మిలటరీ ట్రైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వాడ జగన్నాథమ్ తరువాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 3నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా2. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మిలటరీ అధికారిగా కన్పించనున్నాడట. దానికోసం ఆయన నిజంగానే మిలటరీ ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలోని పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. నెల రోజులపాటు ట్రైనింగ్ అమెరికాలో ఉంటుందట. ఈ సినిమా కోసం బన్నీ తన లుక్‌లో కూడా కొత్త మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అర్జున్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా ఎంపికైంది. అల్లు అర్జున్ అమెరికాలో ట్రైనింగ్ పూర్తిచేసుకొని వచ్చిన తరువాత షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది. లగడపాటి శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్‌లు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రికార్డింగ్ కూడా మొదలుపెట్టారట.