బిజినెస్
హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ లాభం రూ. 2,734 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 July 2017
న్యూఢిల్లీ, జూలై 26: ప్రైవేట్ రంగ సంస్థ, దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే స్వల్పంగా క్షీణించి 2,734 కోట్ల రూపాయలుగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 2,797 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపింది. ఏకీకృత ఆదాయం ఈ తొలి త్రైమాసి కంలో 14,463 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు తొలి త్రైమాసికంలో 13,531 కోట్ల రూపాయలుగా ఉందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ బుధవారం స్పష్టం చేసింది. స్టాండలోన్ ఆధారంగా ఈసారి లాభం 1,556 కోట్ల రూపాయలు, పోయనసారి లాభం 1,871 కోట్ల రూపాయలుగా ఉంది.