కృష్ణ

పోలవరం శత్రువులు ఆ ముగ్గురే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లకుండా ఆపటానికి కెవిపి రామచంద్రరావు, విజయసాయిరెడ్డి, జగన్ తమ శక్తియుక్తులు ప్రదర్శిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం స్థానిక జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, విజయసాయిరెడ్డిలు పోలవరం ప్రాజెక్టుపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, విభజన సమయంలో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపలేకపోయారని ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు మండలాలకు సంబంధించి రాష్టప్రతికి పంపామని చేతులు దులుపుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి మోదీని కలిసి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించి ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ రాష్టప్రతి చేత ఆర్డినెన్స్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టామని విమర్శిస్తున్నారని, ఎవరికి దండాలు పెడుతున్నారో, ఎవరి కాళ్లమీద పడుతున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రేమ చూపించే కెవిపి ఏనాడైనా పోలవరం ప్రాజెక్టు కోసం జరుగుతున్న పనులను చూశారా? అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు వేల రూపాయలు దళారీలకు ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత 110 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చి కుటుంబాలకు బట్టలు కూడా పెట్టామన్నారు. 2018 నాటికి గ్రావిటీతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు అందిస్తామని, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించడం, పక్క రాష్ట్రాల వారితో గొడవ చేయిస్తున్నారన్నారు. ఏ కోర్టులు కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆపమని చెప్పలేదని, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేస్తుందని కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ కాంగ్రెస్ ఎంపి కెవిపికి చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కెవిపి, దిగ్విజయ్‌సింగ్, విజయసాయిరెడ్డి ప్రశ్నించడం చూస్తే దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్న విధానం గుర్తుకు వస్తుందన్నారు. 134 టిఎంసిలు నిల్వ చేయాలని ప్రభుత్వం చూస్తుంటే అడ్డుకోవాలని కాంగ్రెస్, వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 నుంచి 2013 వరకు పోలవరం పనులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలన్నారు. ప్రాజెక్టు 100 శాతం నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెబుతున్నారన్నారు. పోలవరం నిర్వాసితులైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు చెందిన వారికి పునరావాసం కోసం మెరుగైన ప్యాకేజీ ఇవ్వడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ప్రయత్నిస్తున్నామన్నారు. మూడేళ్లలో రూ. 6,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, పదేళ్లలో 5వేల కోట్ల పని కూడా పోలవరం ప్రాజెక్టులో జరగలేదని ఎద్దేవా చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిచేసి సకాలంలో రైతులకు నీళ్లు అందిస్తామని మంత్రి ఉమా స్పష్టం చేశారు.