మెదక్

విద్యుత్ హైటెన్షన్ భూ నిర్వాసితుల కోసం జడ్పీలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: తమ భూముల నుంచి వెళుతున్న విద్యుత్ హైటెన్షన్ టవర్లకు సంబంధించి పరిహారం అందించకుండా ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని సోమవారం నాడు భూ నిర్వాసితులు జిల్లా పరిషత్ ప్రాంగణంలో వౌన దీక్షకు దిగిన సంఘటన సభలో గందరగోళం నెలకొల్పింది. సభ ప్రారంభానికి ముందుగానే ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో విపక్ష సభ్యులు అధికార పక్షం సభ్యుల మద్య వాగ్వాదానికి దారితీసింది. ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి హరీష్‌రావుకు మొరపెట్టుకునేందుకు రైతులు వస్తే వారి సమస్యను తెలియనీయకుండా ముందస్తుగానే అరెస్టు చేయడం హేయనీయమని కాంగ్రెస్, టిడిపి పార్టీలక చెందిన జడ్పీటిసి సభ్యులు ప్రభాకర్, శ్రీకాంత్‌గౌడ్‌లు మంత్రిని నిలదీసారు. సమస్యను పరిష్కరించాకనే సభను ప్రారంభించాలని పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య కాసేపు వాగ్వాదం నెలకొనడంతో జడ్పీ చైర్ పర్సన్ రాజమణి యాదవ్ కల్పించుకుని సమావేశం ముగిసేలోగా అరెస్టు చేసిన రైతులను విడుదల చేస్తారని, మూడు నెలలకొకసారి జరిగే సభలో అలాంటివి చర్చలకు తావీయకూడదన్నారు. తమకు నమ్మకమైన హామి ఇస్తేనే సభను కొనసాగిస్తామనడంతో అరెస్టు చేసిన వారిని విడుదల చేయిస్తామన్న హామి మేరకు ప్రతిపక్ష సభ్యులు శాంతించారు. జడ్పీ సర్వసభ్య సమావేశం ముగిసేలోగా అరెస్టు చేసిన రైతులను విడుదల చేయడంతో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి హరీష్‌రావు బాధితులకు వివరించారు.
కెటిఆర్ జన్మదిన వేడుక సభలో
అక్కా తమ్ముళ్ల ఐక్యతా రాగం!

మెదక్: సోమవారం మెదక్ జిల్లా ఎడిషన్‌లో మెదక్ బల్దియాలో ముదిరిన ఆదిపత్య పోరు అనే కథనానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించారు. ఆనాటి అభిమానం దూరమైందా అనే ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ సోమవారం నాటి కెటిఆర్ జన్మదిన వేడుకల్లో ఇరువురూ కలిసిపోయారు. కేక్ కట్‌చేసి అక్క (ఉపసభాపతి) తమ్ముడు (చైర్మన్) మల్లిఖార్జున్ ఒకరికొకరు కేక్ ముక్కలను పంచుకున్నారు. చైర్మన్‌తో ఉన్నటువంటి కౌన్సీలర్లందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెటిఆర్ జన్మదిన వేడుకల్లో చైర్మన్ సభాధ్యక్షత వహించారు. వారితో పాటు వైస్ చైర్మన్ రాగి అశోక్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. కానీ ఈ వేడుకలలో వారు అసంతృప్తిగా కనిపించారు. చైర్మన్ వర్గీయులు ఉపసభాపతితో ఎంతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ వర్గీయులు కౌన్సిలర్లు ఐతారం నర్సింలు, అనిల్‌కుమార్, కండెల నాగయ్య, సోహెల్, జెల్ల గాయత్రి, గోదల జ్యోతి, ఆరెళ్ల గాయత్రి, యశోద, చంద్రకళ, విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ రాగి అశోక్ వర్గీయులైన కౌన్సిలర్లు బట్టి సులోచన, అమీన, సలామ్, మాయ మల్లేశం, అరునార్తి రమణ తదితరులు పాల్గొన్నారు. వీరందరు కూడా మెదక్ పట్టణంలో తలపెట్టిన కెటిఆర్ జన్మదినాన్ని అంకితం చేస్తూ 11 వేల మొక్కలను ప్రజల భాగస్వామ్యంతో, విద్యార్థులతో, ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటారు. ఎంఎన్ కెనాల్స్‌పై నాటిన మొక్కలకు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో ట్రీగార్డ్స్‌ను సమకూర్చి ఒక్క మొక్క ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమీషనర్ ప్రసాద్‌రావును ఆదేశించారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి కెటిఆర్ జన్మదిన వేడుకల్లో అన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల సందర్భంగా ఎంతో సంతోషంగా కనిపించారు. అక్కడకక్కడ కనిపించిన చంటి పిల్లలను చంకలో వేసుకొని వారితో ముచ్చటిస్తూ మొక్కలను నాటారు. విద్యార్థులకు అభివాదం తెలుపుతూ ఎంతో ఆనందంగా కెటిఆర్ జన్మదిన వేడుకల్లో కనిపించారు. అధికారులతో కూడా చాలా సన్నిహితంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం మీ బాధ్యతగా తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు కనిపించని విధంగా ఎందుకో ఆమెలో ఒక ఆనందం కనిపించింది. 11 వేల మొక్కలు ఒకే రోజు మెదక్ పట్టణంలో నాటడం పట్ల పద్మాదేవేందర్‌రెడ్డి చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులకు, కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరం ఈ విధంగా కలిసిమెలసి ఉండి పట్టణాభివృద్దకి తోడ్పడదామని ఆమె పిలుపునిచ్చారు.

హరిత హారానికి అధికారులే ఆదర్శం కావాలి
సంగారెడ్డి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తిదాయకం కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. సోమవారం జడ్పీ చైర్ పర్సన్ రాజమణి యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, ప్రజాప్రతినిధులకు హరితహారం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేసారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రణాళిక బద్దంగా మొక్కలను నాటితే ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. తమ కార్యాలయాలను వదిలేసి ప్రజలను మొక్కలను నాటాలని సూచించడం సహేతూకంగా కాదన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటించడంలో జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్న 65వ నంబరు జాతీయ రహదారికి ఇరుపక్కల ఉన్న పెద్ద చెట్లను నరికివేయడం వల్ల రోడ్డు బోసిపోయినట్లుగా కనిపిస్తుందన్నారు. ఈ మేరకు ఒకే రోజున పటన్‌చెరు నుంచి జహీరాబాద్ మండలం కర్నాటక సరిహద్దు వరకు మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడి నిర్వహించేది ఒక తేదీని ఖరారు చేసి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఒకే రోజు నిర్వహించే కార్యక్రమానికి ఎన్ని మొక్కలు అవసరమవుతాయో అంచనా వేసి నాటించడానికి గుంతలను తవ్వించాలన్నారు. గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలను నాటించడం ఎంత వరకు సాధ్యమవుతుందని జిన్నారం జడ్పీటిసి ప్రభాకర్ మంత్రి హరీష్‌రావును ప్రశ్నించారు. గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని మొక్కలను నాటిస్తే ఎందుకు సాధ్యం కాదని మంత్రి హితవు పలికారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థాపితమైన అన్ని పరిశ్రమల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తున్న గొర్రెల యూనిట్ల పంపిణీలో జాప్యం లేకుండా సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు పని చేయడం లేదని, 3 వేల యూనిట్లకుగాను ఇప్పటి 63 వేల గొర్రెలను మాత్రమే పంపిణీ చేసారని విచారం వ్యక్తం చేసారు. డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బాబుమోహన్, రామలింగారెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

24 గంటల విద్యుత్‌కు రూ.2072 కోట్ల వ్యయం

సంగారెడ్డి: వ్యవసాయ రంగానికి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికిగాను వివిధ సౌకర్యాల కల్పనకు ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.2072 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరించుకోవాల్సి వస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేసారు. ఉచితంగానే సరఫరా అవుతుందని రైతులు నిర్లక్ష్యం చేస్తూ విద్యుత్‌ను దుబారా చేయవద్దని ఉద్భోదించారు. సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సధారణ సమావేశం చైర్ పర్సన్ రాజమణి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాను పొందడానికి రైతులు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెనువెంటనే కనెక్షన్ ఇవ్వాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు సరఫరాకు అంతరాయం ఉండదని ఈ నేపథ్యంలో వ్యవసాయ పొలాల వద్ద అమర్చుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను వెంటనే తొలగించుకోవాలని సూచించారు. ఆటోమెటిక్ స్టార్టర్లకు బదులుగా అవసరమైనప్పుడు మాత్రమే పంప్‌సెట్‌ను ఆన్ ఆఫ్ చేసుకునే స్టార్టర్లను అమర్చుకోవాలని సూచించారు. ఆటోమెటిక్ స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు సైతం తగ్గిపోతాయని, వ్యవసాయానికి అవసరమైన భూగర్భ జలాలను మాత్రమే వినియోగించుకునేలా రైతులు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన 2072 కోట్ల ద్వారా సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, ఇతరత్ర పనులకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సాగునీటి వనరులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్ల గత ఖరీఫ్, రబీలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, రైతులు ప్రైవేట్, స్వంత అవసరాల నిమిత్తం ఎంతగా మిగుల్చుకున్నారో ఇంకా లెక్కల్లోకి రాలేదన్నారు. సాగునీటి వనరులు అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణాలో వ్యవసాయం గాడిన పడిందని మంత్రి సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, రామలింగారెడ్డి, భూపాల్‌రెడ్డి, బాబుమోహన్, సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు మానిక్కరాజ్, భారతి హోలికేరి, జడ్పీటిసిలు, ఎంపిపి అధ్యక్షులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనానికి స్థల పరిశీలన

సిద్దిపేట: సిద్దిపేట కమిషరేట్ కార్యాలయం నూతన భవన నిర్మాణం కోసం దుద్దేడ శివారులో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎంపి మల్లారెడ్డి, సిపి శివకుమార్‌లు స్థల పరిశీలన చేశారు. సిపి కార్యాలయానికి కేటాయించిన భూమిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని సిపికి ఆదేశాలు జారీ చేశారు. 2019లోగా సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయానకి వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ఫేజ్‌లో సిపి కార్యాయలం ఇంటిగ్రేటెడ్ నిర్మాణం, పరేడ్ గ్రౌండ్, ఎఆర్ హెడ్ క్వార్టర్స్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 25 కోట్ల రూపాయలతో జి ప్లస్ తరహాలో నిర్మించనున్నట్లు తెలిపారు. రెండవ ఫేజ్‌లో పోలీస్ క్వార్టర్స్ ఇతర సదుపాయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. పొన్నాల శివారులో పోలీస్ కమాండెంట్ రూం నిర్మాణ పనులను పరిశీలించి దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆనంతరం కమిషనరేట్ పరిధిలోని ఎఆర్ హెడ్ క్వార్టర్స్‌లో హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎండి మల్లారెడ్డిలు మొక్కలు నాటారు.
ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
సిద్దిపేట అర్బన్: ప్రజావాణి సమస్యలనుస సత్వరమే పరిష్కరించాలని జెసి పద్మాకర్ అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలనుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆ సమస్యలన్నింటిని పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన వారి నుండి 55 దరఖాస్తులను స్వీకరించారు. ఇర్కోడు ఐఎంఎల్ మద్యం డిపో వద్ద మొక్కలు నాటారు.
శ్రావణమాస ఉత్సవాలు
జిన్నారం: జిల్లాలోని ప్రసిద్ద శైవక్షేత్రం బొంతపల్లి వీరభధ్రస్వామి ఆలయ శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమయినట్లు ఆలయ కమిటి చైర్మెన్ ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన చిన్నారుల ఆత్మశాంతి కోసం విద్యార్థుల ర్యాలీ

వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట రైల్వేఘటనలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ మదుసుధన్ రెడ్డి, మండల ఎంపటిసిల ఫోరం అధ్యక్షుడు సిద్దిరామాగౌడ్‌ల ఆధ్వర్యంలో గ్రామ పూరవీదుల నుంచి ఘటన స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ముడు సంవత్సరాల క్రితం ఈ ఘటన స్థలంలో అభం శుభం తెలియని చిన్నారులు రైల్వే గేట్ సమీపంలో రైల్వే దుర్ఘటనలో మృతి చెందిన చిన్నారులను నేటికీ మరువలేక పోతున్నామన్నారు. ఘటన స్థలం వద్ద చిన్నారులకు చిత్రపఠాలకు పుష్పాంజలి ఘటిస్తూ వారి అత్మకు శాంతి చేకుర్చాలని నిమిషం పాటు వౌనం పాటించారు.

ఆదాయపు పన్ను చెల్లించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
సిద్దిపేట : ఆదాయ పన్నులు సకాలంలో చెల్లించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇన్‌కంటాక్స్ అదనపు కమిషనర్ ప్రవీణ అన్నారు. సోమవారం స్ధానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్‌లో జరిగిన 157వ ఐటి దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో పేదరికం నిర్మూళనకు, సంక్షేమ పథకాల అమలుకోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు. ప్రజలు పన్నుల రూపేణ చెల్లించిన నిధులు సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పథకాలకు వినియోగిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పించే తాగునీరు, రోడ్లు, వైద్యం, విద్యాభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం సర్కార్‌కు పెద్దఎత్తున నిధులు అవసరమవుతాయన్నారు. ఆదాయ పన్నులు చూసి ఏవ్వరు భయపడవద్దన్నారు. ఐటి రిటర్న్‌ను సకాలంలో ఫైల్ చేసుకోవాలన్నారు. వ్యాపారులకు ఏలాంటి సమాచారం ఐటి అధికారులు అందచేస్తారని, మోబైల్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాపారుల ఏలాంటి సమస్యలనైన అధికారుల దృష్టికి తీసుక వస్తే పరిష్కరిస్తామన్నారు. వ్యాపారుల పూర్తి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారులతో ఆదాయ పన్ను అధికారులు స్నేహాపూర్వకంగా వ్యవహరిస్తామన్నారు. వ్యాపారస్తులు సకాలంలో పన్నులు చెల్లించి దేశాభివృద్ధికి తోడ్పాడలన్నారు. అసిస్టేంట్ కమిషనర్ సుధాకర్‌నాయక్, సిద్దిపేట జిల్లా ఐటి అధికారి గురునాథరావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, టాక్స్ కన్సల్‌టెన్సి జిల్లా అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.