అదిలాబాద్

ప్రశాంతంగా టెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 23: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌సెట్) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించగా, జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లు గావించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య, ఎస్ ఈ ఆర్‌టి నుండి పర్యవేక్షకులుగా వచ్చిన సురేష్ పర్యవేక్షణలో పరీక్ష సాఫీగా జరిగాయి. మొత్తం 9054 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 8770 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
మొదటి పేపర్ పరీక్షకు 3520 మంది అభ్యర్థులకు గాను 3456 మంది హాజరుకాగా, రెండో పేపర్ పరీక్షకు మొత్తం 5534 మంది హాజరుకావాల్సి ఉండగా 5214 మంది విద్యార్థులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల్లో అవకతవకలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసేలా బాధ్యతలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సాఫీగానే జరిగాయని, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని డిఈవో లింగయ్య తెలిపారు.

టెట్ పరీక్షా కేంద్రాల తనిఖీ....
మంచిర్యాల, జూలై 23: టీచర్ ఎలిజిబిలిటి పరీక్ష (టెట్) పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. మంచిర్యాల జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల్లో 96.81 శాతం విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. అనంతరం పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వౌళిక వసతులను పరీశిలించారు.అనంతరం పరీక్షా హాలు సూపరింటెండెంట్లకు , జిల్లా విద్యాశాఖాధికారికి పరీక్షలు సజావుగా జరిగేందకు అన్ని చర్యలతో పాటు పర్యవేక్షించాలని తగు సూచనలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను పరిశీలించి భద్రత పరంగా తగు చర్యలపై అదేశాలు జారీ చేశారు. పరీక్ష జరుగు కేంద్రాలకు వెళ్లి టీచర్ ఎలిజిబిలిటికి సంబంధించిన ప్రశ్న పత్రాలను, ఎ.బి.సి. డి కోడ్‌లను పరీశిలించారు. పరిక్షలు జరుగు ప్రాంతాలలోజిరాక్స్ కేంద్రాలను మూసివేత, సెక్షన్ 144 అమలుతీరును పరిశీలించారు. విద్యార్థులు నిర్ణీత సమాయం కంటే ముందుగా చేరుకొని పరీక్షలు సజజావుగా సాగేందకు సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంత్ రావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కార్యాలయాలు నిర్మల్ నడిబొడ్డునే నిర్మించాలి
దివ్యనగర్, జూలై 23: అందరికి అందుబాటులో ఉండేవిధంగా నిర్మల్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు పట్టణంలోని నడిబొడ్డునే నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర బిసి మహాసభ నిర్మల్ కన్వీనర్ గుమ్ముల అశోక్ ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ అధికారులు, అధికారపార్టీ నాయకులకు తలొగ్గి పట్టణానికి దూరంగా ఉన్న భీమన్నగుట్టపై కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పేద, మద్యతరగతి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇకనైనా ప్రజలను దృష్టిలో ఉంచుకుని నూతన కార్యాలయాలు నిర్మించాలని ఆయన కోరారు.
కేంద్ర మంత్రిని కలిసిన జిల్లా నాయకులు
తాండూర్, జూలై 23: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నాయకులు ఆదివారం కేంద్ర కార్మిక సహాయ మంత్రి బండారు దత్తత్య్రేయను కలిసారు. వరంగల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రిని కలిసి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, ఓబి కార్మికుల సమస్యలు ఎదుర్కోంటున్న సమస్యలను వివరించారు. అదేవిధంగా రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌లో పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అయ్యేవిధంగా సంబంధిత రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవాలని దత్తత్య్రేయకు వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే మంత్రి దృష్టికి తీసుకుపోతానని మంత్రి హామీ ఇచ్చినట్లు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు జబి పౌడెల్, ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర నాయకులు బొనగిరి సతీష్, ఆసిఫాబాద్ జడ్పీటీసీ కొయ్యడ ఏమాజీ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్‌కు రాజీనామా
మోర్తాడ్, జూలై 23: మోర్తాడ్‌కు చెందిన దళిత, యువజన సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దళిత నేత శాస్ర్తీ నేతృత్వంలో సుమారు 50మంది యువకులు, సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెరాస రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌రెడ్డి నేతృత్వంలో తాము పని చేస్తామని వారు పేర్కొన్నారు.
సమస్యల సాధనకు 27నుంచి రిలే దీక్షలు
కంఠేశ్వర్, జూలై 23: తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 27వ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రపాణి తెలిపారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్లాబ్ రేట్లు పెంచడం లేదని ఆక్షేపించారు. దీంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు నిర్వహిస్తున్న కార్మికులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తోందని, కమీషన్‌ను కూడా పెంచకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి స్లాబ్ రేట్‌ను 12రూపాయలుగా చెల్లించాలని, పౌష్టికాహారం కింద గుడ్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని, తమను కార్మికులుగా గుర్తిస్తూ, కనీస వేతనాలు అమలు చేయాలని, సామాజిక ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ వంట పాత్రలు సమకూర్చాలని, సబ్సిడీపై వంట గ్యాస్‌ను పాఠశాలలకు సరఫరా చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ పథకం పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలకు అన్ని సంఘాల వారు మద్దతుగా నిలువాలని కోరారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.రమేష్‌బాబు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ఆర్.రాజన్న, డిటిఎప్ జిల్లా కార్యదర్శి బి.మల్లికార్జున్, ఎఐసిసిటియు జిల్లా కార్యదర్శి రఘురాం, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాధనాన్ని స్వాహా చేయడానికే పథకాలు
మంచిర్యాల, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పధకాలు చూస్తుంటే ప్రజాధనాన్ని స్వాహా చేయాడానికి తప్ప పేద ప్రజలకు మేలు జరిగిందేమి లేదని మాజి మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికే అరుణ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమే మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల కడుపులు నింపకుండా ప్రజాప్రతినిధుల జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఏన్నికల ముందు ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రజలకు ఎన్నో వాగ్దనాలు ఇచ్చి, అరచేతిలో స్వర్గన్ని చూపించారే తప్ప ప్రజలకు చేసింది ఎమి లేదన్నారు. అన్ని వర్గల ప్రజలకు మేలు జరిగేవిధంగా ఎన్నిక హామిలు ఉన్నప్పటికి పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళిత నామకులను అక్కున చేర్చుకున్నారే తప్ప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందిలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు అని చెప్పిన ముఖ్యమంత్రి కెసి ఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. తన కుటుంబం కోసం రాష్టన్న్రి సాదించుకున్నట్లు ఉందే తప్ప అమరుల త్యాగఫలంగా రాష్ట్ర ఏర్పాడి నట్లు లేదని అన్నారు. తన కుటుంబంతో పాటు బందువులకు ఉద్యోగాలు ఇచ్చుకునర్నారే తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మరో కాశ్మీర్ లాగా మారుస్తానాని , సింగరేణిలో బొందలగడ్డగా ఉండదు అని చెప్పిన ముఖ్యమంత్రి కెసి ఆర్ ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్నరని మండి పడ్డారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పటివారకు కార్మికుల హామిని నేరవేర్చలేదన్నారను.
పేద ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే ప్రతి పక్షలను పోలీస్ రాజ్యంను నడిపూస్తు ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నరని మండిపడారు. ప్రజలకు మంచి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి రాబోయే ఏన్నికలలో గెలుస్తానో ఓడిపోతామా అనే నమ్మకం లేక అభద్రత భవాంతో సర్వేలు చేయించుకుటుంన్నారని అన్నారు.
అనంతరం మాజి ఎమ్మెల్యే అరవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రుల కోసం చాపల చెరువులు ఎర్పాటు చేశామని గోప్పలు చెప్పకుంటుంది. 5వేల కోట్ల చేపలు పెంచుతే 25వేల కోట్లు సంపదించుకుటారని అంచానాలు వేస్తున్నారే తప్ప వారికి చేసింది ఎమి లేదన్నారు. హారిత హరం పేరుతో మొక్కలు నాటుతున్నరే తప్ప వారిని కాపాడేవారు లేరని అన్నారు. రెండు విడుతాలలో 11వేల కోట్ల మొక్కలు నాటుతే ఎ ఒక్క మొక్క కూడ లేదని అన్నారు. నాటినా మొక్కలు గోర్రెలు తింటే గోర్రెలను కోసి మంత్రులకు అండిపెడుతన్నారె తప్ప వాటిని రక్షించాడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధులు గోసుకుల శ్రీనివాస్ యాదవ్, బోట్ల సంధ్యరాణి, ఇంద్ర, మాజి ఎమ్మెల్యే సంజీవ్ రావు, జిల్లా నాయకులు చిట్ల సత్యనారయణ, రఘనాథ్‌రెడ్డి, ప్రభకార్, పత్తి గట్టయ్య, పట్టణ నాయకులు గరిగంటి కోమురయ్య, జిల్లా మహిళ నాయకురాలు గరిగంటి సరోజ, మండల నాయకులు మోతె కనుకయ్య కోయల్ కార్ శ్రీనివాస్, సుంకరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలి
*ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్
ఆదిలాబాద్, టౌన్, జులై 23: ప్రజా పంపిణీ పథకాన్ని, ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ షాపులలో 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలన్నారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు హమాలీల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కడుపుకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని, ప్రభుత్వ నిర్ణయాల వల్ల లక్షలాది మంది హమాలీ కార్మికులు, రేషన్ డీలర్లు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. మరో పక్క చక్కర పరిశ్రమలను మూసివేయడంతో రేషన్ షాపులో చక్కెర పంపిణీ నిలిచిపోయిందని, కిరోసిన్‌ను సైతం నిలిపివేసేందుకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను మానుకోవాలన్నారు. పేదల సరకులను సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు హమాలీ, రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 25 నుండి నిరవదిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, హమాలీ కార్మికులు అడెల్లు, ఇమ్రాన్, షేక్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
* మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్
తాండూర్, జూలై 23: ప్రజా సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నిరంతరం రాజీలేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా అన్నారు. మండల కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో ఆదివారం పార్టీ మండల కౌన్సిల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నడన్నారు. ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాలను బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
మండల కేంద్రంలోని రేచినిరోడ్ రైల్వేస్టేషన్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్డి నిర్మించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, బైపాస్ ఫొర్‌లైన్ నిర్మించాలని కౌన్సిల్ సభ్యులు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణించారు.
సమావేశంలో నాయకులు మామిడాల రాజేష్, పులుగం వెంకటేష్, వైనాల సారయ్య, కొండ బానేష్, మలిసెట్టి సత్యనారాయణ, సాలిగామ సంతోష్, ఆనంద్, చందు, రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.