బిజినెస్

శ్రీసిటీలో టాటా టొయో పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 26: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఏర్పాటు చేసిన శ్రీసిటీ పారిశ్రామిక వాడలో టాటా టొయో రేడియేటర్ లిమిటెడ్ ఉత్పత్తుల కేంద్రం వస్తోంది. టాటా ఆటో కాంప్ సిస్టమ్స్‌కు చెందిన ఈ సంస్థ.. వివిధ వాహనాల్లో వినియోగించే రేడియేటర్లను తయారు చేస్తుంది. టాటా ఆటో కాంప్ అధ్యక్షుడు అరవింద్ గోయల్, సిఈఒ అజయ్ టాండన్ సమక్షంలో ఇసుజి ఇంజినీరింగ్ బిజినెస్ సెంటర్ చైర్మన్ హీరోయసు మూరా ఈ పరిశ్రమకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూరా మాట్లాడుతూ వినియోగదారులకు అత్యుత్తమ టెక్నాలజీతో ఉత్పత్తులను అందించేందుకు టాటా ఆటో కాంప్ పరిశ్రమలు ఎప్పుడూ ముందుంటాయన్నారు. శ్రీసిటీలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. శ్రీసిటీ ఎండి సన్నారెడ్డి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కావడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ఆటో మొబైల్ పరిశ్రమలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.