ఫోకస్

బహిర్గతం చేయక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోప్యత అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులదే. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ఆస్తుల పరిరక్షణ వంటి కొన్ని అంశాలకు సంబంధించి వాటిని బహిర్గతం చేయకతప్పదు. శాంతిభధ్రతల పరిరక్షణకోసం కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, మోసాలకు పాల్పడే వారి వివరాలు బహిర్గతం చేస్తే, వారు కుట్రలు విఫలమయ్యే అవకాశముంటుంది. కొంతకాలం క్రితం ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయటం వివాదాస్పదం కావటంతో ఇది వ్యక్తిగత సమాచార గోప్యతకు ఆటంకం కల్గిస్తుందనే భావనతో నిలిపివేశాం. జిహెచ్‌ఎంసి ప్రజలకు అందిస్తున్న కొన్ని పౌరసేవలకు సంబంధించి కొన్ని అంశాలను బహిర్గతం చేయక తప్పదు. ఉదాహరణకు ఒక లేఅవుట్, వెంచర్ ప్లాన్ ఆమోదంకోసం తమను బిల్డర్లు, డెవలపర్లు ఆశ్రయిస్తే వారడిగిన అనుమతి, నిబంధనల ప్రకారం తామిచ్చిన అనుమతులను బహిర్గతం చేస్తే మోసపూరితమైన వెంచర్లు, కుట్రలకు ప్రజల బలి కాకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యతపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించటంతోపాటు అవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని సర్కారు పర్యవేక్షించాలి. అయితే ఏయే అంశాలు వ్యక్తిగత వివరాల కిందకు వస్తాయో ఇంకా కొంచెం స్పష్టత రావల్సి ఉంది.

- డా.బి. జనార్దన్ రెడ్డి, ఐఏఎస్, కమిషనర్ జిహెచ్‌ఎంసి