బిజినెస్

జిఎస్‌టి సమాఖ్యను తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) మూలంగా వివిధ రాష్ట్రాలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే జిఎస్‌టి సమాఖ్యను ఏర్పాటు చేస్తానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్)కు హామీ ఇచ్చారు.
కెసిఆర్ బుధవారం జైట్లీతో సమావేశమై జిఎస్‌టి మూలంగా ఎదురవుతున్న సమస్యలు, మిషన్ భగీరథ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన నిధులు, ఎఫ్‌ఆర్‌బిఎం తదితర అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రితోపాటు లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, సీనియర్ సభ్యుడు బి వినోద్‌కుమార్ కూడా జైట్లిని కలిశారు. జిఎస్‌టి అమలులో ఐదారు నెలలపాటు కొన్ని చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయని, వీటన్నింటి త్వరలోనే పరిష్కరిస్తామని జైట్లి వీరితో చెప్పారు.
జిఎస్‌టి మూలంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను కెసిఆర్ ఈ సందర్భంగా జైట్లీ దృష్టికి తెచ్చారు. దీంతో జిఎస్‌టి సమాఖ్య సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చిస్తామని జైట్లీ తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్దికి సంబంధించిన 450 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి రావలసి ఉన్నదని ముఖ్యమంత్రి సూచించగా, యుటిలిటి సర్ట్ఫికేట్లు పంపించిన మరు క్షణం నిధులు విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.
అలాగే ఎఫ్‌ఆర్‌బిఎమ్ అంశాన్ని పరిశీలిస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్లు ఎంపి వినోద్‌కుమార్ తెలిపారు. ఇదిలాఉంటే కెసిఆర్ బుధవారం ఉదయం అబ్దుల్ కలాం రోడ్డుకు వెళ్లి బిజెపి ఉపరాష్టప్రతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకయ్యకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం పలు అంశాలపై ఇరువురు నాయకులు కాసేపు ముచ్చటించుకున్నారు.