అంతర్జాతీయం

అఫ్గాన్ ఆర్మీ బేస్‌పై తాలిబన్ల మెరుపుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాందహార్, జూలై 26: అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ రాష్ట్రంలో ఉన్న మిలిటరీ బేస్‌పై తాలిబన్లు మంగళవారం రాత్రి జరిపిన మెరుపుదాడిలో కనీసం 26 మంది అఫ్గాన్ సైనికులు మృతిచెందగా, మరో 13 మంది గాయపడినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కాందహార్ రాష్ట్రంలోని ఖాక్రెజ్ జిల్లా కర్జాలి ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంప్‌పై మిలిటెంట్లు దాడి చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి జనరల్ దావ్లత్ వాజిరి చెప్పారు. అఫ్గాన్ సైనికులు వీరోచితంగా ప్రతిఘటించి 80 మందికి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు ఆయన చెప్పారు. గంటకుపైగా జరిగిన ఈ దాడిలో 30కి పైగా వాహనాల్లో వచ్చిన వందలాది మంది మిలిటెంట్లు అన్ని వైపులనుంచి ఆర్మీ క్యాంప్‌పై దాడి చేశారని స్థానికులు చెప్పారు. మిలిటెంట్లు వైమానిక సహాయాన్ని కూడా తీసుకున్నారని చాలామంది స్థానికులు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. కాగా, తాలిబన్లు తమ ట్విట్టర్ ఖాతాద్వారా ఈ దాడి తామే జరిపినట్లు ధ్రువీకరించారు. 2014 డిసెంబర్‌లో అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు అఫ్గాన్‌నుంచి వైదొలగినప్పటినుంచి తిరిగి బలం పుంజుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. 2016లో అఫ్గాన్ భద్రతా దళాల్లో మరణాల సంఖ్య 35 శాతం పెరిగినట్లు అమెరికాకు చెందిన నిఘా సంస్థ ‘సిగార్’ పేర్కొంది. ఆ ఒక్క ఏడాదిలోనే 6,800కి పైగా సైనికులు, పోలీసులు మృతిచెందారు. ఈ ఏడాది తాలిబన్లు మరింత పకడ్బందీగా భద్రతా దళాలపై దాడులు కొనసాగిస్తున్నారు. గత ఏప్రిల్‌లో మజర్-ఇ-షరీఫ్ నగర శివార్లలోని ఆర్మీ బేస్‌క్యాంప్‌పై జరిపిన దాడిలో 140 మంది సైనికులు మృతి చెందారు. అంతకు ముందు మార్చిలో డాక్టర్ల ముసుగులో మిలిటెంట్లు కాబూల్‌లోని సర్దార్ దౌలత్‌ఖాన్ మిలిటరీ ఆస్పత్రిలోకి చొరబడి అనేకమందిని కాల్చి చంపడం తెలిసిందే.