కృష్ణ

పిఇటిల కౌనె్సలింగ్‌లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూలై 23: స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన వ్యాయామోపాధ్యాయుల బదిలీ కౌనె్సలింగ్‌లో తీవ్ర జాప్యం ఏర్పడింది. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావల్సిన కౌనె్సలింగ్ సాయంత్రం 5.30 ని.లకు ప్రారంభమైంది. పాఠశాల డైరెక్టరేట్ అధికారులు ఖాళీల వివరాలను సకాలంలో ఆన్‌లైన్ చేయకపోవటంతో ఈ సమస్య ఏర్పడింది. ఇతర జిల్లాల్లో ఖాళీల వివరాల విషయంలో కొంత సమస్య ఏర్పడగా దాన్ని సరి చేసే సరికి సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది. దీంతో కౌనె్సలింగ్ తీవ్ర ఆలస్యంగా ప్రారంభమై రాత్రి 10గంటలతో ముగిసింది. మొత్తం 190 మంది వ్యాయామోపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా 124 మంది కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. మిగిలిన వారు రిక్వెస్ట్ అభ్యర్థులు కావటంతో అనుకూలమైన ప్రాంతాలు లేని కారణంగా పాత స్థానాల్లో కొనసాగనున్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డి దేవానందరెడ్డి నేతృత్వంలో సాగిన కౌనె్సలింగ్ ప్రక్రియను బందరు ఆర్డీవో సాయిబాబు పరిశీలించారు.