Others

ఉత్తమ ఉపాధ్యాయుడంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్ప పనులు చేసే మహనీయులే గొప్ప నాయకులు కాదు. గొప్ప పనులు చేసే వారిని తయారుచేసేవాడే గొప్ప లీడర్ అవుతాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మారి తన ఫిలాసఫీని, తన ఆదర్శాలను విద్యార్థుల ముందు పెట్టి వారిని గొప్ప ఆవిష్కర్తలుగా తయారుచేస్తాడు. ఉపాధ్యాయుడు ‘లీడర్’గా మారాలంటే తన ఫిలాసఫీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ‘నేనేందుకు చదువు చెప్పుతున్నాన’నే ప్రశ్న వేసుకోవాలి. గొప్ప విద్యార్థులు తయారుకావాలనే కోరిక అతడిలో వ్యక్తం కావాలి. గొప్ప అవకాశాలు, గొప్ప నైపుణ్యాలు నా విద్యార్థులకు రావాలనే ఆకాంక్ష ఉపాధ్యాయుని పనివల్ల కలగాలి. వ్యక్తిగా కాకుండా ఒక జట్టుగా ఎదగాలనే లక్ష్యం దిశగా ఉపాధ్యాయుడు పయనం సాగించాలి.
తరగతి గది ఉద్యోగం చేసే క్షేత్రం మాత్రమే కాదు, సమాజ నిర్మాణంలో అదొక సోపానమనే భావన కలగాలి. తరగతి గదిలో ఉండే ప్రతి విద్యార్థి తనలో దాగి వున్న అద్భుతమైన ప్రతిభను సామూహిక కార్యక్రమంలో ప్రదర్శించే స్థాయికి టీచర్ తీసుకురావాలి. పోటీతత్వంతో కాదు, సామూహికమైన టీమ్ స్పిరిట్‌గా మార్చే ప్రయత్నంగా చేయాలి. జయమైనా, అపజయమైనా కానీ అది వ్యక్తులది కాదు, తప్పులు జరగవచ్చు. తప్పులను సమర్థించుకోవడం కన్నా సవరించుకోవటంలోనే గొప్పతనముంటుంది. తరగతి పనులు చేసేటప్పుడు అధికార గర్వం కన్నా ప్రజాస్వామిక దృక్పథం ప్రధానం. ఇతరులను చివాట్లు పెట్టడం కన్నా అందర్నీ కలుపుకపోవటమే తన లక్ష్యం కావాలి. ఉపాధ్యాయుడు తను మాట్లాడినదానికన్నా వినటానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. శిక్షకుడు అనే భావనకు బదులుగా తరగతిలో తాను భాగస్వామిననే భావన కలిగి ఉండాలి. తన గతం కన్నా, వర్తమాన శైలినే ప్రధానమనుకోవాలి. నేను అనేదాని కన్నా మనం అనే భావనతోనే తరగతి గదికి నాయకత్వం వహించాలి. నాయకత్వం గొప్ప కళ. తన వ్యక్తిగత ప్రొజెక్షన్ కన్నా తన విద్యార్థుల, తరగతి గది ప్రొజెక్షన్ ముఖ్య లక్షణం అనుకోవాలి. ఉపాధ్యాయుని శైలి పనికన్నా ఫలితం కన్నా ఏ విధంగా చేసినా ఉన్న ప్రాసెస్ ప్రధానం. అదే ఉపాధ్యాయుణ్ణి తీర్చిదిద్దుతుంది. తరగతి గది విద్యార్థులనే చెక్కి తీర్చిదిద్దబడతాయి అనుకోకండి. తాను కూడా చెక్కబడతానన్న భావనతో పనిచేస్తే ఉత్తమ ఉపాధ్యాయుడిగా రూపొందుతారు.
ఉపాధ్యాయుడు విద్యార్థులతో సమావేశం కాగానే విద్యా కార్యక్రమం ఆరంభం కాదు. మొదట ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. కొత్త భావాలను, ఆలోచనలను ప్రేరేపించి భావనలను కలిగించుకోగలిగితేనే తరగతి గది ఉభయులకూ శక్తిని కలిగిస్తుంది. తరగతి గది అంటే నాలుగు గోడలు కావు. ఒక శుద్ధమైన జీవన శైలిగల ప్రదేశమది. తరగతి గది ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆలోచనా విధానాన్ని ఎలివేట్ చేస్తుంది. ఆ ఆలోచనలే తరగతి గది సరిహద్దులను కూడా విస్తరింపజేస్తుంది. బుద్ధుడు గయలో కూర్చొని ప్రవచనాలు చేయలేదు. తరగతి గది విస్తీర్ణాన్ని బుద్ధుడు పెంచుతూ పోయాడు కాబట్టే బౌద్ధమతం శ్రీలంక, జపాన్, ఐలాండ్, చైనా వరకూ విస్తరించగలిగింది. గురుశిష్యుల సైన్యమన్నది ఇతర ప్రాంతాలను, దేశాలను ఆక్రమించుకోవటానికి కాదు. తమ ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి కాదు. ఆ ఇద్దరి సంయోగం వల్ల జ్ఞానం పరిధి పెరుగుతుంది. ఆనాడూ ఈనాడూ గురుశిష్యుల సంబంధం జ్ఞానతాళ్ళతోనే కట్టుబడి విస్తరిస్తుంది.
తరగతి గదిలో జరిగే విషయాలు, చర్చలు క్రమంగా విద్యార్థుల ఆలోచనలను పెంచుతుంది. తరగతి విస్తీర్ణం అవుతున్న కొద్ది ఎసెస్‌మెంట్ కూడా మారుతూ ఉంటుంది. వ్యాసుడు మొదట వేటగాడు. కానీ పరిణతి చెంది బ్రహ్మసూత్రాలు రాశాడు. సంచారమే కొత్త జ్ఞానాన్ని సృష్టించి కొత్త జ్ఞాన జలపాతాలను ప్రవహింపచేస్తుంది. ఒక ప్రాంతం, ఒక దేశం చరిత్రను తెలుసుకోవాలన్నా, కొత్త చరిత్రకు రచన చేయాలన్నా రచయిత సంచారం చేయక తప్పదు. తరగతి గదికి సెలవులు ఉండవు. తరగతి గది నిరంతరం ప్రవహించే ప్రవాహం. ఎక్కడ శ్రేష్ఠమైన భావాలు, నూతన ఆలోచనలు మొలకెత్తుతాయో అదే- తరగతి గది.

- చుక్కా రామయ్య