డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబ్దం రాకుండానే పెదిమలతో థాంక్ యు అన్నాడు. నవ్వి ఊరకున్నాను.
రఘురాంకి దూరమయ్యాక నాకు సంగీతం చాలా హెల్ప్ చేసింది. ఆ సాధనలో నా భావోద్వేగాలు చాలా కంట్రోల్ అయ్యేవి. అసలు మొదలుపెట్టింది రఘురాం కోసమే. తనకు చాలా ఇష్టం అన్నాడని. మొదటిసారి అతనికి దగ్గరకు అమెరికా రాగానే సర్‌ప్రైజ్ చెయ్యాలని చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ చూసి టీచర్‌గారు కూడా..
చాలా శ్రద్ధ చూపించేది. ‘‘నువ్వు అమెరికా వెళ్లిపోయాక నిన్ను చూడటానికి నేను వస్తాను’’ అనేది నవ్వుతూ! తనతోపాటు పాటకచేరీకి కూచోమంటే మాత్రం ఇష్టంగాండేది కాదు. కాని, ఎఐఆర్‌లో ఎప్పుడు అవకాశం వచ్చినా వెళ్ళేదాన్ని.
అప్పుడే లలిత సంగీతాన్ని నేర్చుకున్నాను. వాటిలో ఎంకి పాటలంటే వౌళికి చాలా ఇష్టంగా ఉండేది. ఎప్పుడూ ఈల వేస్తుండేవాడు.
పెళ్లిరోజు వచ్చేసింది.
కెనడానుండి సన్నాయి వచ్చింది. న్యూజెర్సీ నుంచి ఇండియా మల్లెపూలు వచ్చాయి. ఫ్లోరిడా నుండి తమలపాకులు, మామిడి ఆకులు వచ్చాయి. చికాగోనుండి కిళ్లీలు వచ్చాయి.
అమెరికాలో పెరిగిన అమ్మాయి, ఇండియాలో పెరిగిన అబ్బాయితో పెళ్లి జరుగుతోంది, అమెరికా నడిబోడ్డులో. నాలుగు యుగాలు రిప్రజెంట్ చేసే గుడి మధ్యలో. స్వచ్చంగా తెలుగు సంప్రదాయంతో, హిందూ ధర్మంతో, వేదమంత్ర పూర్వకంగా.
ఇది ఎవరైనా ఊహించారా- ఓ ఏభై ఏళ్ళ క్రితం? ప్రతి వెస్ట్రన్ కంట్రీలోనూ ఒక మినీ ఇండియాకి ప్రతిష్ఠాపన జరుగుతుందని? భారతీయ టెంపుల్ అంతా ఇండియన్ వెస్ట్రన్ అలంకారాలతో శోభాయమానంగా వెలిగిపోతోంది. విశాలమయిన పార్కింగ్ లాట్‌లో గుర్రంమీద కూర్చున్న వౌళిని చూస్తుంటే నా దిష్టే తగులుతుందేమోనని అనిపించింది. నెమలి పించం రంగు కుర్తా వేసుకున్నాడు. గోల్డ్ రంగు కండువా భుజంమీద వేళ్లాడుతోంది. నుదుట పొడుగాటి బొట్టు, గాలికి ఎగురుతున్న జుట్టు, చాలా హాండ్‌సమ్‌గా కనిపించాడు. ఆ మాట అంటే మా వదినేమనేదో లీలగా మనసులోకి వచ్చింది. ‘‘ఆ.. అందరూ అందగాళ్లే, కోతి పిల్ల కోతికి ముద్దు’’ అనేది. ఆవిడ వౌళి విషయంలో ఎప్పుడూ కాకికి బదులు కోతి అనేది. అప్రయత్నంగా చిరునవ్వు పెదిమలమీదకు వచ్చింది.
వౌళి ముందు చంద్రశేఖరం కొడుకుని కూచోపెట్టారు. వౌళి స్నేహితులు, చంద్రశేఖరం, శ్రీలక్ష్మి, భాస్కర్, అతని భార్య అందరం వాళ్ళతోపాటు నడుస్తూ వచ్చాం.
మొన్నటిదాకా సావిత్రితో కలిసి పెళ్లి పనులు చేసిన వాళ్ళంతా మేము ఇవాళ్టికి మగ పెళ్లివారం అంటూ నా పక్కన నుంచున్నారు నవ్వుతూ! మీ పక్కన నుంచుంటే అన్నీ బాగా చూడవచ్చని అని నవ్వింది ఒకావిడ.
వౌళికి దండ వేసి హారతి ఇచ్చి లోపలకు తీసుకువెళ్ళారు. గుర్రం ఎక్కి వచ్చే సరదా అంతా తేజా చెల్లెలిదట. మూర్తిగారు, సావిత్రి ఏ ఒక్క సరదా వేడుకలకు అభ్యంతరం పెట్టడంలేదు.
గుడి ప్రాంగణం దాటి లోపలకు వెళ్ళగానే పెద్ద విఘ్నేశ్వరుడి విగ్రహం పెట్టారు. దాని చుట్టూ లైట్లు, పూలతో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఎందుకనో అంత పెద్ద వినాయకుడి విగ్రహం చూడగానే మనసు చాలా ప్రపుల్లమయ్యింది. అన్నీ శుభ సూచకంగా అనిపించింది.
అందరం కలిసి క్రిందకు వెళ్లాం. ఎత్తయిన స్టేజీమీద ఎర్రటి కార్పెట్ వేసి ఉంది. దానిమీద పూలతో విశాలమయిన మండపం కట్టి ఉంది. అమెరికాలో ప్రెష్ పువ్వులతో పెళ్లి మండపం, ఎంత అందమయిన మండపం అనుకున్నాను. ఎదురుగా వందలలో కుర్చీలు వేసి ఉన్నాయి. ప్రతి కుర్చీకి లేత గోల్డ్ రంగు కవరు వేసి మెరూన్ రంగు బౌ కట్టి ఉన్నాయి. ప్రతి సీటు మీద ఒక చిన్న సైజు బుక్‌లాంటి పెట్టి ఉన్నాయి.
ఒక బుక్ తెరిచి చూచాను. అది ఆ పూట జరగబోయే పెళ్లికి ప్రతి ఒక్క తంతుకు వివరణ. ఎంతో చక్కగా రాసి ఉంచారు. చాలామంది ఫారినర్స్ రాబోయే ఈ పెళ్లికి ఒక వివరణ అన్నమాట.
పెళ్లి సమయం దగ్గర పడటంతో కుర్చీలన్నీ నిండసాగాయి. వౌళితోపాటు నేను కూడా స్టేజి మీద కూర్చోవడంతో అన్నీ పరికించడానికి వీలు అయింది.
ఎదురుగా బారులు తీరిన కుర్చీల్లో కూర్చున్న వాళ్ళందరి వంక పరికించి చూచాను. అమెరికన్స్, తెలుగువాళ్ళు, నార్త్ ఇండియన్స్ పూర్తిగా అన్ని రకాల వయస్సులతో పాటు, అందరూ ఉన్నారు. శ్రద్ధగా జరగబోయే కార్యక్రమం చూస్తున్నారు.
శాస్ర్తీగారు పెళ్లి కార్యక్రమం మొదలుపెట్టారు. పూర్తిగా మన తెలుగు పద్ధతుల్లో. ఆయన జరిపించే తీరు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేయబోయే ప్రతి ఒక్క తంతుకు ముందు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఇంగ్లీష్‌లో వివరిస్తున్నాడు. సిగ్నిఫికెన్స్ తెలుపుతున్నాడు.
నిజానికి ప్రతి కుర్చీమీద పెట్టిన చిన్న పుస్తకంలో అంతా రాసి ఉంది. అయినా సరే, చక్కగా వివరిస్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు.
వెనుక సన్నాయి మోగుతోంది. వేద మంత్రాలు వినబడుతున్నాయి. నా మనసు మాత్రం చెప్పుచేతల్లో లేకుండా ఊయల ఊగుతూనే ఉంది.
సడెన్‌గా సన్నాయి ఆగిపోయింది. దానికి బదులుగా చక్కని పెళ్లి పాట వినిపించింది. 5 లేక 6 ఆడపిల్లలు పూలు చల్లుతూ కుర్చీలమధ్య నుంచి దోవలో డాన్స్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ వెనక బుట్టలో కూర్చుని తేజ వస్తోంది.
చూడముచ్చటగా ఉంది దృశ్యం. స్టేజిపైన ఉండటంతో సంపూర్తిగా కనిపిస్తోంది. పరికిణి, ఓణీలు వేసుకుని వడ్డాణాలు, జడ కుచ్చులు, జుకీలతో ఆ డాన్సు చేస్తున్న పిల్లలు తెలుగుతనాన్ని ఒలకబోస్తున్నారు. వెనక వినవస్తున్న పెళ్లి పాట కూడా చాలా సమయానికి తగినట్లుగా వీనుల విందుగా వినవస్తోంది. ఎదురుగా కుర్చీలలో కూర్చున్న వాళ్ళంతా తల తిప్పి తేజ ఆగమనానే్న చూస్తున్నారు.
తేజ వచ్చి వౌళికి ఎదురుగా కూర్చుంది. శాస్ర్తీగారు చక్కగా మంత్రాలు చదువుతున్నారు. రామచంద్రమూర్తి పుత్రి, రఘురాం పుత్రయా అంటూ...
ఆ పేరు చెవులలో పడగానే మనసు మాత్రం కలవరపడింది. వెంటనే వౌళి వంక చూచాను. దవడలు బిగుసుకున్నాయి. దృష్టి క్రిందకు వాలి ఉంది. తన దోసిలో ఉన్న తేజ దోసిలిని చూస్తూ ఎటువంటి భావము వ్యక్తపరచకుండా ఉండిపోయాడు.
నా మనసు మాత్రం చాలా ఏళ్ళ తరువాత మళ్లీ ప్రశ్నించసాగింది.
రఘురాం పుయ్రా? కాదనుకుంటే తొలగిపోయే జ్ఞాపకమా! ఇది జీవితం.. చదివి పారేసే పుస్తకం కాదు. ‘‘వై రఘు.. వై? హౌ కుడ్ యు డు దిస్?’’’
అన్న ప్రశ్న రాకుండా ఉండలేదు. అంతలోనే ఒక్కసారి ఉలిక్కిపడ్డాను- సన్నాయి బలంగా మ్రోగేటప్పటికి.
వౌళి, తేజ ఒకరి తల మీద ఒకరు చేతులు పెట్టి ఉన్నారు సుముహూర్తానికి.
నా చేతిలో ఎవరు అక్షతలు పెట్టారో కూడా గ్రహించలేదు. నామీద నాకే కోపం వచ్చింది నా అసమర్థతకు.
తల ఒక్కసారి విదల్చుకుని మొహం నిండా నవ్వు తెచ్చుకుంటూ ఇద్దరిమీద అక్షతలు మనస్ఫూర్తిగా చల్లాను. సశాస్ర్తియంగా పెళ్లి హిందూ ధర్మం ప్రకారం అన్ని తంతులు జరిపించారు. ఏ ఒక్కరూ గబ గబ జరిపించేయాలని తొందర పడలేదు. ఏ ఒక్కటి స్కిప్ చేయడానికి ఇష్టపడలేదు. సలక్షణంగా వౌళి, తేజా కొన్ని వందల మంది సమక్షంలో భార్యాభర్తలు అయ్యారు.
మళ్లీ వాళ్ళు వలస వచ్చిన స్థిరపడిన దేశ సాంప్రదాయాన్ని వదలకుండా ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా నుంచుని ఉంగరాలు పెట్టుకున్నారు.
శాస్ర్తీగారు పక్కన నుంచుని ఆశీర్వచనాలు చదువుతున్నారు. గోరింటాకుతో పండిన తేజా చేతిని తన చేతిలోకి తీసుకుని వౌళి ఉంగరం తొడిగాడు.
-ఇంకాఉంది