హైదరాబాద్

ఔటర్ గ్రామాల్లో మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మంచినీటి కోసం అల్లాడిపోతున్న ఔటర్ రింగురోడ్డు లోపలి గ్రామాలకు తాగునీరందించేందుకు ఆగస్టు మొదటి వారంలో పనులను ప్రారంభించనున్నట్లు జలమండలి ఎండి దాన కిషోర్ తెలిపారు. సోమవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండి ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఆగస్టులో ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రిజర్వాయర్లన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసేలా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 183 గ్రమాలు, ఏడు మున్సిపాల్టీల్లో 403 రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి విడతగా ఇప్పటికీ నీటి సరఫరా లేని గ్రామాలతో పాటు ఒక్కో రిజర్వాయర్ అవసరమైన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ పనులను చేపడుతున్నట్లు వివరించారు. మొదటగా 67 రిజర్వాయర్ల పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే వేసవి కాలం నాటికి ఈ గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 2018 చివరి నాటికి మిగతా గ్రామాల్లో ఈ మంచినీటి సరఫరా పనులను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణానికి గుర్తించిన స్థలాలకు వెంటనే భూసార పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా ప్రాజెక్ట వివరాలు ఒక రికార్డులో పొందుపర్చాలని జిఎంలకు సూచించారు. ఇందులో ప్రతి గ్రామానికి సంబంధించి ప్రాజెక్టు పూర్తి వివరాలు ఉండాలన్నారు. మొదటి దశగా చేపట్టే పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి అయ్యేలా చూడాలని నిర్వహణ సంస్థలకు సూచించారు. పనులు ప్రారంభించే నాటికే కార్మికుల గ్యాంగ్‌లు, సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. అలాగే శివార్లకు మంచినీటిని అందించేందుకు ఇప్పటికే ప్రారంభించిన హాడ్కో ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును సైతం ఆయన అడిగి తెల్సుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పైప్‌లైన్ విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన రోడ్లకు మరమ్మతుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి అన్ని రిజర్వాయర్ల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ పరిధిలో ఉన్న పలు రిజర్వాయర్లను ఈ నెల చివరి నాటికి ప్రారంభించనున్నట్లు ఎండి తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు-1 డైరెక్టర్ బి. విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి. శ్రీ్ధర్‌బాబులతో పాటు ప్రాజెక్టు విభాగం సిజిఎంలు, జిఎంలు, నిర్వహణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.