వరంగల్

దూరదర్శన్ ఆటపాటకు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జులై 24: దూరదర్శన్ టివి చానెల్‌లో ప్రసారమయ్యే ఆటపాట కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన కళాకారులు ఎంపికయ్యారు. చానెల్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ఆటపాట కార్యక్రమానికి మండలంలోని దేవరాంపల్లి (రేగులగూడెం)కు చెందిన పులి రాధిక బృందం ఎంపికయ్యారు. ఈ మేరకు దూరదర్శన్ కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందించినట్లు కళాకారుల బృందం నాయకురాలు పులి రాధిక తెలిపింది. రైతుల కష్టాలు, ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలు, ఇతర సామాజిక రుగ్మతలపై తమ బృందం ఆటపాట కార్యక్రమంలో గళం వినపిస్తారని పులి రాధిక తెలిపారు. ఎంపికైన వారిలో చిట్యాల మమత, ఉప్పు స్పందన, కొయ్యాడ శరణ్య, ఊరెల్లి సుప్రతిక, మహేశ్, కోట రమ్య, గడ్డం స్వరూప, స్వామి ఉన్నారని పులి రాధికలున్నారు.
విద్యాప్రమాణాలు పాటించని విద్యాసంస్థలు
వడ్డేపల్లి, జూలై 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా, విద్యాప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ప్రభు త్వం కొమ్ముకాస్తున్నదని తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ సంతోష్ నాయక్ ఆరోపించారు. సోమవారం విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుండి అర్బన్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, వారిని స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు రోడ్డుపైనే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ నాడు సమైక్య రాష్ట్రంలోని విద్యావ్యవస్థ కంటే స్వరాష్ట్రంలోనే విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వకుండా విద్యార్థులను ప్రభుత్వం ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని మండిపడ్డారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి, పాఠశాలలను మూసి వేసే ప్రక్రియ మానుకుని, పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాయిరాం, దిలీప్, శరత్, కుమార్, వేణు, తదితరులు పాల్గొన్నారు.
ఒకటి నుంచి అక్షయపాత్ర
వరంగల్, జూలై 24: వరంగల్ అర్బన్ జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీనుంచి అంగన్‌వాడీ కేంద్రాలలో అక్షయపాత్ర నిర్వహణపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో మహిళా, శిశు సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో అక్షయపాత్ర కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అంగన్‌వాడీ కేంద్రాలలో మధ్యాహ్నం ఒంటిగంటలోగా పిల్లలకు భోజనం అందేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో భోజనాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా ముందుగానే రూట్‌మ్యాప్ రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంపికచేసి మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి శైలజకుమారి, సిడిపిఓలు మధురిమ, సులోచన, విశ్వజ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాదివాస్‌లో అమర్యాదగా వ్యవహరిస్తే చర్యలు
పరకాల, జూలై 24: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ భాస్కరన్ ప్రజాదివాస్ కార్యక్రమం ద్వారా బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ ప్రజాదివాస్‌కు వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. ప్రజల కోసం ప్రజాదివాస్ కార్యక్రమం ఉందన్న విశ్వాసాన్ని బాధితుల్లో నింపాలని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారం తాత్కలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాదివాస్‌లో ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి... ఏ ఏ మండలాల నుండి ఎక్కువగా వస్తున్నాయి, ఏలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, పోలీసు అధికారులు వాటిని పరిష్కరిస్తున్నారా లేదా అనే విషయాలపై తన మ్యానిటరింగ్ ఎప్పటికప్పుడు ఉంటుందని చెప్పారు. ప్రజలు తమ బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వారితో నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన పోలీసు అధికారులను హెచ్చరించారు.అనంతరం పలు విషయాలపై మాట్లాడారు.
సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని సంబందిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఎస్పీ ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణా ఆపాలని విజ్ఞప్తి
జనగామ టౌన్, జూలై 24: అక్రమ ఇసుక రవాణాను ఆపి వేయాలని కోరుతూ జనగామ మండలం పెద్దపహడ్ గ్రామానికి చెందిన పలువురు రైతులు సోమవారం కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు విజయ భాస్కర్‌రెడ్డి, చంద్రయ్య, జయచంద్రారెడ్డి, యాదగిరిలు విలేఖరులతో మాట్లాడారు. గత కొన్ని మాసాలుగా గ్రామ శివారునుండి ట్రాక్టర్లద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఇసుక తరలించే దళారులకు సర్పంచ్ మద్దత్తివ్వడం వల్లనే ఈ దందా దినదినం అధికమవుతుందని ఆరోపించారు. ఈ విషయంపై కొంతమంది గ్రామస్థులు ప్రశ్నిస్తే గ్రామపంచాయితికి ఆదాయం సమకూరుతుందని అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మిస్తున్నాడని అన్నారు. ఎలాంటి రశీదులు లేకుండానే వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుకను జనగామ పట్టణానికి తరలిస్తున్నారిని వివరించారు. పెద్దపహడ్‌నుండి గానుగపహడ్ వెళ్లేరోడ్డు అధ్వాన్నంగా తయారై ప్రజలకు ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. గత రెండురోజుల క్రిందట గ్రామస్థులు, రైతులు ట్రాక్టర్లను అడ్డగించగా ఇసుక వ్యాపారులు వారిని దుర్భాషలాడడమే కాక బెదిరించారని అన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి వెంటనే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామ ప్రజలంతా ఏకమై వారిని అడ్డుకుంటామని అన్నారు. దొడ్డిబండ సిద్దులు, రాఘవరావు, లక్ష్మి, బాలు, నర్సయ్య, బాలమల్లు, కర్ణాకర్ పాల్గొన్నారు.
జిఎస్టీ నిబంధనల మేరకు ఉత్పత్తుల ధరలు ఉండాలి
వరంగల్, జూలై 24: కేంద్రప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన జిఎస్‌టి ప్రకారం ఆయా ఉత్పత్తుల ధరలు నిర్ణయించాలని రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిఎస్టీ విధానంలో కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగగా, మరికొన్నింటి ధరలు తగ్గుతాయని చెప్పారు. జిఎస్టీ నిబంధనలకు భిన్నంగా ఎక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వ్యాపారులకు స్పష్టం చేసారు. సోమవారం రూరల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారులకు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతు ఈనెల ఒకటవ తేదీనుంచి దేశం మొత్తంలో ఒక దేశం- ఒకే పన్ను పేరిట జిఎస్టీని కేంద్రం అమలులోకి తీసుకువచ్చిందని చెబుతు ఈ కొత్త పన్ను విధానం కింద ఉత్పత్తులపై వెంటనే కొత్త ధరలు ముద్రించి విక్రయించాలని చెప్పారు. గతంలో అమలు జరిగిన వ్యాట్ ప్రకారం అమలులో ఉన్న ధరలు, ప్రస్తుతం జిఎస్టీ అమలులోకి వచ్చాక అమలు చేస్తున్న ధరల గురించి ఉత్పత్తుల వారీగా కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కల్పించాలని, వివిధ ప్రచార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. జిఎస్టీ పేరుతో ఎంఆర్‌పిని మించి ఎక్కువ ధరలు తీసుకుంటున్నారని వినియోగదారుల సంఘాల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిఎస్టీలో ప్యాకింగ్ చేయని వివిధ ఆహార ధాన్యాలు, కూరగాయలు, బైదా, శనగపిండి, పాలు, పెరుగు, తేనే, బెల్లం, పన్నీరు, బెల్లం, తాటిబెల్లం తదితర ఉత్పత్తులపై పన్ను లేదని తెలిపారు. అదే విధంగా విద్య, వైద్యసేవలపైన కూడా పన్ను లేదని, ఎరువుల ధరలు తగ్గాయని చెప్పారు. జిఎస్టీపై వ్యాపారులకు ఏవైనా అనుమానాలు ఉంటే వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో సంప్రదించవచ్చని, సంబంధిత వెబ్‌సైట్‌లో కూడా సమాచారం లభిస్తుందని అన్నారు. మద్యం, పెట్రోలు జిఎస్‌టి కిందకు రావని, వీటిని ఎంఆర్‌పికి మించి విక్రయిస్తే సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. జిఎస్‌టికి సంబంధించిన సమాచారం, ఫిర్యాదులను రాష్టస్థ్రాయిలో ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-3787కు తెలపవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరిత, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ గీత, అసిస్టెంట్ కమీషనర్లు సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలి
పరకాల, జూలై 24: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పరకాల జిల్లా కేంద్ర, అఖిల పక్ష సాధన కమిటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు మెమోరండం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం జిల్లా పునర్విభజనలో భాగంగా పరిపాలన సౌలభ్యం కలిగి ఉన్న పరకాల ప్రాంతాన్ని విస్మరించినట్లు వారు కలెక్టర్‌కు దృష్టికి తీసుక వచ్చారు. నాటి నుండి పరకాల ప్రాంతం అన్ని రాజకీయ, వాణిజ్య వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు పరకాలపై వివక్షత చూపుతున్న విషయాన్ని గతంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్‌కు, వివిధ శాఖ మంత్రులకు వినతిపత్రం అందచేసినట్లు చెప్పారు. ఎంతో ఘన చరిత్ర గల పరకాల ప్రాంత పాత తాలుకాను విడదీసి ఒంటరిని చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా వివక్షతకు గురైన పరకాలలో పరిపాలన పరంగా కలెక్టర్ కార్యాలయము కొరకు అనుగుణంగా అన్ని విధాలుగా సౌలభ్యం కలిగిన ప్రభుత్వ స్థలం ఉన్నందున జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రం కాని యెడల పరకాల పాత తాలుకాలోని మొగుళ్ళపల్లి, రేగొండ, చిట్యాల, శాయంపేట మండలాలను కలిపి పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి, బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, కానుగుల గోపినాధ్, బిజెపి జిల్లా కార్యదర్శి ఆర్‌పి జయంత్‌లాల్, సిఐటియు జిల్లా అధ్యక్షులు నక్క చిరంజీవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొచ్చు క్రిష్ణారావు, వైసిపి పట్టణ అధ్యక్షుడు బొచ్చు భాస్కర్, సిపిఐ పట్టణ కార్యదర్శి దుప్పటి సాంబయ్య, ఏబివిపి బ్లాగ్ కన్వీనర్ కట్టగాని శ్రీకాంత్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, పిట్ట వీరస్వామి, రాములు, సాంబయ్య, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
చదివితేనే... ఉజ్వల భవిష్యత్
నల్లబెల్లి, జూలై 24: విదార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉం టుందని నర్సంపేట ఆర్డీవో రవీందర్ అన్నారు. సోమవారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉషాధయాల్ సాధీక్‌అలీ, ఎన్‌ఆర్‌ఐ సుజిల్ ఆద్వర్యంలో పేదల పుస్తక భండాగారం తోపుడుబండి వారు లక్ష రూపాయల పుస్తకాలను ఆర్డీవో చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోప్యాయుడు రవీందర్ అధ్యక్షత వహించగా... ముఖ్య అతిథిగా ఆర్డీవో, డిఎఫ్‌ఒ పురుషోత్తం, జడ్పీవైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, ఎంపిపి సారంగపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సమాజాన్ని తెలియజేసే పుస్తకాలను సాధీక్‌అలీ, సుజిల్ అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. తహశీల్దార్ రాజేంద్రనాద్, ఎంపిడివొ మూర్తిరెడ్డి, ఎంఇవొ దేవా, సర్పంచ్ నూనవతు మంగ్యా, ఎంపిటిసి సూరయ్య, గందే శ్రీనివాస్‌గుప్తా, కందుగుల గోవర్దన్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కరాటే పోటీలో పరకాల విద్యార్థులకు పతకాలు

పరకాల, జూలై 24: షికోకాయ్ షిటారియో కరాటే-డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలో పరకాలకు చెందిన క్రియోటవ్ కరాటే-డూకు చెందిన విద్యార్థులు పాల్గొన్ని పతకాలు సాధించినట్లు క్లబ్ వ్యవస్థాపకులు మాడ సంపత్ తెలిపారు. సినియర్ బాలుర స్పారింగ్, కటాస్ విభాగంలో మాడ సాయిస్నిగ్దిష్ ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించగా, జూనియర్స్ స్పారింగ్ విభాగంలో పి. కిర్తి, ఎస్. అభినవ్‌లు ద్వితీయ, నిఖిల్ ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు చెప్పారు. సబ్ జూనియర్స్‌లో స్పారింగ్ విభాగంలో సిద్దార్ధ, ద్వితీయ స్థానంలో సాయితేజ, బాలిక స్పారింగ్‌లో పంచగిరి తన్మయి, సురాబు సుస్మిత ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. సబ్ జూనియర్స్ బాలికల స్పారింగ్‌లో ఎం. సంజన, స్పారింగ్ కటాస్ విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించగా, సబ్ జూనియర్ స్పారింగ్‌లో వర్షిత్ ద్వితీయ స్థానంలో పతకాలు సాధించినట్లు మాడ సంపత్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పాపయ్య వారిని అభినందించారు.
ప్రజలే.. పోస్ట్‌మార్టం చేస్తారు
మొగుళ్ళపల్లి, జులై 24: ప్రజలకు భ్రమలు కల్పించి, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక మరో సారి భ్రమలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నదని, ఆ ప్రభుత్వానికి ప్రజలే పోస్ట్‌మార్టమ్ జరిపిస్తారని ప్రభుత్వ మాజీ ఛీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు వీ రాజేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రమణారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ నాయకురాలు గండ్ర జ్యోతి పాల్గొని, ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. కార్యకర్తలు ధైర్యం వీడకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతఙ్ఞతగా రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చి, కానుక ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఉసురుతోనే దిగిపోకతప్పదని రమణారెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అభివృద్ది అనేది లేదని, తాను మంజూరీ చేసిన అభివృద్ధి పనులనే ప్రారంభిస్తున్న స్పీకర్ , తన స్థాయి మరిచి మాట్లాడటం మానుకోవాలని రెడ్డి హితవు పలికారు. మండలంలోని 20 గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, 120 మంది ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి రమణారెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పిటిసి సంపెల్లి వసంత నర్సింగరావు, సింగిల్ విండో సోసైటీ చైర్మన్ నరహరి బక్కిరెడ్డి, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాద మల్లారెడ్డి, నర్సింగారావు, రవి, జోడుక సదయ్య, విప్లవ రెడ్డి , వెంకటరెడ్డి తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రైతులకు లక్షకోట్లు కేటాయించాలి

భీమదేవరపల్లి, జూలై 24: రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం లక్షకోట్ల రూపాయలు కెటాయించి రైతులను ఆదుకోవాలని భారత కమ్యూనిష్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్‌లు డిమాండ్ చేశారు. వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ జనాభాలో 70 శాతం వరకు రైతులే ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కార్పోరేట్ రంగాలకు కొమ్ముకాస్తు రైతులను విస్మరిస్తోందన్నారు. దేశంలో మూడు లక్షలకు పైగా రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్ధితులు నెలకొన్నాయన్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాలలోని రైతులు రైతు సమస్యలపై ఆయా ప్రభుత్వాలపై అక్కడి ప్రభుత్వాలను రైతులు నిలదీస్తే వారిని కాల్చిచంపాయన్నారు. కరువు కోరలలో చిక్కిన రైతులు ఢీల్లిలోని జంతరమంతర్ వద్ద నిరహారదీక్షలు చేసిన, అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కేంద్రప్రభుత్వ వైఖరి మారడం లేదన్నారు. రైతుల కొరకు ఏర్పాటు చేసిన స్వామినాధన్, జయతిఘోష్ సూచనలను కేంద్రప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొలిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ నాయకులు కంచర్ల సదానందం, వేముల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.