రాష్ట్రీయం

భూతద్దంలో చూడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: హైదరాబాద్‌లో ఉన్న ఐటి పరిశ్రమలో కొందరు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన మొత్తం ఐటి రంగాన్ని భూతద్దంలో చూడవద్దని తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో దాదాపు 400 ఐటి కంపెనీలు ఉన్నాయని, సుమారు 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు వీటిలో పని చేస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన జాబితాలో ఐటి కంపెనీల్లో 20 నుంచి 30 శాతం మంది మాత్రమే డ్రగ్స్ తీసుకుంటున్నారని పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన మొత్తం ఐటి రంగానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన జాబితా మేరకు ఆయా కంపెనీల యాజమాన్యాలతో స్వయంగా మాట్లాడుతున్నానని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన జాబితాలో కంపెనీల పేర్లే తప్ప ఉద్యోగుల పేర్లు లేవని స్పష్టం చేశారు. డ్రగ్స్ ముఠా సభ్యులు కెల్విన్, ఖుదూస్, నిఖిల్ శెట్టి, వియమ్స్, జీశాన్‌ల విచారణలో ఐటి ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. మరో వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ కూడా చాలా కంపెనీల్లో వందలాది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోని కెఫ్టీరియాలే డ్రగ్స్ సరఫరాకు అడ్డాలుగా మారుతున్నట్లు తమ విచారణలో తేలిందని దర్యాప్తు వర్గాలు వెల్లడిస్తున్నాయి.