ఫోకస్

బాధ్యతతో మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తిగత అంశాలు ప్రతి వ్యక్తికి ముఖ్యమైనవే. ప్రభుత్వమైనా, ప్రైవేట్ సంస్థలైనా, మీడియా అయినా, సోషల్ మీడియా అయినా వ్యక్తిగత విషయాలకు ప్రచారం కల్పించే సమయంలో బాధ్యతతో మెలగాలి. ‘యూనిక్ ఐడి’ పేరుతో కేంద్ర ప్రభుత్వ దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను సేకరించింది. జాతి శ్రేయస్సు దృష్ట్యా వ్యక్తిగత విషయాలను కేంద్ర ప్రభుత్వం సేకరించడంలో తప్పులేదు. ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులుంటాయి. రాజ్యాంగమే ఈ హక్కులను కల్పించింది. ఇతరులకు హాని చేయనంత వరకు, సమాజానికి కీడు చేయనంత వరకు, దేశద్రోహానికి పాల్పడనంత వరకు ప్రతి వ్యక్తి తనకు లభించిన హక్కులను పూర్తిగా వాడుకునే వీలును రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. 67 ఏళ్ల క్రితం రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ హక్కుల్లో ఇప్పటి వరకు చిన్న మార్పు కూడా చేయకపోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం అధీనంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అఫ్ ఇండియా (యూఐడిఎఐ) సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ ఇచ్చింది. ఆధార్ నెంబర్‌కోసం ప్రతి వ్యక్తి తనకు సంబంధించిన జన్మ తేదీ, వయస్సు, ఫోన్ నెంబర్, ఇ-మెయిల్ చిరునామా, వేలిముద్రలు, ఇంటి చిరునామా, కంటిపాపల గుర్తులు, ఫోటో తదితర వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో, ఈ విషయాలు ఎవరికీ తెలియకూదన్న తపనతో ఇస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఈ వివరాలు బహిర్గతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందువల్ల ఆధార్ నెంబర్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పౌరులు అందించే వివరాలను గోప్యంగా ఉంచాలనడంలో తప్పులేదు. బ్యాంకుల్లో కూడా కస్టమర్లు అకౌంట్ ప్రారంభించే సమయంలో, రుణాలు తీసుకునే సమయంలో వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నారు. బ్యాంకర్లు కూడా ఈ సమాచారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ ఇవ్వకూడదు. బ్యాంకు-కస్టమర్ పరస్పరం గౌరవం కలిగి, నియమ నిబంధనలకు లోబడి ఉండాలి.
ప్రభుత్వ విచారణా సంస్థలైన విజిలెన్స్, ఎసిబి, సిబిఐ, ఎక్సైజ్, పోలీసు విభాగం, తదితర విభాగాలకు చెందిన అధికారులు అనుమానంపై, వివిధ కేసుల్లో కొంతమంది వ్యక్తులను విచారణ చేస్తున్నారు. విచారణ చేయడంలో ఎలాంటి తప్పులేదు. అయితే కేసు నమోదైన వ్యక్తి తప్పు చేశాడని, నేరం చేశాడని కోర్టు ధ్రువీకరించేవరకు సదరు వ్యక్తి గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఒక వ్యక్తిపై, ఒక సంస్థపై నేరంమోపగానే వారు నేరానికి పాల్పడ్డట్టు ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తి లేదా సంస్థ పరువు తీసే అధికారం మీడియాకు గాని, సోషల్ మీడియాకు గాని లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది.

- పి. పురుషోత్తంరావు సామాజిక నిపుణుడు