బిజినెస్

10,000 సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 26: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలను చేరుకున్నాయి. మంగళవారం చేజారిన 10 వేల పాయింట్ల రికార్డును నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ బుధవారం ట్రేడింగ్‌లో సొంతం చేసుకుంది. తొలిసారిగా నిఫ్టీ 10,000 పాయింట్ల ఎగువన ముగిసింది.
బుధవారం 56.10 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 10,020.65 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 10,025.95 పాయింట్లను తాకింది. దీంతో అటు ఇంట్రా-డేలో, ఇటు క్లోజింగ్ టైమ్‌లో రెండింటిలోనూ నిఫ్టీ ఆల్‌టైమ్ హై రికార్డులను నెలకొల్పినట్లైంది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ కూడా బుధవారం సరికొత్త స్థాయిని చేరింది.
154.19 పాయింట్లు ఎగిసి 32,382.46 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 32,413.63 పాయింట్ల గరిష్ఠ స్థాయిని సెనె్సక్స్ అందుకుంది. దీంతో సెనె్సక్స్ కూడా ఇంట్రా-డే, క్లోజింగ్ టైమ్ రికార్డులను కొత్తగా సృష్టించింది. ఇక ఉదయం ఆరంభం నుంచి లాభాల్లో కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే దారిలో నడిచాయి. మంగళవారం లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు.. బుధవారం మాత్రం పెట్టుబడులకు ముందుకొచ్చారు.
కాగా, మెటల్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో వివిధ అగ్రశ్రేణి సంస్థల ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటం కలిసొచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే కదలాడాయి. భారతీయ మార్కెట్లపై దీని ప్రభావం కూడా సానుకూలంగా పడింది.