జాతీయ వార్తలు

‘దిగువస్థాయి’్భర్తీల్లో ఇంకా ఇంటర్వ్యూలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: దిగువస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్, హర్యానా, అరుణాచల్‌తోపాటు పది రాష్ట్రాలు ఇంకా అమలు చేయటం లేదు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు తెలియజేశారు. ఇప్పటి వరకు 18 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగువస్థాయి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఇంటర్వ్యూ లేకుండా భర్తీ అవుతున్నాయని ఆయన వెల్లడించారు. సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలు ఇంతవరకు ఈ ప్రక్రియను చేపట్టలేదని వెల్లడించారు. నాగాలాండ్‌కు సంబంధించి మాత్రం ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒడిశా అయితే ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపిందని వెల్లడించారు. అవినీతికి ఆస్కారం ఉండకుండా చేసేందుకే గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో నియామకాల విషయంలో ఇంటర్వ్యూలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. దీనివల్ల అర్హులైన పేద అభ్యర్థులకు ఆస్కారం లభించటమే కాకుండా నియామక ప్రక్రియ కూడా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు.