హైదరాబాద్

డ్రగ్స్ కేసులో లోతైన విచారణ: చంద్రవదన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 23: డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్నామని, ఈ కేసులో ఎంతటివారు ఉన్న వదిలేది లేదని తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని పార్క్‌హయత్ హోటల్‌లో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టిసిఇఐ) నిర్వహించిన మూడవ అవార్డుల ప్రకటన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రగ్స్ అనేది సామాజిక సమస్యగా మారిందని అన్నారు. పబ్, క్లబ్ కల్చర్ పెరిగిపోతుండటంతో చిన్న వయస్సులో డ్రగ్స్ బారిన పడుతున్నారని అన్నారు.
డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను పాడుచేసుకోవడం విచారకరమని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు డ్రగ్స్ నిర్మూల కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కేసును సవాలుగా తీసుకొని మూలల వరకు వెళ్లి విచారణ సాగిస్తున్నట్టు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని కోరారు. టిసిఇఐ కార్యదర్శి నిరజ్ ఠాకుర్ మాట్లాడుతూ ఈనెల 25న హెటెక్స్‌లో ఈవెంట్ ఎక్స్‌లెన్స్-2017 పేరుతో అవార్డులను అందించనున్నట్టు చెప్పారు.
సే టు నో డ్రగ్స్ ర్యాలీని
ప్రారంభించిన చంద్రవదన్
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ నిర్వహించిన ర్యాలీని కమిషనర్ చంద్రవదన్ ప్రారంభించారు. ఈ ర్యాలీని బంజారాహిల్స్ నుంచి హైటెక్స్‌సిటి వరకు నిర్వహించారు. ర్యాలీలో ప్రధానంగా మత్తు పదార్ధాలవల్ల కలిగే నష్టాల వివరిస్తూ రూపొందించిన ప్లకార్డులను ప్రదర్శించారు.

33శాతం అడవులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

శేరిలింగంపల్లి, జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో 33శాతం అడవులను పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అటవీ, బిసి సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం సాహే సంస్థ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ సమీపంలోగల రేగుల కుంట వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. 40కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, ఇప్పటి వరకు సుమారు 10కోట్ల మొక్కలు నాటామని మంత్రి తెలిపారు. పచ్చదనం తక్కువగా ఉండడం వల్ల ఎండా కాలంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలకు చేరుకుని పక్షులు, జీవరాశులు మృత్యువాత పడడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మానవాళి మనుగడకు, జీవరాశులు బతకడానికి పచ్చదనాన్ని భారీగా పెంపొందించాల్సిన అవసరం మనందరిపై ఉందని, నాటిన ప్రతి మొక్క పెరిగి పెద్దయ్యేలా బాధ్యత తీసుకోవాలన్నారు. రాబోయే తరాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలంటే మనందరం ఇప్పటి నుంచే భారీ సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. జిహెచ్‌ఎంసి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్ టి. వెంకన్న, ఇరిగేషన్ ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి, సాహే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కల్పన, దీప్తిశ్రీనగర్ అధ్యక్షుడు రాచమళ్ళ నాగేశ్వర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నూతక్కి పూర్ణచందర్‌రావు, కె. సునీతా ప్రభాకర్‌రెడ్డి, భారతీయం సత్యవాణి, టిఆర్‌ఎస్ నాయకులు ఎస్. పురుషోత్తంయాదవ్, వాలా హరీశ్‌రావు, సంజీవరెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, బాలింగ్ గౌతంగౌడ్, రాజుయాదవ్, మాధవరం గోపాల్‌రావు, పివై రమేశ్, ఎస్. కవిత, చంద్రిక, విద్యార్థులు, పాల్గొన్నారు.

పేదల గోడు పట్టని కెసిఆర్
ఉప్పల్, జూలై 23: పేదల గోడు పట్టని కెసిఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని పర్వతాపూర్ పట్టణంలో ఇచ్చిన స్థలాలను బలవంతంగా లాక్కుని చెత్త డింపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ భూపోరాట సమితి ఆధ్వర్యంలో బాదిత మహిళలు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరుకుంది. ఆదివారం పర్వతాపూర్ చెత్త డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన రేవంత్‌రెడ్డికి మహిళల తమ గోడును ఏకరువు పెట్టుకున్నారు. ప్రభుత్వ సీలింగ్ 36 ఎకరాలలో 10 ఎకరాల భూమిలో అప్పటి ప్రజాప్రతినిధులు చూపించిన ప్రకారం 60 గజాల స్థలాలలో ఇళ్ల నిర్మాణం కోసం కష్టపడి కూడబెట్టిన డబ్బులతో గ్రానైట్‌తో బీస్మెట్ లేపి కబ్జాలో ఉన్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకుండా ఇచ్చిన స్థలాలను బలవంతంగా లాక్కొని డబుల్ బెడ్‌రూం ఇళ్లు, డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు కబ్జాలో ఉన్న పదెకరాల స్థలాన్ని వదిలేసి కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న మిగితా 26 ఎకరాల స్థలాలను బయటకు తీయకుండా పేదల స్థలాల జోలికి రావడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మహిళల న్యాయమైన డిమాండ్‌పై స్పందించిన రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇచ్చిన హామీలను గాలిలోకి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని మరిచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల జీవితాలతో అడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన హక్కుల సాధన కోసం ధర్నాలు చేయకుండా ఇందిరాపార్క ధర్నాచౌక్‌ను ఎత్తేస్తే కెసిఆర్‌కు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ధర్నా చౌక్‌లు తయారవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే డబ్బా ఇళ్లు కాదని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటి వరకు ఇళ్లు ఇవ్వకుండా కబ్జాలో ఉన్న ఇళ్ల స్థలాలను లాక్కొని చెత్త డంపింగ్ యార్డ్ చేస్తారా అని ధ్వజమెత్తారు. ఒకవైపు మూసీ దుర్వాసన, మరొక వైపు చెత్త డంపింగ్ యార్డ్‌తో ప్రజలు అనారోగ్యం పాలయితే మంచిదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కబ్జా చేస్తే పట్టించుకోని సర్కార్ కబ్జా కాకుండా కాపాడితే ఇచ్చిన స్థలాలను పేదల వద్ద బలవంతంగా లాక్కుంటారా ఇదెక్కడి న్యాయమని ధ్వజమెత్తారు. ఓట్లేసి గెలిపించిన ఆడబిడ్డలను ఒసేయ్.. అంటూ అగౌరవపరుస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చెప్పులు, చీపుర్లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎండల్లో తిండి లేక తిప్పలతో న్యాయమైన హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన పర్వతాపూర్ ఆడబిడ్డల కష్టాలు, గోడును స్వయంగా తెలుసుకోవడానికి కవితమ్మను వీరి వద్దకు పంపించాలని సిఎంను డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తిపన్నుతో జీతం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు బాధ్యతతో పని చేయాలని తెలిపారు. నిజాం నవాబ్ పాలనను తలపించే కెసిఆర్ సర్కార్‌ను తరిమి కొట్టేందుకు నడుంబిగించిన బాధిత మహిళలకు నిరంతరం టిడిపి అండగా ఉంటుందన్నారు. టిడిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బండి శోభ మాట్లాడుతూ మహిళలకు మర్యాద ఇవ్వని ప్రజాప్రతినిధులకు చీపుర్లతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి. వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇచ్చిన అరవై గజాల స్థలాల కోసం చేపట్టిన మహిళల ఆందోళనకు నిరంతరం అండగా ఉంటామని పేర్కొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు దేశగోని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో టిడిపి జాతీయ కార్యదర్శి అరవింద్‌కుమార్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ దేశగోని రఘుపతి గౌడ్, టిడిపి పీర్జాదిగూడ పురపాలక సంఘం కమిటీ ప్రధాన కార్యదర్శి జలంధర్‌రెడ్డి, నేతలు కౌడె పోచయ్య, టి.అశోక్ యాదవ్, చందర్ యాదవ్, వీరాచారి, సత్తిరెడ్డి, బిజెపి నాయకుడు మిట్ట నర్సయ్య గౌడ్ ప్రసంగించారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను
ప్రతిఘటించాలి
కాచిగూడ, జూలై 23: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు వక్తలు అన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ఆర్‌సిఇపి వ్యతిరేకంగా స్వేచ్ఛావాణిజ్య ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ప్రజా సదస్సు ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, జనస్వాస్థ్య అభియాన్ డాక్టర్ అమిత్‌సేన్‌గుప్త, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బిశ్వజిత్‌ధర్, అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ పాల్గొన్నారు. దేశ ప్రజలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల చట్టాలను రూపొందిస్తూ ముందుకు వస్తున్న కార్పొరేట్ ప్రపంచీకరణను తీవ్రంగా వ్యితిరేకించాలన్నారు. రైతు, కార్మిక సంఘాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. పార్లమెంట్‌లో ఆమోదం లేకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒప్పందంతో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉందన్నారు. వాణిజ్య సంస్థల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విశ్వ ప్రయాత్నలు చేస్తున్నాయని విమర్శించారు. బహుళజాతి కంపెనీలకు కట్టాబెట్టాలని చేస్తున్న ప్రయత్నన్ని సమర్థవంతంగా ఎదుర్కొవాలని పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భక్తిశ్రద్ధలతో వైభవంగా బోనాల జాతర

ఉప్పల్, జూలై 23: బోనాల జాతర ఆదివారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉదయం నుంచే మహిళలు కటుంబ సభ్యులతో కలిసి బోనాలతో ఆయా ప్రాంతాలలోని అమ్మవారి ఆలయాలకు ర్యాలీగా వెళ్లి అమ్మవారికి నైవిద్యం సమర్పించి కోరిన కోర్కెలు తీర్చుకున్నారు. నల్లచెరువు కింద గడ్డి పొలాల్లో ఉన్న ప్రధాన పోచమ్మ ఆలయం, రింగ్‌రోడ్డులోని ఈదమ్మ ఆలయం, మంకాళమ్మ ఆలయం, విజయపురికాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, కుమ్మరిబస్తీలోని మద్ది దొర్సానమ్మ ఆలయం, చెరువు కట్టకింద ఉన్న మైసమ్మ ఆలయం, చిల్కానగర్‌లోని పోచమ్మ, బంగారు మైసమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కందికంటి అశోక్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి బండారి లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల శివారెడ్డి, సల్ల రాజిరెడ్డి, దుబ్బ నర్సింహారెడ్డి, బిక్కుమల్ల అంజయ్య గుప్త, మాజీ కౌన్సిలర్ గుమిడెల్లి నారాయణ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. నగర శివారు మేడిపల్లిలో ఆదివారం బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది, భారీ పోలీసు బందోబస్తు మధ్య డప్పు చప్పుళ్లతో పోతరాజుల విన్యాసాలతో ర్యాలీగా మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయాలకు వెళ్లి నైవిద్యం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. పోచమ్మ, మంకాళమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, ఈదమ్మ, బంగారు మైసమ్మ, గ్రామ దేవత బొడ్రాయి తల్లికి పట్టణ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అల్వాల్: కంటోనె్మంట్ మూడవ వార్డు పరిథిలోని బాలంరాయిలో దేవి దండు మారెమ్మ దేవాలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అమ్మవారి బోనాల జాతర 50 సంవత్సరాలుగా ఘనంగా జరుపుకుంటుంన్నారు. ఉదయం నుండి అమ్మవారికి బోనం సమర్పించటానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బాలంరాయి, సుభాష్‌నగర్, ఫార్టీక్వాటర్సు, గౌరిశంకర్ కాలనీ, అంబేద్కర్ సోసైటీ, అవంతికాలనీ, అన్నానగర్, శివానగర్, పి అండ్ టి కాలనీ, విమాన్‌నగర్, పైగాకాలనీ, రసూల్‌పురా, ఘన్‌బజార్, మార్గదర్షికాలనీ, తోపాటు నల్లగుట్ట, కళాసిగుడా, మోండ మార్కెట్, మారెడ్‌పల్లి, బోయిన్‌పల్లి ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవి దండుమారెమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమనీ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా నమ్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి బోనాల జాతరలో జాతీయ యస్‌సి కమీషన్ సభ్యుడు కె. రాములు , రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లారెడ్డి, కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, కంటోనె్మంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి యస్‌విఆర్ చంద్రశేఖర్, కంటోనె్మంట్ బోర్డు సభ్యురాలు అనిత, బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ ముప్పిడి గోపాల్‌తోపాటు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్యారడైజ్ నుండి భారీ ర్యాలీతో ఫలహారం బండిని తీసుకవచ్చి అమ్మవారికి సమర్పించారు.
సెంట్రల్ జోన్ కార్యాలయంలో..
ఖైరతాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలను ఆదివారం జిహెచ్‌ఎంసి సెంట్రల్ జోన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిహెచ్ ఎంసి అధికార యూనియన్ సెక్రెటరీ శంకర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, డిఎంసిలు శ్రీనివాస్, సత్యనారాయణ, ఎఎంఓహెచ్‌లు రవికిరణ్, పల్వాన్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిహెచ్‌ఎంసి ఉద్యోగి బాబులాల్ నాయక్ బోనం ఎత్తుకొని డబ్బు, వాయిద్యాల మద్య అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పోతురాజుల నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ముగిసిన గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలు
నార్సింగి: చారిత్రత్మకమైన గోల్కొండ బోనాల ఉత్సవాలు అదివారం రోజున ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలో నెల రోజులుగా బోనాల పండుగ ఉత్సవాలు నగర ప్రజలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అయితే గోల్కొండ శ్రీ జగదాంభిక మహాంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ప్రశాంతమైన వాతావారణంలో బోనాల ఉత్సవాలను స్థానిక ప్రజలు జరుపుకున్నారు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంభిక (ఎల్లమ్మతల్లీ) మహాంకాళీ అమ్మవారికి ఆలయ కమిటి చైర్మన్ శేఖర్‌యాదవ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని బోనాలు ఘనంగా సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర పండుగల్లో బోనాల జాతర ఒకటని, చారిత్రత్మకమైన గోల్కొండ బోనాలు ఉత్సవాలు ఘనంగా ముగిసాయని అలయ కమిటీ చైర్మన్ శేఖర్ యాదవ్ అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రల విషయంలో పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వర్‌రావు, ఆసీఫ్‌నగర్ ఎసిపి గౌస్‌మోహినుద్దిన్, ఇన్స్‌పెక్టర్ సయ్యద్ ఫాయ్యాజ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును నిర్వహించారు. కాగా జలమండలి డివిజన్-3 జిఎం జి.స్వామి, డిప్యూటీ జిఎం జవహర్ అలీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచినీటి సదుపాయాలు కల్పించారని పేర్కొన్నారు.