బాబాయ్‌తో అబ్బాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన సినిమాలు చేస్తూ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోలేదు ప్రముఖ నటుడు వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకునేలా సినిమాలు చేసిన ఆయన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీస్టారర్ సినిమాలకు తెరలేపారు. ఆ తరువాత పవన్‌తో గోపాల గోపాల, రామ్‌తో మసాల వంటి చిత్రాలు చేసిన వెంకటేష్, తాజాగా రానాతో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం రానా హీరోగా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి త్వరలో విడుదలకు సిద్ధమైం ది. ఈ సినిమా తరువాత మరో సినిమాను చేయనున్న రానా, ఈసారి ఆయన బాబాయ్‌తో కలిసి నటిస్తాడట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మనం సినిమా తరహాలో రామానాయుడు ఫ్యామిలీ హీరోలంతా కలిసి ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం.