హైదరాబాద్

ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ ప్రజల వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతాయుతమైన అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి సరిగ్గా పదకొండు గంటల కల్లా హజరుకావాలని లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎం.ప్రశాంతి స్పష్టం చేశారు. సరైన సమయానికి రావాలంటూ ఎన్ని సార్లు చెప్పినా, ఇంకా కొందరు ఆలస్యంగానే వస్తున్నారని ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు తమ టోల్‌ఫ్రీ టెలీఫోన్ నెంబర్లను వెంటనే కలెక్టరేట్‌కు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టరేట్ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ, ఎస్సీ,బిసి మైనార్టీ తదితర శాఖలు తమకు ఉన్న టోల్‌ఫ్రీ నెంబర్లను కలెక్టరేట్‌కు పంపితే జిల్లా పరిధిలోని అన్ని మండల కార్యాలయాలతో పాటు ఇతర శాఖలకు చెందిన ఆఫీసుల్లో ప్రజలకు కన్పించేలా డిస్‌ప్లే చేయనున్నట్లు తెలిపారు. ఈ నెంబర్లు ప్రజలకు తెలిసేలా ప్రతి శాఖ విస్త్రృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని సమీక్షిస్తూ జిల్లాలోని వివిధ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? గత సంవత్సరం ఎన్ని నాటారు? వాటిల్లో ఎన్ని బతికున్నాయన్న సమాచారం తామిచ్చిన ప్రొఫార్మలో పొందుపర్చి కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా రుణాలకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బ్యాంకర్లు జాప్యం లేకండా త్వరగా ముందుకొచ్చి రుణాలను మంజూరు చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు
ప్రజావాణిలో భాగంగా ఫలక్‌నుమాలోని బంజారాకాలనీ, జంగమ్మెట్‌కు చెందిన ఆర్ భజరంగ్ లాల్ అనే ఎస్టీ యువకుడు తాను వికలాంగ నిరుద్యోగినని, బతకటానికి ఎలాంటి ఆధారం లేదని టెంట్ హౌజ్ పెట్టుకునేందుకు స్వయం ఉపాధి కింద రుణం మంజూరు చేయాలని కోరారు. అలాగే మల్లేపల్లిలోని అఫ్జల్‌సాగర్ నివాసి లక్ష్మిబాయి తనకు స్వయం పాధి కింద షాపు పెట్టుకునేందుకు రూ.2లక్షల రుణాన్ని మంజూరు చేయాలని కోరారు. గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు రుణం రాలేదని అన్నారు. వెంటనే తనకు రుణం మంజూరు చేయ్యాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వీటిపై స్పందిస్తూ ఎస్సీ, ఎస్టీ సంక్షేమాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.