భక్తి కథలు

బసవ పురాణం- 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ల కాళ్లమీద పడుతున్నాడు. వాళ్ల ఎంగిలి తింటున్నాడు. వాళ్ల ఇళ్ళల్లో దూరి భక్తి భక్తి అంటూ వర్ణసాంకర్యం చేసి మళ్లీ వచ్చి మీ వద్ద పెద్దవాడిలాగా కూర్చుంటున్నాడు. ఆ మాల భక్తులు వీధుల్లో వస్తుంటే చివరకు ప్రభూ మిమ్మల్ని కూడా భటులు లెక్కబెట్టుటలేదు.
ఈ విధంగా కల్యాణ నగరంలో వర్ణ్ధర్మాలు నశించాయి. దేశంలో జరిగే పాపం అణచకపోతే దేశాధిపతికి చెందుతుంది. ఆ పాపపు విషయాలు ప్రభువుకు అందజేయకపోతే పురోహితులకు చెందుతుంది. అందుకని మేము చెప్పవలసింది చెప్పాము. ఇంక మమ్మా పాపం అంటదు. ‘రాజానుమతో ధర్మః’ అన్నట్లు ఇక మీ ఇష్టం వచ్చినట్లు చేయండి’’.
అని పురోహితులు చెప్పిన మాటలు విని బిజ్జలుడు బసవనిపై మండిపడి బసవనికోసం కబురు పెట్టాడు. అప్పుడు బసవన్నా శివనాగుమయ్యను పల్లకీ ఎక్కించి ఊరేగిస్తూ ఆయన చేతిని తన చేత పట్టుకొని ముచ్చటిస్తూ రాజసభ ప్రవేశించాడు. ‘అదిగదిగో ఊళ్ళో చేసిన అధర్మం చాలదన్నట్లు స్వయంగా రాజసభకు కూడా మాలలతో వస్తున్నాడు బసవడు చూడండి, నిర్భయంగా గుండెలు తీసిన బంటు!’’ అన్నారు వారు.
అప్పుడు రాజు కోపంతో ద్వారాలు మూసివేయించి శివనాగుమయ్యను లోనికి రాకుండా చేసి తానే నగరి వాకిలి వెలుపలికి వెళ్లి నిలబడ్డాడు. బసవన్న అది చూచి ఏమీ అనుకోకుండా తనపై ఉత్తరీయాన్ని చుట్టి సింహాసనంగా చేసి దానిపై శివనాగుమయ్యను వీధిలోనే కూర్చుండబెట్టి ‘ప్రభూ! ఎందుకో నాకై కబురుబెట్టారుట!’ అన్నాడు.
అప్పుడు మహాక్రోధంతో కలుషాత్ముడై బిజ్జలుడు ఇట్లా అన్నాడు.
‘‘దేశంలో నేడు పద్దెనిమిది వర్ణాలున్నాయి. నీవు ఆ కులాలలో సాంకర్యం చేస్తున్నావు. శివభక్తి నీ తలమీద మాత్రమే పుట్టిందా ఏమిటి? నీతిహీనుడా! నీ పనులవల్ల ఇక వానలు కురువవు. పంటలు పండవు’’.
అది విని బసవేశ్వరుడా రాజుతో ఇలా అన్నాడు: ‘‘ప్రభూ! మాదిగ కులంలో పుట్టిన మాచలదేవిని ఉత్తమ వంశస్థురాలిగా చేస్తామని కొందరు బ్రాస్మణులు ఒక బంగారు ధేనువును చేయించారు. దాని కడుపులో మాచల దేవిని కూర్చోబెట్టారు. ఆ ధేనువు తడిసేటట్లు పాలుబోసి ‘మాచలదేవి మాదిగ కులం ఇప్పుడు పోయింది’ అని మాచలదేవికి వారు నమస్కరించారు. అంతటితో ఊరుకోక ఆమె ఎంగిలి పాలన్నీ వాళ్లు తాగారు. ఆ తర్వాత ఆ బంగారం ఆవును ముక్కలు చేసి తలా ఒక భాగం పంచుకున్నారు. కొమ్ములు, తోక, ఎముకలు, పొట్ట, డెక్కలు మొదలైన భాగాలన్నీ సోమాదులు, చతుర్వేదులవారు, ఉపాద్దేలయ్య, బ్రహ్మ విద్వాంసులూ, షడంగులవారూ, ప్రభాకర భట్ల వారూ, వ్యాకరణంవారు, త్రివేదులవారు, పరదేశి విద్యార్థి వారు పంచుకున్నారు. ఈ విధంగా ధనంకోసం వారు గోహత్య చేసినట్లే అయింది. రాజా చెప్పు! వారా మాలలు లేక శివనాగుమయ్య మాలడా?
వేదాలు మొదట పుట్టాయా? కులాలు మొదట పుట్టాయా చెప్పు! వేదంలో రెండే జాతులు చెప్పబడి వున్నాయి. భావకర్మ సంస్కారి ప్రవర్తకుడు. శివకర్మ సంస్కారి నివర్తకుడు. వేదాలలో ఇలా చెప్పబడి వుంటే నిన్న మొన్న పుట్టిన ఈ కులాల మాటేమిటి? ఈ పద్ధెనిమిది కులాలూ కులాలు కావు. ఎవడు భక్తుడో వాడొక్కడే ఉత్తమ కులజుడు. భక్తుడు శివునికి సాక్షాత్తు ప్రతిబింబం. అటువంటివాడిని మానవుడని భావించకూడదు. దరిద్రుడు బంగారం పట్టుకున్నా మట్టిగానే మారినట్టు భక్తిహీనుని జంగమయ్యలు మామూలు మనుషులవలెనే కన్పడతారు.
బిజ్జలా! భక్తుల మాహాత్మ్యం నేనేమని చెప్పను? సింహానికి కుక్కలు సాటిరావు. సముద్రంతో చిన్న గుంటలు పోల్చలేము. గంగతో మురికి కాలువను పోలుస్తామా? సూర్యునితో మిణుగురు పురుగులను పోల్చగలమా? చంద్రునికి నక్షత్రాలు సాటిరానట్లు మేరువుతో మిట్టలను పోల్చలేనట్లు పారిజాతాలతో పిచ్చి చెట్లను ఉపమించరానట్లు శివనాగుమయ్యతో ఈ చెడు పురోహితులను పోల్చవద్దు.
రాజా! శ్రీపతి పండితారాధ్యుడు అనంతపాలుని నిండు సభలో నిలబడి ‘శివశరణుడొక్కడికి కోటిమంది బ్రాహ్మణులైనా సరే సమానం కాదు. సమానమయితే నేనిక నా నాలుక కోసివేసుకొంటాను. ఇదే ప్రతిజ్ఞ’ అని తనమీద శాలువా అంచున భగభగమండే నిప్పులు మూట కట్టి చూపాడు. కాబట్టి బిజ్జలా! శివభక్తుని ఇంటిముందుండే కుక్కతో కూడా వారు సరిగారు అని బసవేశ్వరుడు తన వాదాన్ని బలపరుస్తూ మరికొందరు శివభక్తుల కథలు ఉదాహరించాడు.
‘‘కాబట్టి ఓ బిజ్జలా! రాయి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠింపబడ్డప్పుడు శివలింగమైనట్లు లింగదీక్ష పొందిన తర్వాత అంత్యజుడు కూడా హరసన్నిహితుడు అవుతాడు. మేరువు నీడలో కాకి కూడా బంగారు వర్ణము పొందుతుంది. భ్రమరంవల్ల కీటకం కూడా భ్రమరంగానే మారుతుంది.
- ఇంకా ఉంది