తెలంగాణ

జోనల్ వ్యవస్థ రద్దుపై భిన్నాభిప్రాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: ఉద్యోగాల్లో జోనల్ వ్యవస్థ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆచరణ సాధ్యమేనా? జోనల్ వ్యవస్థ తలనొప్పులను తగ్గించుకోవడానికి రెండంచెల విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన సురేష్ చంద్ కమిటీ 778 జోనల్, మల్టీ జోనల్ పోస్టులు ఉన్నాయని, ఇందులో 553 పోస్టులను రాష్ట్ర క్యాడర్‌గా, 225 ఉద్యోగాలను జిల్లా స్థాయికి పెంచవచ్చని ప్రతిపాదించింది. ఇక జోనల్ వ్యవస్థ రద్దు చేయడమే ఉత్తమమని కొందరు అధికారులు, రద్దు చేస్తే తమ ప్రమోషన్లకు దెబ్బ అని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్టప్రతి ఉత్తర్వులకు భిన్నంగా వెళ్లేందుకు సాధ్యం అవుతుందా? అన్న అంశంపై గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా రెండంచెల విధానాన్ని అమలు చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదీనిపై అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను సూచించారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. జోనల్ వ్యవస్థను రద్దు చేసి, రెండంచెల విధానాన్ని అమలులోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మెజారిటీ సంఘాలు, అధికారులు సానుకూలంగా స్పందించగా, కొన్ని ఎన్జీవో సంఘాలు తమ ప్రమోషన్ ఛానల్ దెబ్బ తింటుందేమోనని భయపడుతున్నారు. కాగా జోనల్ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా తమ సొంత జిల్లాలకు, సొంత ఊళ్లకు దగ్గరికి బదిలీ చేయించుకోవడానికి అవకాశం కలుగుతుందనేది మరి కొందరి అభిప్రాయం. అయితే నేరుగా నియామకాలు చేసుకునేందుకు అవకాశం ఉన్న కొన్ని ఉద్యోగాలను జిల్లా యంత్రాంగానికే అప్పగించాల్సి ఉంటుందని, తద్వారా స్థానిక రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్న వాదన కూడా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ, పశు సంవర్థక శాఖల్లోని సాంకేతిక విభాగాలకు చెందిన వారు 31 జిల్లాల్లో ఎంబిబిఎస్, బిడిఎస్, బివిఎస్‌సి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాంస్కృతిక శాఖల్లో సంగీత కళాకారులను జిల్లా స్థాయిలో ఉంచలేమని, ఎందుకంటే అన్ని జిల్లాల్లో సంగీత కళాశాలలు లేవన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇలాఉండగా 14 శాఖలు హైదరాబాద్ నగర పరిథిలో ఉన్నందున వారితో ఈ కమిటీతో విడిగా చర్చించింది.