మంచి మాట

సర్వాంతర్యామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి జన్మించినది మొదలు పెరగడం ప్రకృతిలో ఉంది. జన్మించిన ప్రతిదీ పెరుగుతుంది, తర్వాత నశిస్తుంది. శరీరముతో జన్మ తీసుకున్న మనుషులకు కూడా పుట్టుక, అస్తిత్వము, వృద్ధి, పరిణామం, అపక్షయము, మరణం అను ఆరు శరీర వికారాలు కల్గి ఉంటాయి.
పుట్టిన మనిషి మరలా మరణం ఆసన్నమయేవరకు జీవించడం జరుగుతుంది. మనిషికి ఆహారం, వసతి, దుస్తులు అవసరం. వీటన్నింటికీ ఆదాయం అవసరం. ఆదాయంతోపాటు మనిషి పెరిగి పెద్దయ్యాక ఒక కుటుంబం ఏర్పరచుకుంటున్నారు.
ఒక కుటుంబం ఏర్పడటం స్ర్తి, పురుషులు వివాహం చేసుకోవడం, సంతానోత్పత్తి జరగడం ఉంటుంది. మనిషి పుట్టుక, సంతానం సుఖ దుఃఖాలు జననం, మరణం ఇవన్నీ కాకుండా పూర్వం సంపాదించుకున్నవే!
మనిషి జీవించడానికి కుటుంబ పోషణకు తప్పనిసరిగా సంపాదన అవసరం. ఆడ, మగ భేదం లేకుండా కుటుంబ పోషణకై పని చేసుకుంటున్నారు. ఆ పని కూడా న్యాయంగా, నీతిగా చేసుకోగలగాలి. అంతేగాని అవసరాలకు మించి సంపాదనకై అర్రులు చాస్తూ అగచాట్లు పడటం జరుగుతోంది.
పూర్వం పురుషుడు కుటుంబ పోషణకై సంపాదనకై, స్ర్తిలు కుటుంబ నిర్వహణ అనే తీరు ఉండేది. నేడు మనుషులు ఎవరైనా 16 ఏళ్లు వచ్చినాయంటే సంపాదనలో పడిపోవాలన్న ఆరాటం చెందుతున్నారు. అంతేకాదు ఇంకా తక్కువ వయసు వుండేవారు కూడాసంపాదన మార్గాలను అనుసరిస్తున్నారు అక్కడక్కడ. కాని, పచ్చడి మెతుకులు ఆకలిని తీరుస్తాయా. పంచభక్ష్య పదార్థాల భోజనం కూడా ఆకలినే తీరుస్తుంది. నాలుకకు రుచి చపలత్వం తప్ప. దీన్ని తెలుసుకోకుండా పులిని చూచినక్క వాతపెట్టుకుంటున్నట్టు పాశ్చాత్యవ్యామోహంతో ఆధునికత పేరుతో మనిషి పలుపోకడలకు పోతూ అష్టకష్టాలు పడుతున్నారు.
భగవంతుని గూర్చి భక్తి అయినా తనకు తాను తెలుసుకోవడం జరగాలన్న మనసు, బుద్ధి అంతర్ముఖత చెందగలగాలి. బాహ్య ఆడంబరాలపై ఏ మాత్రం ఆసక్తి లేనివారు కావాలి. అంతర్ముఖంగా ప్రతీ పని గురించిన ఆలోచన చేసి దాని అంతరార్థం ఏమిటో తెలుసుకొనగలగాలి.
పనిగాని మాటగాని జరిగాక అయ్యో! కాకుండా ముందే ఆలోచన పరిశ్రమ చేసుకోవాలి. పరిస్థితికి స్పందన మాటలో కాకుండా మాట జారకుండా కోపపడకుండా అంతర్ముఖ సాధన తప్పనిసరి.
భగవంతుని ఆరాధనలో నిమగ్నమయినపుడు ఈశ్వరానుగ్రహంతో తనను గూర్చి తాను తెలుసుకునే ప్రయత్నం కూడా జరగనివాడు మనుష్య జన్మ దొరికి కూడా ఏవీ సాధించకుండానే మరణించడం అన్నది కడు దయనీయమైన స్థితి. లౌకికమైన విషయాలకే ప్రాధాన్యతనిస్తూ జీవించడం పుట్టుట, చనిపోవుట అన్నది ఎంతవరకు సమంజసం? ఈవిషయాన్ని గురించి ముందుగానే ఆలోచించాలి.
తనవనుకుంటున్న ఆస్తులు, బంధువులు, సమస్తం ఏవీ తనవి కావని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయం తను అనుకుంటున్న శరీరమే తనది కాదు ఒక తొడుగు ధరించడం జరిగిందని అన్నీ అద్దెకొచ్చినవే. తనవనుకుంటున్న అన్నింటిమీదా సర్వాధికారి కేవలం ‘సర్వాంతర్యామి’ మాత్రమే, అనితనకు లభించే ప్రతి అనుభవమూ తాను ఇంతకుముందు ఆచరించిన సుకృతం, దుష్కృతం వలననే ఎదురవుతున్నాయని తెలుసుకోవాలి.
అలా జరిగేలా చూస్తున్నది, చూసినది చూసేవి సర్వకాల సర్వావస్థల్లో సర్వాధికారి సర్వాంతర్యమియే అని గ్రహించవలసిన జీవనసత్యం.పరమాత్మే సర్వవిషయాలకు యజమాని. మనం సేవకులం మాత్రమే అన్నది నగ్నసత్యం.
సర్వప్రాణుల సర్వకర్మలు సర్వాంతర్యమి లీలలుగానే జరుగుతూంటాయి. నడిపేది నడిపించేది ఆ పరంధాముడే! దీన్ని తెలుసుకోకుండా ఉంటూ కేవలం అహంకార, మమకారాలతో కామ, క్రోధ, లోభ గుణాలతో నిత్యం కొట్టుమిట్టాడుతూ జీవనం గడిపితే దానివల్ల పరమాత్మకు దూరమవడం తప్ప సాధించేదీ ఉండదు.

-ఎ.నాగభూషణరావు