హైదరాబాద్

హామీలకే పరిమితమైన టిఆర్‌ఎస్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, జూలై 23: ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని మాజీ మంత్రి సబితారెడ్డి విమర్శించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గ్రామంలో రాజీవ్‌గృహకల్ప ఇళ్ల లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆందోళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సబితారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని అమలు చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు సొంత ఇంటి కల నిజం చేయడం కోసం పట్టణ ప్రాంతాలకు రాజీవ్ గృహకల్ప, గ్రామీణ పాంత్ర ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ప్రారంభించిన్నట్లు తెలిపారు. నగర శివారులో ఉన్న శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామలలో ఉన్న నిరుపేదలకు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణం చేసినట్లు తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి మృతి తర్వాత రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. వెంటనే లబ్ధిదారులకు ఇవ్వలేకపోయామని, రెండు సంవత్సరాల కింద ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం.. లబ్ధిదారులకు ఎందుకు ఇళ్లను కేటాయించడం లేదని ప్రశ్నించారు. లబ్ధిదారులు డబ్బులు చెల్లించి అప్పుల ఊబిలో కురుకుపోయి ఇబ్బందులు పడుతున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. యువనేత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రెండు సార్లు గెలిచినా శంషాబాద్‌లో ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంపిపి ఎల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేదలకు మేలు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శ్రావణ్ గౌడ్, జడ్పీటిసి సతీష్, మాజీ ఎంపిపి మురళిధర్ రెడ్డి, ఎంపిటిసి దేవిలి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణు గౌడ్, సర్పంచ్‌లు రాచమల్ల సిద్ధేశ్వర్, వై.సిద్ధేశ్వర్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోపాల్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిరణ్ గౌడ్, హుమ్లా నాయక్ పాల్గొన్నారు.