మెయన్ ఫీచర్

టిబెట్ వ్యథకు చారిత్రక నేపథ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా మనకు శత్రుదేశమన్నది ధ్రువపడిన వాస్తవం. చైనా వస్తువులను మనం కొనకుండా వాటిని బహిష్కరించడం దేశభక్తికి చిహ్నం, జాతీయతా నిష్ఠకు, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ దీక్షకు నిదర్శనం! ప్రజల మనోభావాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువుల దిగుమతిని నిషేధించడం జనాదేశానికి అనుగుణమైన పరిణామం కాగలదు. ఈ పరిణామక్రమాన్ని నిరోధించడానికి యత్నించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను జనం హర్షించరు! చైనా వస్తువులు మన దేశంలోకి కుప్పలు తెప్పలుగా వస్తుండడం ‘ప్రపంచీకరణ’కు, ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళికి సంబంధించిన వ్యవహారం కాదు! క్రీస్తుశకం 1989లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఆరంభించిన ‘పథ భగ్న విధానాని’కి పరాకాష్ఠ చైనా వస్తువులు మనదేశాన్ని ముంచెత్తడం! 1962 నుంచి మన ప్రభుత్వం ‘సరిహద్దు’ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. దురాక్రమించిన మన భూమిని చైనా తిరిగి మనకు అప్పగించే వరకు చైనాతో మనం ఎలాంటి వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోరాదన్నది ఆ విధానం. చైనాకు వెళ్లి వచ్చిన 1988వ సంవత్సం నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ భద్రతా మార్గాన్ని భగ్నం చేసాడు. ఆయన రూపొందించిన విధానానికి అందువల్లనే ‘పథ భగ్న’-పాత్ బ్రేకింగ్-దౌత్యనీతి అన్న పేరు వచ్చింది! సరిహద్దుల భద్రతతో నిమిత్తం లేకుండా- చైనా దురాక్రమించిన మన భూమి నుంచి తొలగిపోయినా, తొలగకపోయినా కూడ ఆ దేశంతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలన్నది ఈ ‘పథభగ్న’ విధానం! అందువల్ల చైనా వస్తువులను, సంస్థలను, పెట్టుబడులను ప్రభుత్వాలు నిషేధించడానికి ‘ప్రపంచీకరణ’ అడ్డుకాదు. కావలసింది చైనాను ప్రతిఘటించి తీరాలన్న స్థిర నిశ్చయం! ప్రపంచీకరణ మొదలైన తరువాత అనేకసార్లు ఆమెరికా, చైనా, ఐరోపా దేశాలు మన వస్తువులను నిషేధించడం పూర్వ ఉదాహరణ! మన వ్యవసాయ ఉత్పత్తులను సైతం ఈ దేశాలు నిషేధించాయి! యాదగిరి గుట్ట వంటి దివ్య క్షేత్రాలలో నెలకొనే విగ్రహాలను రూపొందించే పనిని చైనాకు అప్పగించడం, అమరావతి నిర్మాణంలో చైనీయ వాణిజ్య తస్కర ముష్కరులకు భాగస్వామ్యం కల్పించడం జాతీయతా నిష్ఠకు భంగకరం, ప్రజల మనోభావాలకు గాయం.. గాయపడిన మన సరిహద్దులు 1962 నుంచి రోదిస్తున్నాయి! ఈ గాయాలను మాన్పడానికి చైనా వస్తువులను బహిష్కరించడం ఒక చికిత్సా పద్ధతి! మరో ప్రధానమైన చికిత్స టిబెట్ స్వాతంత్య్రాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించడం..
క్రీస్తుశకం 1950వ దశకంలో మన ప్రభుత్వం స్వతంత్ర టిబెట్ దేశం నుండి మన సైనిక దళాలను ఉపసంహరించుకుంది, టిబెట్ తమ దేశంలో భాగమన్న కమ్యూనిస్టు నియంతృత్వ చైనా వాదాన్ని అంగీకరించింది. అందువల్ల చైనా ‘ఎఱ్ఱ’ దళాలు టిబెట్‌ను దురాక్రమించి మన దేశ సరిహద్దులలో తిష్ఠ వేయగలిగాయి. ఒకసారి టిబెట్‌ను చైనాలో భాగంగా గుర్తించిన మన దేశం ఇప్పుడు మాట తప్పవచ్చునా? టిబెట్‌ను స్వతంత్ర దేశంగా పరిగణించవచ్చునా? అని కొందరు చైనా మద్దతుదారులు, పరాజయవాదులు ప్రశ్నించవచ్చు. కానీ టిబెట్ విషయమై చైనా కమ్యూనిస్టు నియంతలు 1949 నుంచి అనేకసార్లు మాట తప్పారు. కమ్యూనిస్టు నియంతలు గత రెండు దశాబ్దాలుగా ‘కాపటలిస్టు’-పెట్టుబడిదారీ-నియంతలుగా మారి ఉన్నారు. మారితే మారవచ్చు, ‘కాపిటలిజమ్’, ‘కమ్యూనిజమ్’ రెండూ ఒకే ప్రజావ్యతిరేక బింబానికి రెండు ముఖాలు. కానీ చైనా నియంతలు మాట తప్పడం ప్రస్తుతాంశం. క్రీస్తుశకం 1914 వరకు దాదాపుపదిహేను వందల ఏళ్లకు పైగా టిబెట్ చైనా దురాక్రమణను ప్రతిఘటించింది. 1914 తరువాత టిబెట్ స్వతంత్ర దేశమన్న చారిత్రక వాస్తవాన్ని చైనా ప్రభుత్వం అంగీకరించింది! 1949 వరకు కూడ చైనా ప్రభుత్వం టిబెట్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. టిబెట్ ప్రభుత్వం తమదేశ రక్షణ కొరకు భారత సైనికులను తమదేశంలో నెలకొల్పుకుంది కూడ. కానీ చైనాలో కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ ఏర్పడిన తరువాత చైనా మాట తప్పి టిబెట్ స్వాతంత్య్రాన్ని హరించింది! తమదేశంలోకి చొరబడిన చైనా దళాలను చైనా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని టిబెట్ ప్రభుత్వం 1951 జనవరిలో పదే పదే కోరింది. టిబెట్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోబోమని చైనా ప్రభుత్వం హామీ ఇచ్చింది, మాట తప్పింది. చైనా దళాలను నిరోధించిన అనేక వందల మంది టిబెట్ పౌరులను 1954లో చైనా కాల్చి చంపింది. వందలాది బౌద్ధ బిక్షువులు సైతం చైనా తూటాలకు బలయ్యారు! టిబెట్‌ను చైనా కలుపుకున్నప్పటికీ 1959 వరకు ‘స్వతంత్ర ప్రతిపత్తిని, స్వయంపాలన’ను టిబెట్‌కు ప్రసాదించినట్టు చైనా పదే పదే ప్రకటించింది! 1956 జనవరిలో కమ్యూనిస్టు అధినేత మావోసేటుంగ్ స్వయంగా ఈ సంగతిని ధ్రువీకరించాడు. చైనా మళ్లీ మాట తప్పింది. 1959లో టిబెట్‌ను పూర్తిగా దిగమింగింది. ఇలా మాటను పదే పదే తప్పిన చైనాకు మనం టిబెట్‌ను స్వతంత్రదేశంగా గుర్తించడమే గుణపాఠం. మనం ఇలా గుర్తించినట్టయితే కనీసం యాబయి దేశాల వారు టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని వెంటనే గుర్తించే అవకాశం ఉంది.
ఇలాంటి టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండడం దాదాపు ఇరవై ఆరు శతాబ్దుల చరిత్ర.. అంతకు పూర్వం కలియుగం ఆరంభంలోను, అంతకు పూర్వం వేల ఏళ్లుగా టిబెట్ భరత ఖండంలో భాగం. ప్రపంచంలో వైవిధ్య రీతుల సమాజం పరిఢవిల్లిన ప్రాంతం కలియుగ ఆరంభం నుండి భరత ఖండం మాత్రమే! వైవిధ్యాల మధ్య సమన్వయం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం భారత జాతీయ జీవన స్వభావం. వైవిధ్యమైన పద్ధతులు నెలకొని ఉండడం మన దేశంలో అనాదిగా కొనసాగుతున్న వ్యవస్థ! తెలుగు,కన్నడ, మరాఠా ప్రాంతీయులు ‘చాంద్రమాన’ కాలగణనాన్ని పాటిస్తున్నారు. ఇది చంద్రుని గమనంతో ముడివడిన కాలగణనం. ఈ గణనంలో సంవత్సరానికి మూడు వందల యాబయి నాలుగు రోజులు! అమావాస్య తరువాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు నెలను లెక్కించడం ఈ పద్ధతి! ఇదే పద్ధతిని టిబెట్ ప్రజలు కూడ అనాదిగా పాటిస్తున్నారు! దక్షిణ భారతానికి టిబెట్‌కు మధ్య ఉన్న ఉత్తర భారతంలో ప్రధానంగా ‘బృహస్పతి’ గమనంతో ముడివడిన కాలగణనను పాటిస్తున్నారు! ఈ ‘బార్హస్పత్య’ మానంలో పౌర్ణమి తరువాతి పాడ్యమి నుంచి మళ్లీ పౌర్ణమి వరకు నెలను లెక్కిస్తున్నారు. టిబెట్ ప్రజలు తమకు సమీపంలో ఉత్తర భారత పద్ధతిని కాక దక్షిణ భారత పద్ధతిని పాటించడం అద్భుతమైన చారిత్రక వాస్తవం. తమిళ ప్రాంతంలోను దేశంలోని మరి కొన్ని ప్రాంతాలలో ‘సౌరమానం’ పాటిస్తున్నారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడంతో పనె్నండు సంక్రాంతులు ఏర్పడుతున్నాయి. మేష సంక్రాంతి నుండి మీన సంక్రాంతి వరకు పనె్నండు నెలలు! ఈ పనె్నండు నెలల ‘సౌర’ సంవత్సరానికి మూడు వందల అరవై రోజుల ఐదు గంటల నలబయి తొమ్మిది నిముషాలు కాల వ్యవధి! పాశ్చాత్య దేశాలలో కేవలం ‘సౌరమానం’ పాటిస్తున్నారు. అరబ్ దేశాలలోను, మరికొన్ని దేశాలలోను కేవలం ‘చాంద్రమానాన్ని’ పాటిస్తున్నారు. అందువల్ల ఉభయుల కాలగణన మధ్య ప్రతి సంవత్సరం పదకొండు రోజులు తేడా వస్తోంది! ఒక శతాబ్ది గడిచేసరికి మూడు సంవత్సరాల తేడా ఏర్పడుతోంది! కానీ అనాదిగా చాంద్రమానాన్ని, సౌరమానాన్ని కూడ పాటిస్తున్న భారతదేశంలో ఇలా తేడా రావడం లేదు. ఇందుకు కారణం వైవిధ్యాల మధ్య ఉన్న సృష్టిగత సమన్వయాన్ని గుర్తించిన భారతీయుల ఖగోళ విజ్ఞానం! చాంద్రమానాన్ని, బృహస్పతి మానాన్ని ఇంకా నక్షత్ర మానం వంటి ఇతర కాల గమనాలను సౌర మానంతో నిరంతరం అనుసంధానం చేస్తున్న సహజ వ్యవస్థ ఖగోళంలో అనాదిగా అనంతంగా నిహితమై ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారతీయులు ఈ సృష్టిగత వాస్తవాన్ని సమాజ స్థితం చేసుకున్నారు. చాంద్రమాన పద్ధతిలోని మూడు వందల యాబయి నాలుగు రోజుల సంవత్సరాన్ని ‘సౌరమాన’పు మూడు వందల యాబయి ఐదురోజుల సంవత్సరంతో అనుసంధానం చేసుకుని సమన్వయం సాధించారు. ఈ సమన్వయం పేరు అధిక మాసం.. ఇలా అధిక మాసాన్ని లెక్కించే పద్ధతి టిబెట్‌లో ఇప్పటికీ అమలులో ఉంది! భారతదేశంలో అమలులో ఉన్న ‘అధికమాసం’-అదనపునెల టిబెట్‌లో అమలులో ఉండడం, టిబెట్ భారతదేశంలో భాగమన్నదానికి సనాతన సాక్ష్యం. చాంద్రమానంలో మూడేళ్లకొకసారి అదనంగా మరో నెలను లెక్కించడం ‘అధికమాసం’ పద్దతి! ముప్పయి మూడు లేదా ముప్పయి నాలుగు నెలలకొకసారి ఇలా ‘చాంద్రమానం’లో అదనపు నెల చేరడం సృష్టిగత సహజ వ్యవస్థ, మానవులు సృష్టించినది కాదు! గ్రహించడం భారతీయుల విశిష్టత.. టిబెట్ ప్రజలు భారతీయులు! ముప్పయి మూడు నెలలు గడిచేసరికి సౌరమానం ప్రాతిపదికగా, చాంద్రమాన ‘గణనం’లో నెలరోజులు తగ్గుతున్నాయి! ‘చాంద్రమానం’లో అదనపు నెల చేరడంలో ‘సౌరమానం’తో సమానత్వం ఏర్పడుతోంది, ‘సౌరమానం’లో అధిక మాసం లేదు!
టిబెట్ ఒకప్పుడు భారతదేశంలో భాగమని చెప్పడానికి ఇది-కాలగణనం-ఒక చారిత్రక సాక్ష్యం మాత్రమే! సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి. అయితే క్రీస్తునకు పూర్వం ఎనిమిదవ నాలుగవ శతాబ్దుల మధ్య టిబెట్ మన దేశం నుండి విడిపోయింది! ఆంధ్ర శాతవాహన వంశం వారు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పాలించిన సమయం అది! క్రీస్తునకు పూర్వం ఎనిమిది వందల ముప్పయి మూడవ సంవత్సరం నుంచి క్రీస్తునకు పూర్వం మూడువందల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఆంధ్ర శాతవాహనులు భారత సమ్రాట్టులు! ఈ సమయంలో పడమటి నుంచి పారశీకులు మనదేశాన్ని దురాక్రమించారు.. ఆ సమయంలో దేశం దృష్టి ‘పడమటి’ దురాక్రమణపై కేంద్రీకృతమైంది. ఉత్తరపుచివరన ఉన్న టిబెట్‌ను మన పాలకులు పట్టించుకోలేదు. క్రీస్తునకు పూర్వం మూడు వందల ఇరవై ఆరవ ఏట నుంచి దేశాన్ని నడిపిన గుప్తవంశం వారు కూడ పడమటి నుంచి వచ్చిపడిన అలెగ్జాండర్, సెల్యుకస్ వంటి గ్రీసు బీభత్సకారులతో తలపడవలసి వచ్చింది! గుప్తుల తరువాత దేశాన్ని పాలించిన ‘ప్రమర వంశం’ వారు కూడ క్రీస్తుశకం ఆరవ శతాబ్ది వరకు పడమటి దురాక్రమణను తిప్పికొట్టడంలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ‘సమ్రాట్టు’లు పట్టించుకోని టిబెట్ క్రమంగా భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నుండి విడివడింది, స్వతంత్ర దేశమైంది! ఆ తరువాత, ఆరబ్బుల తురష్కుల ఐరోపా ముష్కరుల దురాక్రమణ సమయంలో మన ‘పడమటి’ ధ్యాస ఇటీవలి చరిత్ర..

-హెబ్బార్ నాగేశ్వరరావు