హైదరాబాద్

నరక కూపంగా మురికివాడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ హైదరాబాద్ నగరం మురికివాడల నరకకూపంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. భారత్ నీతి పేరిట ఒయు ప్రొఫెసర్ వి జగదీశ్వరరావు , జెఎన్‌యుకు చెందిన డాక్టర్ ఎస్ లింగమూర్తి, ఒయుకు చెందిన సోలంకి శ్రీనివాస్ హైదరాబాద్ నగరంలో మురికి వాడల స్థితిగతులపై చేసిన అధ్యయన నివేదికను బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు, డాక్టర్ కె లక్ష్మణ్ విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలో 1962లో 106 మురికి వాడలు ఉండగా, నేడు అవి 1476కు పెరిగాయని, దాదాపు 20 లక్షల మంది మురికివాడల్లో జీవనం సాగిస్తున్నారని నివేదికను రూపొందించిన ప్రొఫెసర్ వి జగదీశ్వరరావు వివరించారు. వారంతా రక్షిత తాగునీరు, నివాస సమస్యలు, మరుగుదొడ్లు సమస్యలతో సతమతం అవుతున్నారని సరైన రవాణా సౌకర్యం లేదని, మంచి వైద్యం అందుబాటులో లేదని చె ప్పా రు. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే హైదరాబాద్ నగరం మురికి కూపంగా మారిందని, ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని కొనసాగిస్తోందే తప్ప అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన స్థితి గతులను పెంచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు.