అనంతపురం

చిగురిస్తున్న రైతుల ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 23 : తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతంది. దీంతో జిల్లాలోని హెచ్‌ఎల్‌సి ఆయకట్టు, గుంతకల్లు బ్రాంచి కెనాల్ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగైదేళ్లుగా ఆరుతడి పంటలు అరకొరగానే సాగు చేస్తున్నారు. ఈ ఏడాదైనా ఊరట కలిగితే బాగుండుననే అభిప్రాయం రైతాంగంలో వ్యక్తమవుతోంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జిల్లాలో సరైన వర్షాలు లేవు. అలాగే కర్ణాటకలో తుంగభద్ర ఎగువ ప్రాంతంలో సైతం వర్షాలు కురవక పోవడంతో ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నిండే పరిస్థితి లేదనే అనిపించింది. అయితే ఈ నెలాఖరులోగా వర్షాలు కురిస్తే ఫ్లడ్ ఇన్‌ఫ్లో పెరుగుతుందని, తద్వారా కొంత మేరకు సాగు, ముఖ్యంగా తాగునీటికి ఇబ్బంది ఉండదని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూలైలో సుమారు 20 నుంచి 23 టి ఎంసిల వరకు నీరు ప్రవాహనం తగ్గింది. గడచిన ఐదు క్రితం తుంగభద్ర జలాశయంలో సుమారు 16 టిఎంసిల నీరు మాత్రమే చేరింది. అదే సమయానికి గత ఏడాది 38 టిఎంసిల నీరు చేరింది. తుంగభద్ర రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టిఎంసిలు ఉంది. ఇందులో ఈసారి కనీసం 70-80 టిఎంసిల నీరు తుంగభద్రకు చేరితోనే ఇటు అనంతపురం, అటు కర్నూలు, కడప జిల్లాలతో పాటు కర్ణాటకలోని ఎడమవైపు కాలువల కింద పంటలకు, తాగునీటికి జలాలు విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారానికి తుంగభద్రలో 26.21 టిఎంసిల వరద నీరు చేరింది. గత ఏడాది ఇదే రోజున మొత్తం 40.51 టిఎంసిల నీరు చేరింది. ప్రస్తుతం 51,162 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2,556 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. హెచ్చెల్సీ పరిధిలో 2.849 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో అనంతపురం జిల్లాలో స్థిరీకరించబడిన ఆయకట్టు 1.45 లక్షల ఎకరాలుండగా, మిగతాది కడప, కర్నూలు జిల్లాలో పరిధిలో ఉంది. జిల్లా పరిధిలో గత ఏడాది 38 వేల ఎకరాల మేరకు ఆరుతడి పంటలు సాగు చేశారు. అందులోనూ హెచ్చెల్సీ నుంచి నీరు సరిగా రాకపోవడంతో పంటల చివరి దశలో వందలాది ఎకరాల్లో ఎండిపోయాయి. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవని కారణంగా నీటి మట్టం తుంగభద్ర జలాశయంలో పెరగక పోవడంతో బోర్డు అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. కాగా కర్ణాటక ప్రాంతంలో ఈ నెలాఖరులోగా భారీగా వర్షాలు కురిస్తే వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం కొద్దోగొప్పో వరద నీరు చేరుతుండటంతో హెచ్చెల్సీ ఆయకట్టులోని పిఎబిఆర్ రైట్ కెనాల్, ధర్మవరం బ్రాంచి కెనాల్ రైతులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలోని ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని విడుదల చేసే అవకాశం కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. అలాగే గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు కూడా నీటిని విడుదల చేస్తే కనీసం ఆరుతడి పంటలు పెట్టుకోవడానికైనా అవకాశం ఉందని రైతులు ఆశ పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది.
తీరుమారని కౌనె్సలింగ్!
అనంతపురం సిటీ, జూన్ 23: ఉపాధ్యాయ బదిలీల కౌనె్సలింగ్ గతంలో జరిగిన అనుభవాలను వదలకుండా రాత్రి సమయంలోనే బదిలీలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగానే ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల కౌనె్సలింగ్ కూడా రాత్రి సమయంలోనే జరుపుతున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు రోజుకొకటి తీసుకువస్తూ, వాటిని సరిచేసుకోవడానికి ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. ఆ సమస్యలను ఆన్‌లైన్‌లో సరిచేయడానికి రాష్ట్ర, జిల్లా విద్యా శాఖాధికారులు తలపట్టుకుంటున్నారు. ఉపాధ్యాయులు నివాసం ఉన్న చోటకు దగ్గర పాఠశాలలు రావాలనే ఉద్దేశ్యంతో కొన్ని తప్పులు చేస్తూ అక్రమ మార్గంలో పాయింట్లు వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాటిని మరొక ఉపాధ్యాయుడు లేదా మరొక ఉపాధ్యాయ సంఘం వాటిని ఎత్తిచూపుతూ కౌనె్సలింగ్ అడ్డుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయ కౌనె్సలింగ్‌కు ఈ విధానానే్న అనుసరిస్తూ ఆనవాయితీగా రాత్రి 9 గంటల తరువాతనే కౌనె్సలింగ్ ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఉదయం నుండి వేచి వున్న ఉపాధ్యాయులు నీరసించి పోయి రాత్రికి అడ్డుకోరనే రాత్రి సమయంలో కౌనె్సలింగ్‌ను సజావుగా జరుపుతారు. కానీ ఉపాధ్యాయ సమస్యలు పట్టించుకోకుండా రాత్రి సమయంలో బదిలీలను కౌనె్సలింగ్ నిర్వహించడం సరియైంది కాదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయినీలు పిల్లలతో రాత్రి సమయం వరకు వేచి ఉండడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇలాంటి ఆనవాయితీని మార్పు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీ పాయింట్లులో ప్రిఫరెన్షియల్ క్యాటగిరి, స్పౌజ్, క్యాటగిరి 4లాంటి అనేక అక్రమ మార్గంలో పాయింట్లుతో అనేక సమస్యలు ఉపాధ్యాయులు లేవనెత్తున్నారు. ఇందులో భాగంగానే అలాగే ఆదివారం జరగాల్సిన పిఇటి, పిడిల కౌనె్సలింగ్ పిఇటి సీనియార్టీ జాబితాలో నలుగురికి పాయింట్లు ఎక్కువగా పడ్డాయని, వాటిని సరిచేయాలని బదిలీల కౌనె్సలింగ్‌ను పిఇటి సంఘం నాయకులు అడ్డుకున్నారు. దీంతో డిఇఓ రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయానికి పంపి వాటిని సరిచేయాలని మెయిల్ చేశారు. నలుగురు పిఇటిలకు పాయింట్లు సరిచేసి సీనియార్టీ జాబితాను రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం నుండి రాకపోకపోవడంతో రాత్రి 9:30 నిమిషాలకు పిఇటి బదిలీల కౌనె్సలింగ్‌ను వాయిదా వేశారు. దీంతో ఉదయం నుండి వేచి ఉన్న పిఇటి, వారి భర్తలు, పిల్లలు తీవ్ర నిరాశకు గురై వెనుతిరగారు.
పిఇటి బదిలీ కౌనె్సలింగ్ నేటికి వాయిదా
పిఇటి బదిలీల కౌనె్సలింగ్‌ను నేటికి వాయిదా వేస్తూ జిల్లా విద్యా శాఖాధికారి పి.లక్ష్మినారాయణ తెలిపారు. పిఇటిల సీనియార్టీ జాబితాలో కొంత మార్పులు, చేర్పులు ఉన్న కారణంగా బదిలీల కౌనె్సలింగ్‌ను వాయిదా వేస్తున్నామని తెలిపారు. సీనియార్టీ జాబితాలో ఎక్కువ పాయింట్లు వచ్చాయని పిఇటిలు ఫిర్యాదు చేయగా, ఆ సమస్యను తీర్చలేనందుకు కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయు బదిలీల్లో భాగంగా నేడు జరగాల్సిన ఎస్‌ఎ తెలుగు, హిందీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ప్రారంభం కావాల్సిన పిఇటి కౌనె్సలింగ్ ఉదయం నుండి రాష్ట్ర విద్యా శాఖ మధ్యాహ్నం 2 గంటలకు సీనియార్టీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచితే వాటిలో నలుగురి పిఇటిలకు ఎక్కువ పాయింట్లు వచ్చాయని పిఇటిలు ఫిర్యాదు చేశారు. దీంతో బదిలీల కౌనె్సలింగ్ నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఫిర్యాదు మేరకు డిఇఓ రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయానికి మెయిల్ చేసి పిఇటి పాయింట్లను తగ్గించాలని రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర అధికారులు స్పందించకపోవడంతో పిఇటిల కౌనె్సలింగ్‌ను వాయిదా వేస్తూ డిఇఓ పి.లక్ష్మినారాయణ వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీంతో ఉదయం నుండి వేచి వున్న పిఇటిలు నిరాశతో వెనుతిరిగారు.

జడ్పీ పీఠంపై ఉత్కంఠ!
అనంతపురం, జూలై 23 : జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్‌గా కొనసాగుతున్న చమన్ ఈనెల 26న తాను రాజీనామా చేస్తానని మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం చేసుకున్న ఒప్పందం మేరకు రెండున్నరేళ్లు చమన్, మిగతా రెండున్నరేళ్లు గుమ్మఘట్ట జడ్పీటీసీ నాగరాజు కొనసాగేలా నిర్ణయించారు. ఆ మేరకు ఈ ఏడాది జనవరి 5 నాటికి చమన్‌కు ఇచ్చిన రెండున్నరేళ్ల గడువు ముగిసింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో మూడు నెలల పాటు వాయిదా పడింది. అనంతరం రాజీనామా చేయకపోవడంతో అధిష్టానం సీరియస్ అయింది. దీంతో తన జన్మదినంతో పాటు అనివార్య కారణాల దృష్ట్యా రాజీనామా చేయలేక పోయాయని, ఈనెల 15 తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో ఈనెల 13న నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశం ఆయనకు ఆఖరుదని అందరూ భావించారు. అయితే 15వ తేదీ దాటిపోయినా రాజీనామాపై స్పష్టత రాలేదు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని 26న రాజీనామా చేస్తానని చెప్పారు. ఇందుకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో బుధవారం రాజీనామా చేయాల్సి ఉంది. అయితే ఆ రోజైనా రాజీనామా చేస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా చమన్‌కు వారి మద్దతు కూడా ప్రత్యక్షంగా లేదని తెలుస్తోంది. కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో చమన్ రాజీనామా విషయంలో ఎవరూ సాహసించి అధిష్టానం ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేదు. అయితే బిసి అయిన పుట్టపర్తి నగర పాలక సంస్థ చైర్మన్ పిసి గంగన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఒప్పందం మేరకు ఆయన రాజీనామా చేయడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చమన్ కూడా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తుందా? లేక రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ లేదా వేరే సంస్థాగత పదవి ఇస్తామని చెబుతుందా? అనే విషయం తేలాల్సి ఉంది.
రహదారుల అనుసంధానం టిడిపితోనే సాధ్యం
బత్తలపల్లి, జూలై 23: గ్రామీణ ప్రాంతాలకు రహదారుల అనుసంధానం టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె హెచ్.జవహార్ అన్నారు. ఆదివారం మండలంలోని సంగాల గ్రామంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జ్వాలాపురం నుండి రాయలచెరువు వరకు ఒకటిన్నర కిలోమీటరు రహదారి నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణానికి ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణతో కలిసి మంత్రి హరిజవహార్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి ఎనలేనిదని, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తన శాయశక్తులా కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాన రహదారుల నుండి గ్రామీణ ప్రాంతాలకు రహదారుల అనుసంధానం చేయడం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడడమే గాక గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ధర్మవరం మండలంలోని పలు గ్రామాలకు బత్తలపల్లి, ముదిగుబ్బ మధ్యనున్న చిత్రావతి నదిలో నెలకొన్న ఇసుకలో తీవ్ర ఇబ్బందులుపడుతూ వెళ్తున్న ప్రజల రవాణా సౌకర్యం కోసం చిత్రావతి నదిలో బ్రిడ్జి, తారు, సిమెంటు రోడ్డు నిర్మించడానికి ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయించి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు నెలకొన్నా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంగాల సర్పంచ్ కమలమ్మ, టిడిపి కన్వీనర్ వీరనారప్ప, ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు, వెంకటేశ్వరచౌదరి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

తాడిపత్రిలో కెజిబివి ఘటనపై విచారణ
తాడిపత్రి, జూలై 23: స్థానిక పుట్లూర్ రోడ్‌లోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర విద్యా శాఖ జాయింట్ కార్యదర్శి నాగేశ్వరరావు, రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్‌లు విడివిడిగా తనిఖీలు చేశారు. కెజిబివిలో శనివారం 30మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విషయం విదితమే. అందుకు సంబందించి ప్రభుత్వం విచారణ చేపట్టింది. అమరావతి నుంచి వచ్చిన జాయింట్ కార్యదర్శి నాగేశ్వరరావు కెజిబివిలోని విద్యార్థినులతో విడివిడిగా విషయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, వండిన వంటకాల్లో ఇబ్బంది ఏమైనా ఉందాంటు విద్యార్థినులతో ఆరా తీశారు. పనిచేస్తున్న సిబ్బందితో వివరాలను సేకరించారు. ఫుడ్ శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు టెస్ట్‌కై పంపించామని, రిపోర్ట్ అందగానే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కెజివిపిలోని 200మంది విద్యార్థినులకు రెండు రోజులకు ఒకసారి మినరల్ వాటర్ ఆటోలో వస్తుందని, ఆ నీటిని తాగేందుకు మాత్రమే ఉపయోగిస్తారని, బోరు నీటితో వంటలు చేస్తారని విద్యార్థినులు విద్యా శాఖ జాయింట్ కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారని సమాచారం. అనంతరం అమారావతి నుంచి వచ్చిన అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్కూల్ హెల్త్ కన్సల్టెంట్ ప్రియాంక, జిల్లా సుబ్రహ్మణ్యం, ఎంఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నెట్టికంటి ఆలయంలో తిరుమంజన సేవ
గుంతకల్లు, జూలై 23: కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీసీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి తిరుమంజన సేవ ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీవారి జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్ ఆంజనేయస్వామికి ప్రాతఃకాలమున సుప్రభాత సేవ, మహాభిషేకం, వజ్రకవచ అ లంకరణ, విశేష పుష్పలంకరణలతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి మహానివేదన, మధ్యా హ్నం మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భా గంగానే వేదపండితులు, అర్చకుల ఆ ధ్వర్యంలో శ్రీవారి తిరుమంజన సేవ, యాగశాలలో శ్రీసీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ఎఇఓ మధు, ఆలయ అధికారులు, భక్తులు, పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తులు
ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున విచ్చేయడంతో ఆలయం భక్తజన సంద్రమైంది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ఆకుపూజ, వడల హారం, సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయివిద్యార్థుల అద్భుత నాటిక ప్రదర్శన
పుట్టపర్తి, జూలై 23: సత్యసాయి విద్యార్థులు అద్భుతమైన నృత్యనాటికలను ప్రదర్శించారు. నేను ఎవరు! అనే కథా సారాంశాన్ని పూర్తిగా తీసుకుని వివిధ నాటిక ప్రదర్శనలు చేశారు. మానవ జన్మ ప్రభావితం చేసే విషయాలు నాటిక ఘట్టాలుగా ప్రదర్శించారు. జీవితం అనేది నాటకం వంటిదని, అందులో పాత్రలు, సూత్రధారులు అనే విషయాలను కథాంశంగా రూపొందించి భక్తులకు కళ్లకు కట్టినట్లు చేసి చూపారు.
బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం
గోరంట్ల, జూలై 23 : ఎన్నికల హా మీ మేరకు రాష్టవ్య్రాప్తంగా బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపి మూసివేయి ంచామని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహ ర్ తెలిపారు. ఆదివారం కదిరికి వెళ్తూ మార్గమధ్యలో గోరంట్ల మాధవరాయస్వామి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వి లేఖరులతో మాట్లాడుతూ మహిళల ఆకాంక్ష మేరకు రాష్టవ్య్రాప్తంగా బెల్ట్‌షాపులను మూయించడమేకాక కల్తీమద్యం, నాటుసారా తయారీని అరికట్టినట్లు తెలిపారు. బెల్ట్‌షాపులకు మ ద్యం సరఫరా చేస్తే మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. రా ష్ట్రంలోని అన్నిజిల్లాలను సారా రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ సారా రవాణా ను అరికట్టడానికి టాస్క్ఫోర్స్‌ను ఏ ర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంతోపాటు వాటి క్రయ, విక్రయాల నివారణకు ప్రత్యేక పోలీసు బలగాలను నియమించామన్నారు. మద్యాన్ని ఎంఆర్‌పి ధరలకు మించి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వేరుశెనగతోపాటు ఇతర పంటలను సంరక్షించడానికి రెయిన్‌గన్‌లను సిద్ధం చేసి ఉంచామన్నారు. మరో నాలుగు రోజుల్లో ఎండుతున్న పంటలకు ఒక తడి నీరు అందిస్తామని తెలిపారు. కాగా చిత్రావతి నదిపై రూ.5 కోట్లతో నిర్మించనున్న వంతెనకు ఆగస్టు 4వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపి నిమ్మల కిష్టప్ప తెలిపారు. వంతెన నిర్మాణానికి అవసరమైన అనుమతులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, ఎంపిపి విద్యాధరణి, నిమ్మల శిరీష్, ఉపాధ్యక్షులు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.