అదంతా దర్శకుడి క్రెడిటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఎక్కడ చూసినా భానుమతి అందరినీ ఫిదా చేసింది. ముఖ్యంగా కుర్రకారుకి భానుమతి ఫీవర్ పట్టుకుంది. ఆ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది అందాల భామ సాయిపల్లవి. మలయాళంలో రూపొందిన ప్రేమమ్ సినిమాలో నటించిన సాయి పల్లవి ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. వరుణ్‌తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను తెచ్చుకుని విజయవంతంగా నడుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా సాయి పల్లవితో చిట్ చాట్...
* మార్కులన్నీ మీరే కొట్టేశారు?
- చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికెళ్లినా భానుమతి అని పిలుస్తున్నారు. ఫిదా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్!
* వర్క్‌షాప్‌లో పాల్గొన్నారా?
- అవును. నేను మలయాళ సినిమా కోసం వర్క్‌షాప్ చేయలేదు. కానీ ఈ సినిమా కోసం చేశాను. ఇందులో నా డైలాగులు ముఖ్యమైనవి. అందుకనే ఆరోగ్యకరమైన చర్చలు జరిపాం.
* పక్కా మాస్ డైలాగులు చెప్పారు?
- బొక్కలిరగ్గొడతా అనే డైలాగ్ నాది కాదు. నేను రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్. బూతులు అస్సలు మాట్లాడను. కానీ సినిమా కోసం డైరెక్టర్ చెప్పిందే చేశాను.
* తెలంగాణ యాస బాగా పట్టేశారు?
- శేఖర్ కమ్ముల, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లంతా కలిసి నేర్పించారు. సులభంగా నేర్చుకున్నానని అన్నారు. దాంతోపాటు ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాను. అలాగే నాట్లు వేయడం కూడా బాగా వచ్చింది.
* ప్రేమమ్ తెలుగు సినిమా మిస్సయ్యారా?
- నిజానికి ఆ సినిమా గురించి నా దగ్గరికి ఎవరూ రాలేదు. అయితే, చేసిన పాత్రనే మళ్లీ చేయనని చెప్పాను. ఒకవేళ భానుమతి పాత్రను మళ్లీ ఎవరైనా చేయమని చెబితే చేయను.
* అంటే.. రీమేక్‌లు చేయరా?
- అలా అని కాదు. నేను రీమేక్‌లకు వ్యతిరేకం కాదు. కాకపోతే నన్ను అవి అంతగా ఎగ్జైట్ చేయలేవేమోనని నా ఫీలింగ్.
* డాక్టర్ చదువు ఎంతవరకు వచ్చింది?
- చదువు పూర్తయింది. జార్జియాలో ఎంబిబిఎస్ చేశాను. ఇక్కడుంటే సినిమాల్లోకి వెళతానని జార్జియా పంపించారు. కార్డియాలజీ చదవాలనుంది. సినిమాలు చాలనుకున్నాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తా.
* వరుణ్ తేజ్ గురించి?
- ఆయనకోసం పెద్ద హీల్స్ వేసుకున్నా. అయినా మా జంట బాగా వుందని చాలామంది అంటున్నారు. వరుణ్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. చాలా కామ్. ఏ సన్నివేశానికి ఎంత కావాలో అంతే నటిస్తాడు.
* మీరు పవన్‌కళ్యాణ్ అభిమానా?
- ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ ఫ్యాన్‌ని. ఆయనలా చేయగానే అందరూ అభినందించారు. నా నటనకు మెచ్చి అభినందిస్తున్నారా? లేక పవన్‌లా చేశానని అంటున్నారా? అర్థం కాలేదు.
* మీకు నచ్చిన హీరోలెవరు?
- నేను తమిళ అమ్మాయిని కాబట్టి రజనీ, కమల్ అంటే ఇష్టం. సూర్య, జ్యోతికల నటన బాగా ఇష్టం.
* తదుపరి చిత్రాలు
- ప్రస్తుతానికి చర్చలు దశలో ఉన్నాయి. త్వరలోనే తెలియజేస్తా.

- శ్రీ