హైదరాబాద్

పార్కింగ్ పాలసీపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల రద్దీ, బిజీ లైఫ్ కారణంగా పార్కింగ్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ పద్ధతి ప్రకారం పార్కింగ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలన్న జిహెచ్‌ఎంసి ప్రతిపాదనపై సర్కారు కసరత్తుకు ఆమోదం తెలిపింది. నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా ప్రజారవాణ వ్యవస్థను మెరుగుపర్చటంతో పాటు వ్యాపార సముదాయాలెక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ కోసం సరికొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.
ప్రస్తుతమున్న ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, వాహనరాకపోకలను మెరుగుపరిచేందుకు అవసరమైన చోట పార్కింగ్‌ల ఏర్పాటులో జిహెచ్‌ఎంసి అనుసరించాల్సిన విధి విధానాలను కూడా ఆ ఆదేశాల్లో వెల్లడించింది. ముఖ్యంగా నగరంలో దశాబ్దంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎప్పటికపుడు రోడ్లను విస్తరించుకుంటున్నా, వాహన రాకపోకలకు ఆశించిన స్థాయిలో రోడ్డు సద్వినియోగం కావటం లేదు. ఇందుకు రోడ్డుకిరువైపులా చేస్తున్న అక్రమ పార్కింగ్ ప్రధాన కారణం, కాగా, పలు రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఎక్కువ సేపు వాహనాలను నిలుపుకునేందుకు సబ్ రోడ్లకిరువైపులా, రద్దీ ప్రాంతాలకు సమీపంలో ఖాళీ స్థలాలున్నా ఉన్నా, వాటిని షార్ట్ స్టే పార్కింగ్‌కు వినియోగించటం లేదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీనికి తోడు నిత్యం రద్ధీగా ఉండే మార్కెట్లు, బజార్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్, పర్యాటక ఇతరాత్ర బిజీ ప్రాంతాల్లో, వ్యాపార కార్యకలాపాలు కొనసాగే ప్రాంతాల్లో తక్కువ సమయంలో వాహనాలు నిలిపే విధంగా పార్కింగ్ వసతి కల్పించే అంశంపై కూడా జిహెచ్‌ఎంసి కసరత్తు చేయనుంది. ప్రస్తుతం నగరంలో జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన అధికారిక పార్కింగ్‌లో కంటే, అక్రమ, అనధికార పార్కింగ్‌లలోనే ఎక్కువ సమయం వాహనాలు పార్కింగ్ చేసి ఉంటున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ రకమైన ప్రాంతాలను ఎంపిక చేసిన ఆయా ప్రాంతాలకు వచ్చే వాహనాలకు నామమాత్రపు ఛార్జీలకే ఒకే చోట పార్కింగ్ సౌకర్యం కల్పించాలా? లేక తక్కువ సేపు వాహనాలను పార్కింగ్ చేసుకునేలా షార్ట్ స్టే పార్కింగ్‌లను ఏర్పాటు చేయాలా? అన్న విషయంపై త్వరలోనే జిహెచ్‌ఎంసి, నగర ట్రాఫిక్ పోలీసులు సమష్టిగా అధ్యయనం చేయనున్నారు. ఛార్జీల నిర్ణయించేందుకు అవసరమైతే రెగ్యులేటరీ అథారిటీని కూడా నియమించుకోనున్నట్లు సమాచారం. వ్యాపార సంస్థలు, ప్రాంతాలకు సమీపంలోని ఖాళీ స్థలాల్లో మల్టీలెవెల్ పార్కింగ్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. పార్కింగ్‌లను ఏ రకంగా అందుబాటులోకి తెచ్చినా, వాటిని ప్రైవేటు నిధులతోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ రకంగా వివిధ పార్కింగ్‌లను ప్రభుత్వం ప్రతిపాదిస్తూనే వాహనాల రాకపోకలకు ప్రస్తుతం ట్రాఫిక్ పరంగా ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించటం, అలాగే రోడ్డు భద్రత, పాదచారుల భద్రత వంటివి దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేయలని జిహెచ్‌ఎంసికి సూచించింది. పాలసీ గైడ్‌లైన్స్‌ల ఉల్లంఘనకు పాల్పడే వారి నుంచి జరిమానాలు వసూలు చేసేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ అధ్యయనం కొనసాగాలని ఇటీవల జారీ చేసిన జివోలో సర్కారు పేర్కొంది.