రాష్ట్రీయం

తెలంగాణ వచ్చాక 231 డ్రగ్స్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ప్రస్తుతం ఏ నోట విన్నా డ్రగ్స్ మాటే. డ్రగ్స్ సరఫరా, వినియోగం అనేది ఎన్నో ఏళ్ల నుంచి చాపకింద నీరులా విస్తరించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని విదేశీ ముఠాలు డ్రగ్స్ దందాను విచ్చవిడిగా సాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జూన్ వరకు 231 డ్రగ్ కేసులు హైదరాబాద్ నగర పోలీసులు నమోదు చేయగా, 452 మందిని అరెస్టు చేశారు. అంటే హైదరాబాద్ పోలీసులు ఏడాదికి సుమారు 75 కేసులు నమోదు చేసినట్లు అయ్యింది. రాష్ట్రం విడిపోకముందు అనేక కేసుల్లో నైజీరియన్లు, ఆఫ్రికన్లను అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల ముఠాల ఆటకట్టించేందుకు నగర పోలీసు ఆధ్వర్యంలో ‘మాదక ద్రవ్యాల నిరోధక సెల్’ను ప్రత్యేకించి గతంలోనే ఏర్పాటు చేశారు.
ఈ సెల్ ప్రత్యేకించి నైజీరియన్ల నార్కోటిక్ స్మగ్లింగ్‌పై దృష్టి పెట్టింది. ఫలితంగా చాలామందిని అరెస్టు చేసి, భారీగానే పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. 2010 నుంచి 2012 మధ్య హైదరాబాద్ నగర పోలీసులు 19 విదేశీ గ్యాంగ్‌లను పట్టుకుని ఆ కేసుల్లో 21 మంది నైజీరియన్ల సహా మొత్తం 43 మందిని అరెస్టు చేశారు. ఈ స్థాయిలో భారీగా డ్రగ్స్ దందా చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నా, తగిన స్థాయిలో తదుపరి విచారణ జరగడం లేదని సమాచారం. ఎన్‌డిపిఎస్ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో కొన్నింటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక సెల్‌కు బదిలీ చేశారు.ఇలావుంటే కేసు నమోదు చేసిన చాలా కేసుల్లో 2016 వరకు ఒక్క చార్జిషీట్ దాఖలు చేయకపోవడమే కాకుండా సీజ్ చేసిన డ్రగ్స్ మెటీరియల్‌ను కూడా కోర్టుకు సమర్పించలేదని తెలుస్తోంది. ఈ అంశంపై ఓ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఒత్తిడి తేవడంతో చివరకు 30 కేసుల్లో గత ఏడాదిగా చార్జిషీట్లతో పాటు స్వాధీనం చేసుకున్న పలురకాల డ్రగ్స్‌ను కోర్టుకు సమర్పించారు. 2012 నుంచి 63 కేసులను డ్రగ్స్ కేసుల ప్రత్యేక సెల్‌కు బదిలీ చేయడం జరిగింది. కేసుల్లో సరైన పురోగతి లేకపోవడం వల్ల ఒక్క కేసులో నిందితులకు శిక్ష పడలేదు. కాగా మరికొన్ని నమోదు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఇతర మెటీరియల్ కూడా కనిపించడం లేదని తెలుస్తోంది.