హైదరాబాద్

శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 23: శిల్పారామంలో ప్రదర్శించిన కథక్, భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. బెంగళూరు కథక్ కళాకారుడు కార్తిక్ శెట్టి నృత్య ప్రదర్శనలో పాలనేత్ర, తాళ్‌మాలా, సితార్ ఖహాని, త్రివత్, తరాణ మల్‌హర్‌రాగ్ అంశాలతో కనువిందు చేశారు. బెంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారిణి కుమారి క్షమిత శాస్ర్తీ.. పుష్పాంజలి, నరసింహ కౌతం, ప్రదోష నమయామి, అఖిలాండేశ్వరి, థిల్లాన అంశలపై నృత్యం చేసి ఆకట్టుకున్నారు. నగరానికి చెందిన కుమారి శ్రీజ.. భరతనాట్యం శైలిలో మహదేవ సోత్రం, శివ తాండవ సోత్రం, థిల్లాన అంశాలను ప్రదర్శించి సందర్శకులను మెప్పించారు. కళాకారులను అధికారులు జ్ఞాపిక అందించి సన్మానించారు.