రాష్ట్రీయం

అవినీతిని ఉపేక్షించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 26: అవినీతి అధికారులు, రాజకీయ నేతలపట్ల ఛండశాసనుడిలా వ్యవహరిస్తానని సిఎం చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న 100 చ.గజాల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తూ, ఆయా ఇళ్ళలో నివసిస్తున్న వారికి బుధవారం పట్టాలు పంపిణీ చేశారు. విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో 21,225 మందికి, గాజువాక హౌస్ కమిటీ అర్హులుగా తేల్చిన 5,385 మందికి మహిళల పేరున పట్టాలు ఇచ్చారు. పట్టాతోపాటు పసుపు, కుంకుమ అందించారు. చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించటంలో, సకాలంలో పనులు చేయని అధికారులపై 1100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఐవిఆర్‌ఎస్ ద్వారా అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, ఇందుకోసం 1500 మంది సిబ్బందిని నియమించామన్నారు. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని, నేతలకూ దడ పుట్టిస్తానని చంద్రబాబు అన్నారు. గత్యంతరం లేక ప్రభుత్వ భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జా కేసులు నమోదు చేసిందని గుర్తు చేస్తూ, 2017మంది పేదలపై నమోదైన కబ్జా కేసులను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. పంచ గ్రామాల సమస్యనూ త్వరలోనే పరిష్కస్తానంటూ, దీనివలన మరో 21 వేలమందికి భూమి రెగ్యులరైజ్ అవుతుందన్నారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
పేదలు అధికారుల దయాదాక్షిణ్యాలపై బతకక్కర్లేదని, వారికి తాను అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలో లక్షా 93 వేల ఇళ్ళను కేంద్రం సహకారంతో నిర్మిస్తున్నామని తెలిపారు. తాజాగా మరో 2 లక్షల ఇళ్లు రాష్ట్రానికి మంజూరయ్యాయని, వీటి నిర్మాణానికి కేంద్రం 3,400 కోట్లు మంజూరు చేయనుందని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లిస్తామని కాంగ్రెస్ నేతలు గతంలో నాలుగు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్ళు నివాస యోగ్యంగా లేవన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు త్వరలోనే నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించిన పార్టీలకు పుట్టగతులు ఉండవన్నారు. రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేని పార్టీలు, గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో బెల్టుషాపులను తొలగిస్తానంటే, అంతా తమాషా అనుకున్నారు. బెల్టు తీసి, బెల్టుషాపులు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో సుపరిపాలన అందిస్తున్న ఎన్డీయే, తెలుగుదేశం ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, గంటా, అయ్యన్న, ఎమ్మెల్యేలు అనిత, గణబాబు, పంచకర్ల, వెలగపూడి, వాసుపల్లి, బండారు, పీలా గోవింద్, ఎమ్లెల్సీలు ప్పపల చలపతిరాజు, ఎంవివిఎస్ మూర్తి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.