కృష్ణ

కాపుల కదలికలపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కాపు ఉద్యమనేత ముద్రగడ్డ పద్మనాభం తలపెట్టిన ఛలో అమరావతి పాదయాత్రని పురస్కరించుకుని జిల్లాలోని కాపు నేతల కదలికలపై పోలీసు శాఖ నిఘా పెంచింది. ముద్రగడ్డ పాదయాత్రకు ప్రభుత్వ పరంగా ఎటువంటి అనుమతులు ఇవ్వని నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అల్లర్లకు అస్కారం లేకుండా ముందస్తు రక్షణ చర్యలను చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 28 ప్రాంతాల్లో పోలీస్ చెక్‌పోస్టులతో పాటు మొబైల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ కలిగిన కాపులను పాదయాత్రకు తరలి వెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం పోలీసు ఫోర్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోనుంది. గతంలో ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నుండి భారీగా కాపులు తరలి వెళ్లారు. పద్మనాభంకు మద్దతుగా పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మళ్లీ అదే స్థాయిలో పద్మనాభం పాదయాత్రకు తరలి వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రభుత్వం పోలీసుల సాయంతో వారిని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పోలీసు చెక్‌పోస్టులతో పాటు సెక్షన్ 30 అమలులోకి తీసుకు వచ్చారు. కానీ కాపులు మాత్రం కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాంతాల వారీగా జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి ముద్రగడ పాదయాత్రను ఏ విధంగా విజయవంతం చేయాలో, పోలీసులను ఎలా బురిడీ కొట్టించి పాదయాత్రకు కాపులను తరలించాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఎంత మంది పోలీసులు అడ్డుకున్నా ముద్రగడ పద్మనాభంకు బాసటగా నిలుస్తామని మిరియాల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంటా సురేష్ స్పష్టం చేస్తున్నారు.
ప్రజా జీవనానికి భంగం కల్గించవద్దు: జిల్లా ఎస్పీ త్రిపాఠి
జిల్లాలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంది. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. ఉద్యమం పేరుతో ప్రజా జీవనానికి భంగం వాటిల్లించడం సబబు కాదన్నారు.

అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కింద 50వేల మందికి పట్టాలు
మచిలీపట్నం, జూలై 24: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఉంటున్న 50 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందు కోసం తహశీల్దార్లు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఉంటున్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. వినియోగదారుడి ఇంటికే ఇసుక రవాణా చేస్తామన్నారు. వినియోగదారులు మీ సేవా కేంద్రాల్లో నిర్ణయించిన ధర చెల్లించడం ద్వారా నేరుగా ఇంటి వద్దకు ఇసుకను పంపే విధంగా కమిటీలో నిర్ణయించడం జరిగిందన్నారు. కిలో మీటరుకు రవాణా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ధర నిర్ణయించి దాని ప్రకారం మీ సేవా సెంటర్లలో చెల్లించే విధంగా నిర్ణయించామన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద రెవెన్యూ, పోలీసు, రవాణా, మైన్స్, డిఆర్‌డిఎ అధికారుల పర్యవేక్షణలో ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, ఇన్‌ఛార్జ్ డిఆర్‌ఓ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

బొడ్డపాడు సబ్‌సెంటర్‌లో డెంగ్యూ, మలేరియా పరీక్షలు
తోట్లవల్లూరు, జూలై 24: మండలంలోని బొడ్డపాడు గ్రామంలో జ్వరాలు సోకిన బాధితులకు స్థానిక పీహెచ్‌సీ సబ్ సెంటర్‌లో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో 53 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. ప్రజలు డెంగ్యూ, ప్లేట్‌లెట్స్ క్షీణత భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతుండటంతో డిఎంఅండ్‌హెచ్‌ఓ టివిఎస్‌ఎన్ శాస్ర్తీ, సబ్ కలెక్టర్ హరీష్‌రావు సూచనల మేరకు డాక్టర్ గోపాలనాయక్ రక్తపరీక్షలు సబ్‌సెంటర్‌లోనే కల్పించారు. 13 మందికి డెంగ్యూ ఎన్‌ఎస్ 1, ఐజిజి, ఐజిఎం టెస్ట్‌లు చేయగా ఒకరికి ఎన్‌ఎస్ 1 పాజిటివ్ వచ్చిందని డాక్టర్ తెలిపారు. ఎన్‌ఎస్ 1 పాజిటివ్ వచ్చినా ఎలాంటి భయం లేదని, ఇక్కడే మందులు వాడితే సరిపోతుందన్నారు. ఐజిజి, ఐజిఎం పాజిటీవ్ వస్తేనే ప్రమాదమన్నారు. అలాగే 21 మందికి మలేరియా పరీక్షలు చేయగా ఎవరికి మలేరియా లేదన్నారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 19 మందికి ప్లేట్‌లెట్స్ పరీక్షలు చేశారని, రిజల్ట్ తర్వాత వస్తుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3వేల ఖరీదైన పరీక్షలు నిర్వహించామని గోపాలనాయక్ చెప్పారు. గ్రామంలో జ్వరం తీవ్రత తగ్గిపోయిందని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గోపాలనాయక్ తెలిపారు. సోమవారం బొడ్డపాడు సబ్‌సెంటర్‌కు వచ్చిన 23 ఓపీ కేసుల్లో ఒకరికి కొత్తగా జ్వరం వచ్చినట్లు తేలిందన్నారు.

‘ప్రజాదర్బార్’లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
మచిలీపట్నం, జూలై 24: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజాదర్భార్’ ద్వారా వచ్చే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సోమవారం ఆయన తన ఛాంబర్‌లో ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. వారి సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి ఆయా సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రజాదర్బార్’లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కొంత మంది సివిల్ కేసులను కూడా తమ దృష్టికి తీసుకువస్తారన్నారు. వాస్తవానికి సివిల్ కేసులను తాము పరిష్కరించడానికి అవకాశం లేదని కానీ సమస్య ప్రాధాన్యతను బట్టి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారికి రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. సమస్య ఏదైనా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న పోలీసు శాఖ ఉద్దేశ్యమన్నారు. తాము నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలంటూ తమ వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నారని తెలిపారు. వీరి నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. సమస్య పరిష్కరించిన తర్వాత లిఖిత పూర్వకంగా అర్జీదారునికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. అలాగే పరిష్కారం కాని అర్జీలపై డివిజన్‌ల వారీగా సమీక్షించి తగు పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా
బంటుమిల్లి, జూలై 24: జనావాసాల మధ్య, పాఠశాలకు దగ్గరలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం మహిళలు నటరాజ్ సెంటరులో ధర్నా చేశారు. నటరాజ్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మూసి వేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఎక్సైజ్ సిఐ అమరేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పిన్నమనేని విజయ, లంకదాసుల సుజాత, సిపిఎం నాయకులు పోసిన మోహనరావు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజయ్‌ఘోష్, బొడ్డు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజగోపాల్ శంకుస్థాపన

నందిగామ, జూలై 24: మండలంలోని ఏటిపట్టు గ్రామాల విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.కోటి 30లక్షలతో టవర్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు. సోమవారం మునే్నటి ఒడ్డున టవర్‌ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పల్లగిరి నుండి మాగల్లు వరకూ విద్యుత్ స్తంభాలు ఏటిలో ఉండటంతో ప్రతి ఏటా మునే్నటికి వరదలు వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలు పడిపోయి జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ఏటిపట్టు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి మునే్నటి ఒడ్డున విద్యుత్ టవర్‌ల నిర్మాణం చేయాల్సిన అవసరంపై ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించారు. సోమవారం టవర్‌ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నాయకులు అంగడాల పూర్ణచంద్రరావు, బత్తిన రవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎ తెలుగు, హిందీ ఉపాధ్యాయుల బదిలీలు ప్రశాంతం
మచిలీపట్నం (కల్చరల్), జూలై 24: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా సోమవారం స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్ధూ ఉపాధ్యాయులకు కౌనె్సలింగ్ నిర్వహించారు. సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో నిర్వహించిన బదిలీ కౌనె్సలింగ్‌ను జిల్లా విద్యా శాఖాధికారి డి దేవానందరెడ్డి పర్యవేక్షించారు. తెలుగు సబ్జెక్టులో జిల్లా పరిషత్ యాజమాన్యానికి చెందిన 185 మందికి ఉపాధ్యాయులకు గాను 119 మంది తమకు అనుకూలమైన ప్రాంతాలను కోరుకున్నారు. 56 మంది ఎటువంటి స్థానాలను కోరుకోకపోవటంతో పాత స్థానాల్లో కొనసాగనున్నారు. ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులకు గాను ఇద్దరు వేరే ప్రాంతాలకు బదిలీ అవ్వగా మరో ఇద్దరు పాత స్థానాల్లోనే ఉంటామని చెప్పారు. హిందీ సబ్జెక్టుకు సంబంధించి జెడ్పీ హైస్కూల్స్‌కు చెందిన 130 మందిలో 106 మంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. 14 మంది ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగనున్నారు. 10 మంది కౌనె్సలింగ్‌కు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించిన నలుగురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించి నలుగురిలో ముగ్గురు ఇతర ప్రాంతాలకు బదిలీ అవ్వగా ఒకరు మాత్రం ప్రస్తుత స్థానానే కోరుకున్నారు. ఉర్ధూ విభాగంలో జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించిన నలుగురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. అడ్‌హాక్ కింద హిందీలో 56 మంది, తెలుగుకు సంబంధించి 44 మందిని బదిలీ చేశారు. మంగళవారం స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్, గణితం విభాగాల ఉపాధ్యాయులతో వాయిదా పడి ఫిజికల్ డైరెక్టర్స్‌ను కౌనె్సలింగ్ ద్వారా బదిలీ చేస్తామని డిఇఓ దేవానందరెడ్డి తెలిపారు.

జ్వరాలకు తాగునీరే కారణమా ?
తోట్లవల్లూరు, జూలై 24: మండలంలోని బొడ్డపాడులో జ్వరాల విజృంభణకు కలుషితమైన రక్షిత మంచినీరే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. సోమవారం కుళాయిల్లో కలుషిత నీరు వచ్చిందని కొందరు గ్రామస్తులు అధికారులకు తెలిపారు. నీటిలో మసిలాంటి రేణువులు విపరీతంగా వచ్చాయని, బక్కెట్‌లో అడుగున నల్లగా పేరుకుంటోందని చెప్పారు. కుళాయిల్లో వచ్చిన నీటిని బాటిల్స్‌లో పట్టి డాక్టర్ గోపాలనాయక్‌కు చూపించారు. దాంతో ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి డి రమాదేవిని సబ్‌సెంటర్‌కు డాక్టర్ పిలిపించారు. ఆదివారం సాయంత్రం నుంచి ట్యాంకుని క్లీన్ చేస్తున్నామని, అందువల్లే ఇలా వచ్చిందని ఏఈ సుబ్బారావు చెప్పారు. గతంలో కూడా ఇలాగే వచ్చిందని పలువురు మహిళలు ఏఈతో వాదించారు. తాము ట్యాంకుని క్లీన్ చేయిస్తూనే ఉన్నామని కార్యదర్శి తెలిపారు. అయితే ఈ నీటిని పరీక్షలకు పంపించమని డాక్టర్ గోపాలనాయక్ ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈకి సూచించారు. ఊరందరికీ జ్వరాలు చుట్టుముట్టటానికి తాగునీరు కారణం కావచ్చని డాక్టర్ అన్నారు.

జారిపడిన రూ.38లక్షలు
విజయవాడ (క్రైం), జూలై 24: బ్యాంకులో జమ చేసేందుకు జ్యూయలరీ షాపు గుమస్తా తీసుకెళ్తున్న రూ.38లక్షలు నగదు అంతలోనే మాయమయ్యంది. కింద పడిపోయిన బ్యాగును గుర్తించిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు తమ అదృష్టంగా భావించి తీసుకెళ్లి ఇంట్లో దాచుకున్నారు.. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమేరా పుటేజీ ద్వారా ఆ ఇద్దరిని గుర్తించారు. దొరికిన సొమ్ము అప్పచెప్పకుండా కాజేయాలని చూసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కొన్ని గంటల్లోనే నిందితులను గుర్తించి డబ్బు స్వాధీనం చేసుకున్నామని జాయింట్ సిపి రమణకుమార్ సౌత్ ఏసిపి కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్యనారాయణపురం మధురానగర్‌లో నివాసముంటున్న తిన్నింటి రామకృష్ణ గవర్నర్‌పేట జెడి హాస్పటల్ రోడ్డులోని సంఘవీ జ్యూయలరీ షాపులో గుమస్తాగా పని చేస్తున్నాడు. కాగా షాపు యజమాని సోమవారం బ్యాంకులో జమ చేయమని చెప్పి రూ.38లక్షలు ఇచ్చాడు. డబ్బు బ్యాగులో పెట్టుకుని బయలుదేరిన రామకృష్ణ షాపు ఎదురుగా ఉన్న మోటారు సైకిల్ ట్యాంకు కవర్‌లో పెట్టుకుని తిరిగి షాపులోకి వెళ్లాడు. ఈలోగా ట్యాంకు కవర్‌లోని నగదు బ్యాగు జారి కింద పడిపోయింది. అది గమనించిన అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు బ్యాగు చేతపట్టుకుని జారుకున్నారు. తిరిగి వచ్చిన గుమస్తా రామకృష్ణ బ్యాగు కనపడపోయేసరికి వెంటనే డయల్ 100కి కాల్ చేసి చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సిసి కెమేరా పుటేజీలు సేకరించి చూడగా కింద పడిపోయిన బ్యాగు చేతపట్టుకున్న ఇద్దరు అక్కడి నుంచి వెళ్లడాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. దీంతో గవర్నర్‌పేటలోని ఎంపిడిఓ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ నెల్లపు మురళీమోహన్, అటెండర్ ముద్ర వెంకట సుబ్బారావులుగా గుర్తించారు. వీరిద్దరూ దొరికిన సొమ్మును అప్పచెప్పకుండా తీసుకెళ్లి మురళీమోహన్ ఇంట్లో దాచిపెట్టారు. ఆతర్వాత తమ ఒంటిపై ఉన్న దుస్తులు మార్చేసి ఏమీ ఎరుగనట్లు వ్యవహరించారు. ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపి చెప్పారు. విలేఖరుల సమావేశంలో సౌత్ ఏసిపి కె శ్రీనివాసరావు, నార్త్ ఏసిపి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ఆదాయపు పన్ను చెల్లించటం ప్రజల బాధ్యత
పటమట, జూలై 24: ఆదాయపు ప న్ను చెల్లించటం ప్రజలు బాధ్యతగా గుర్తించాలని విజయవాడ అడిషనల్ డిజిపి హరీష్‌కుమార్ గుప్తా అన్నారు. ఇన్‌కమ్ టాక్స్ 157వ వార్షిక దిన్సోవం సందర్భంగా సోమవారం సాయంత్రం మారిస్ స్టెల్లా కళాశాల ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో ఆదాయ పన్ను శాఖ ఆ ధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఆడిటర్ భాగస్వా మ్యం హర్షణీయమన్నారు. విజయవా డ ఆదాయపు పన్ను శాఖ ఈ సంవత్స రం రూ.10వేల కోట్లు పన్నుల రూపం లో వసూలు చేయడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు ఆదాయపు పన్ను చెల్లింపులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవని, కానీ నేడు ఆదాయపు పన్ను చెల్లింపులో అనేక సులభతరమైన మా ర్పులు వచ్చాయన్నారు. ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సిహెచ్ ఓం కార్ ఈశ్వర్ మాట్లాడుతూ ఆదాయపు పన్ను ఆర్థిక వ్యవస్ధకు ఆయువు పట్టు అన్నారు. 1857లో ప్రప్రథమ స్వాతం త్య్ర సంగ్రామ ఉద్యయం (సిపాయిల తిరుగుబాటు) సందర్భంగా బ్రిటిష్ వా రి ఖజానా ఖాళీ కావటంతో, 1860లో బ్రిటిష్ పాలకులు జెమ్స్ విల్సన్ ఆదాయపు పన్ను ప్రవేశపెట్టటం జరిగిందన్నారు. ఆనాడు మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తం మీద రూ.30 లక్ష ల ఆదాయపు పన్ను వసూలు అయ్యిందన్నారు. నేడు 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద ఆదాయ పు పన్ను 8,70,000 కోట్లకు పెరిగిందన్నారు. ఆదాయపు పన్ను నిజాయితీ గా, సకాలంలో చెల్లించడం వలన అనే క ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకార్ ఈశ్వర్ కేక్ కట్ చేశారు. అ నంతరం సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించిన వివిధ కంపెనీల. సంస్థల ప్రతినిధులను, ఆడిటర్స్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందచేశారు.

279 జివోను అమలు చేస్తే సహించేది లేదు
విజయవాడ (కార్పొరేషన్), జూలై 24: మున్సిపల్ పారిశుద్ధ్య పనులను ఏజెన్సీలకు అప్పగించే జీవో 279ను అమలుచేస్తే సహించేది లేదని, కార్మిక ఉద్యమంతో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారా వు హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ 2 దశాబ్ధాలుగా పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న కార్మికుల స్థానంలో ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్న వైనం శోచనీయం కాగా ఇటువంటి చర్యలు కార్మి క సంక్షేమానికి తీరని ద్రోహం చేయడమేనన్నారు. 279 జీవోను రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు ఒకప క్క ఉద్యమిస్తుంటే మరోపక్క జీవో ప్రకారం టెండర్లను పిలుస్తూ ప్రక్రియ ను కొనసాగించడం అప్రజాస్వామికమన్నారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తులసేంద్ర మాట్లాడుతూ కార్మికులు ఐక్యం గా ఉండి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించి కార్మిక హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక వేతనాలు పెంచకుండా కార్పొరేట్ సంస్థల కు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే వి ధంగా చర్యలు తీసుకొంటున్న తీరుతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నా రు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కార్మిక శాఖ అధికారులతో జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగియ గా తదుపరి చర్చలు జరిగే లోపుగానే 279 జీవోను అమలుకు కసరత్తు చేయ డం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు రవి, రామచంద్రయ్య, మ ల్లేశ్వరరావు, వాసు, సత్యనారాయణ, జి వెంకయ్య,తదితరులు ప్రసంగించారు.

మహాకవి గుర్రం జాషువా
రచనలు స్ఫూర్తిదాయకం
విజయవాడ (కార్పొరేషన్), జూలై 24: మహాకవి గుర్రం జాషువా కవితలు, రచనలు నాడు, నేడు, నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఎపిసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొరివి వినయకుమార్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎపిసిసి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జరిగిన గుర్రం జాషువా 46వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు జాషువా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి భారతదేశంలో నెలకొన్న విపత్కర సామాజిక పరిస్థితులపై ఎన్నో రచనలు చేసిన ఆయన మూఢాచారాలు, నమ్మకాలపై తిరుగుబాటు చేసిన వైనం వాటి రూపుమాపడానికి నాంది పలికిందన్నారు. కవిత్వమనే ఆయుధంతో సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టిన జాషువా రచనలు, కవితలు నేటి తరంవారికి ఆదర్శప్రాయమన్నారు. ఎన్నో సాహితీ అవార్డులతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మభూషణ, సాహిత్య అకాడమీ అవార్డులు పొందగా 1964లో రచించిన క్రీస్తుచరితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిందన్నారు. అంతేకాకుండా ఏ కవికి, రచయితకు దక్కని విధంగా అనేక సాహిత్య అవార్డులు పొందగా వాటిలో నగయుక కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ ప్రసిద్ధులైనారని, ఆయన రచనలను నేటి తరం వారికి అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, నరహరశెట్టి నరశింహరావు, వి గరునాథం, తదితరులు పాల్గొని జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు.

చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విజయవాడ (క్రైమ్), జూలై 24: వ్యవసాయ రంగం తర్వాత ఎంతో ప్రాముఖ్యత ఉన్న చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనూరాధ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో నూ చేనేత కార్మికులకు అమలుచేయని సంక్షేమ కార్యక్రమాలను నవ్యాంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. చేనేత కా ర్మికులకు పింఛన్లు, ప్రమాద బీమా ఉ త్పత్తులు అమ్ముకోవడానికి బజార్లు, రాయితీపై ముడిసరుకు, పక్కా ఇళ్లు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్ర భుత్వాల నిర్లక్ష్యంతో కుంటుపడ్డ చేనేత రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. వైఎస్ కాం గ్రెస్ ప్రభుత్వం హయాంలో చేనేత రం గాన్ని పూర్తిగా విస్మరించారని సోమ వారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. చేనేత రుణామాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 22,247 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చేలా రూ.71.39 కోట్లకు పైగా రుణాలను మాఫీ చేశాం. కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చేనేతకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ హయాంలో చేనేత ఆత్మహత్యలు అత్యధికంగా చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యల నివారణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయడంతో తగ్గాయన్నారు. చేనేతరంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. చేనేత వస్త్రాలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించేందుకు అమ్మకాలలో 30 శాతం సబ్సిడీని కొనుగోలుదారులకు ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో చేనేత వస్త్రాలు ధరించేలా ముఖ్యమంత్రి నారా చంఅదబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఆప్కో వస్త్రాలను పోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బిసి వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందిస్తున్నామని చెప్పారు. మార్కెటింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని గుర్తు చేశారు. రెడీమేడ్ రంగంలో ఆప్కో దూసుకుపోయేలా ప్రణాళిక రూపొందించడం జరిగింది. చేనేత కళాకారుల కోసం నిఫ్ట్ సహకారంతో 4 వేల డిజైన్లను రూపొందిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఆప్కో విక్రయ కేంద్రాలు, షోరూమ్‌లను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. అన్ని జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఆప్కో షోరూమ్‌లు, 13 జిల్లాల్లో నేత బజార్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక నుంచి ప్రతినెలా ఆప్కో పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని, 2017-18లో ఆప్కో బిజినెస్ టర్నోవర్ లక్ష్యం రూ.338 కోట్లు కాగా, 2018-19 నాటికి రూ.405 కోట్లు, 2019-20 నాటికి రూ.486 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగిందని వివరించారు. చేనేతల కోసం 4వేల వర్క్‌షెడ్లు సా థపించి, ఒక్కో యూనిట్‌కు రూ.75వేల చొప్పున ఈ ఏడాది రూ.30 కోట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు.