా పనిచేసారని, ఆయనకు ఈ శాఖపై పట్టు, అనుభవం ఉందని తెలిపారు. ఈ మేరకు అన్ని బస్టాండ్లలో ప్రయాణీకులను ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 96 డిపోల ద్వారా వేలాది కార్మికులు, వందలాది బస్సు లు ప్రతి నిత్యం సేవలందిస్తున్నాయని, ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత, కార్మికులపై ప్రజలపై ఉందన్నారు. ప్పుఆర్థిక మంత్రి ఈటల మాట్లాడుతూ మ్మికుం ట, హుజూరాబాద్ ఆర్టీసీకి ముఖ్య కూడళ్లుగా ఉన్నాయని, నిత్యం వేలాది మంది ప్రయాణీకులు ఈ బస్టాండ్ల ద్వారా గమ్యానికి చేరుకుంటారని, ప్రయాణం చేస్తారన్నారు. ఆర్టీసీ ర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని, ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుక కృషి చేస్తామన్నారు. డిపో అధికారులు, వివిధ యూనియన్ల నాయకులు, నగర పంచాయతీ ఛైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ కొండల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ పనులు పూర్తిచేయాలి
* చిన్న నీటి పారుదల శాఖ ఇన్‌చార్జి ఇఇ రమేష్
పెద్దపల్లి రూరల్, జూలై 23: మూడవ విడుత మిషన్ కాకతీయ పథకం కింద ప్రారంభించిన చెరువు పునరుద్ధరణ పనులు త్వరిత గతిన పూర్తిచేయాలని పెద్దపల్లి డివిజన్ చిన్న నీటి పారుదల శాఖ ఇన్‌చార్జి ఇఇ రమేష్ సూచించారు. ఇక్క డ పనిచేస్తున్న ఇఇ రాంచంద్రం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో మంథని డిఇగా ఉన్న రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన పెద్దకల్వల గ్రామ సమీపంలో గల తన కార్యాలయంలో ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతలో 118 చెరువులు, కుంటల పునరుద్ధరణకు 48.92 కోట్ల రూపాయలు మం జూరు కాగా, 114 పనులు పూర్తి చేసినట్టు వివరించారు.
పాలకుల అండతోనే నేరెళ్లలో పాశవిక చర్యలు
* బాధితులను పరామర్శించిన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య
సిరిసిల్ల, జూలై 23: పాలకుల అండతో పాశవిక చర్యలకు పాల్పడటం ఖచ్చితంగా మానవ హక్కులను ఉలంఘించడమే అవుతుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంతాపురం బాలయ్య అన్నారు. ఆదివారం బాలయ్య సారధ్యంలో తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళ, జెల్లెల్లలో పోలీసు చిత్ర హింసల బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యంగ బద్దంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినా, స్థానిక శాసన సభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమైన నా యకుడిగా ఉన్న కె. తారకరామారావు ఇప్పటికీ స్పందించకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట బిఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త మాసారం సిద్దార్థ పూలే, రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షుడు సదుర్ల మల్లేశం, రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల వెంకన్న, మల్యాల రమేశ్, గడ్డం రవీందర్‌రెడ్డి, వరదవెళ్లి స్వామిగౌడ్, చాకలి రమేశ్, లింగంపల్ల మధుకర్, కొమ్ము ఆనంద్, జంగం మధు, లింగంపల్లి లక్ష్మణ్, దొబ్బల నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
‘ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి’
గోదావరిఖని, జూలై 23: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింపజేయాలని ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు యాసర్ల తిమోతి డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖనిలో హలో... మాదిగ, ఛలో... ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతామని స్వయంగా కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నాయకులు దళితులకు హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడంలో జాప్యం చేయడం సరైంది కాదని అన్నారు. జాప్యంపై నిరసనగా ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, యాతకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నెల 21 నుంచి 30వరకు ఢిల్లీలోని జంతర్ మంత్ వద్ద మహా ధర్నాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేగాకుండా దండోర మహాసభను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొట్టెపల్లి దుర్గాప్రసాద్, జూల అఖిల్, రమేష్, తోకల రమేష్, జనగామ రాజ్ కుమార్, చిట్యాల వెంకటేష్, శ్యాంసన్, శ్రావణ్, నర్సింగ్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాలువ అలైన్‌మెంట్ మార్చారు
* టిడిపి రాష్ట్ర కార్యదర్శి మేడిపల్లి సత్యం
గంగాధర, జూలై 23: గంగాధర ప్రాజెక్టు నుంచి వెళ్తున్న కుడి కాలువ అలైన్‌మెంట్‌ను గంగాధర చౌరస్తా వద్ద అధికారులు భూస్వాములతో కుమ్మక్కై మార్చారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి మేడిపల్లి సత్యం విమర్శించారు. ఆదివారం గంగాధర చౌరస్తాగుండా వెళ్తున్న కెనాల్ కాలువ పనులను చౌరస్తా సమీపంలోని పిట్టపల్లి గ్రామం వద్ద పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎల్లంపల్లి ఇఇ శివకుమార్ భూ స్వాములతో కుమ్మక్కై మొదట సర్వే చేసిన రెండవ అలైన్‌మెంట్ కాకుండా నాలుగవ అలైన్‌మెంట్‌ను తెరపైకి తెచ్చి పేద ప్రజల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. గంగాధర చౌరస్తాలో ఇంటి స్థలాల కోసం వేలాది రూపాయల పెట్టుబడులతో కొనుగోలు చేసిన భూములు కెనాల్ కాలువ కింద పోవడంతో పలువురు ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. భూములు కోల్పోతున్న ప్రతీ రైతు, ప్రతీ భూమి యజమానికి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ఇఇపై త్వరలోనే ఎసిబికి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు వైద భూపతి, మండల అధ్యక్షుడు మల్కాపురం రాజేశం, మండల బిసి సెల్ అధ్యక్షుడు వేముల ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి రావు, ఇప్పలపల్లి మధు, దొంతుల వేణుగోపాల్, పొన్నం తిరుపతి గౌడ్, పానగంటి సత్యం, పలువురు టిడిపి మండల, జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరిసిల్లలో 28న ‘ప్రజాగర్జన’
సిరిసిల్ల, జూలై 23: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 28న దళిత బలహీన వర్గాల ‘ప్రజా గర్జన’ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ‘్ఛలో రాజన్న సిరిసిల్ల’ పేరుతో నేరెళ్ళ దళితులపై ఎస్పీ విశ్వజిత్ కంపాటి జరిపిన దాస్టికమైన హింస దమనకాండక నిరసనగా ఈ భారీ బహిరంగ సభను దళిత బలహీన వర్గాల ఐక్య వేధిక నిర్వహిస్తున్నది. శుక్రవారం మధ్యాహ్నాం 12 గం.లకు తలపెట్టిన ఈ ప్రజాగర్జన బహిరంగ సభ పద్మనాయక కళ్యాణ మండపం పక్కన దళితుల భూమి మైదానంలో నిర్వహిస్తున్నట్టు కోఆర్టినేటర్, మాల మహనాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు వెల్లడించారు. అంతకు ముందు సిరిసిల్లలో దళితులు భారీ ర్యాలీ, ప్రదర్శనలు నిర్వహించి, సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ శాసన సభ్యులు, మతాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, శాసన సభ్యులు, టిడిపి నేత రేవంత్‌రెడ్డి, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ.మైసన్న, ఎంఆర్‌పిఎస్(దండోరా) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మదిగ, రాష్ట్ర ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జెల కాంతం, కరీంనగర్ జిల్లా మాజీ జడ్పి చైర్మన్ వడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కెకె.మహేందర్‌రెడ్డి, తదితరులు హాజరవుతున్నారు.
సింగరేణి కార్మికులను వేధించొద్దు
* ఎఐటియుసి కార్యదర్శి వైవీ రావు
యైటింక్లయిన్‌కాలనీ, జూలై 23: జాతీయ కార్మిక సంఘాల తలపెట్టిన సమ్మెలో పాల్గొన్న కార్మికులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని ఎఐటియుసి కార్యదర్శి వైవి.రావు అన్నారు. ఆదివారం యైటింక్లయిన్‌కాలనీ ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మె సందర్భంగా విధులకు హాజరు కాని కార్మికులను గుర్తించి ఛార్జిషీట్లు, బదిలీలు, ఇతరత్రా కారణాలు చూపుతూ వేధించడం సరైంది కాదని అన్నారు. హక్కుల కోసం పోరాటం కార్మికుల చేసిన తప్పా ప్రశ్నించారు. ఓసిపి-2 పని స్థలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భారీ యంత్రాలు వినియోగించక వృథాగా ఉన్నాయని, ముందస్తుగా అధికారులు ప్రభావిత గ్రామాల నుంచి భూసేకరణ చేపట్టక పోవడం వల్ల ఓబి మట్టి పనులు నిలిచిపోయి ఈ పరిస్థితి నెలకొంటుందన్నారు. 10వ వేజ్ బోర్డు మెరుగైన ఒప్పందాలు సాధించేందుకు ఎఐటియుసి కృషి చేస్తుందన్నారు.అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. సమావేశంలో నేతలు రాంచందర్, జగదీష్, వీరాచారి, వెంకన్న, రామ్మూర్తి, అమృతరావు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.