రాష్ట్రీయం

మనకొద్దీ హైదరా‘బాధ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 26: డ్రగ్స్ విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఆ బాధల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు పరిశ్రమను తరలించేందుకు లాబీయింగ్ ప్రారంభించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
డ్రగ్స్ కేసు విచారణలో అగ్ర నిర్మాతల కుటుంబాలు కూడా ఉన్నాయని, త్వరలో వారికీ నోటీసులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. సదరు అగ్రనిర్మాతల కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగిపోయిన అగ్ర నిర్మాతలు హైదరాబాద్ నుంచి విశాఖకు తరలివెళ్లే ఆలోచనలు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో నేరుగా సంబంధాలున్నప్పటికీ, తాము పరాయి రాష్ట్రంలో ఉన్నామన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. విచారణలు, వేధింపులను భరించే కంటే సొంత రాష్ట్రానికి వెళ్లడమే మంచిదని, హైదరాబాద్‌లో ఆస్తులున్నా నష్టమేమీలేదన్న ప్రాథమిక నిర్ణయానికి పలువురు వచ్చినట్లు తెలిసింది. పైగా రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలివస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని ఏపి సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే హామీ ఇచ్చినందున, షూటింగులకు అనువైన విశాఖకు వెళ్లడం ఉత్తమమన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే సిఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ నేతలతో ఇద్దరు నిర్మాతలు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.
నిజానికి విశాఖలో ఒక స్టూడియో నిర్మించాలన్న యోచన ప్రభుత్వానికి చాలాకాలం నుంచీ ఉంది. ఆర్‌కె బీచ్ నుంచి భీమిలి వరకూ రోడ్డు నిర్మించారు. అక్కడే సినిమా స్టూడియోలు నిర్మించేందుకు స్థలాలు కూడా ఇవ్వాలని భావించింది. భీమిలి బీచ్ రోడ్‌లోనే రామానాయుడు స్టుడియో ఉంది. 35ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ స్టుడియోకు ప్రభుత్వమే భూమిని లీజుకు ఇచ్చింది. విశాఖకు సినీ పరిశ్రమను తీసుకువస్తే బెంగాల్, ఒడిషా సినిమా వ్యవహారాలతోపాటు టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్న భావన ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్న కొందరు నిర్మాతలు ఇదే దృష్టితో వైజాగ్‌పై దృష్టి సారించారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ ‘కొంతమంది నిర్మాతలు హైదరాబాద్‌లో తమకేదో అన్యాయం జరుగుతోందని భావించి వైజాగ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు, మీటింగులు పెట్టుకున్నట్లు మాకూ తెలిసింది. ఆంధ్రాలో ఏం జరిగినా, తమ పిల్లలు ఏం చేసినా చంద్రబాబునాయుడు ఉన్నారన్న ధీమాతోనే వైజాగ్ వెళదామనుకుంటున్నారేమో మరి. హైదరాబాద్‌లో సినిమా వారికి ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్నీ ఇస్తూ సిఎం కెసిఆర్ ఆదరిస్తున్నారు. సురేష్‌బాబు ప్రభుత్వం నుంచి విశాఖలో తీసుకున్న స్టుడియోలో షూటింగులు ఎందుకు చేయడం లేదు? అక్కడ పెళ్లిళ్లు, టికెట్ల పేరుతో జీవోకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్కడ స్టుడియో కడితే తన ఆదాయం పోతుందన్న భయంతోనే మిగిలిన స్టుడియోలు రాకుండా అడ్డుపడుతున్నా చంద్రబాబు ఏమీ అనడం లేద’ని ప్రశ్నించారు.
వెళ్లే అవకాశం లేదు: తలసాని
హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ తరలివెళ్లే అవకాశాలు గానీ, అలాంటి పరిస్థితులు గానీ లేవని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు ఇంతకుముందున్న గౌరవమే కొనసాగుతోందని చెప్పారు. డ్రగ్స్ కేసు విచారణ చట్టప్రకారమే జరుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వం ఎవరికీ మినహాయింపు ఇవ్వడం లేదన్నారు.
నేను అలా అనలేదు: పద్మారావు
సినిమా పరిశ్రమ తరలివెళ్లడంపై తెలంగాణ మంత్రి పద్మారావు మాట్లాడుతూ ‘నేను మొనే్న చెప్పాను. ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోతే ఎలా అని నన్ను అడిగారు. వాళ్లను వెళ్లమని మేం చెప్పలేదు. పోయేవారిని ఆపేది లేదు. వచ్చేవారిని అడ్డుకునేది లేదని మాత్రమే చెప్పాను. కానీ మీడియా వక్రీకరించింద’ని అన్నారు.