ఆంధ్రప్రదేశ్‌

సభా కమిటీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: శాసనసభ పబ్లిక్ అక్కౌంట్స్, ఎస్టిమేట్స్, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర లెజిస్లేచర్ స్పెషల్ సెక్రటరీ రామాచార్యులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ్యులుగా ఉంటారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మన్‌గా బి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సభ్యులుగా కె.అప్పలనాయుడు, పివిజిఆర్ నాయుడు, పార్ధసారథి, వై.శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, ఎ.సురేష్, డి.రామలింగేశ్వర స్వామి, విష్ణుకుమార్ రాజు, బీదా రవిచంద్ర, ఎం.ఎ.షరీఫ్, పిల్లి సుభాష్ చంద్రబోస్ నియమితులయ్యారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా ఎం.వేణుగోపాల రెడ్డి, సభ్యులుగా టి.ఆదిత్య, గద్దే రామ్మోహన్, ఎం.గీత, కె.జోగులు, పీడిక రాజన్న దొర, రఘురామిరెడ్డి, సి.రామచంద్రారెడ్డి, కె.వెంకట రమణ మూర్తి, చిక్కాల రామచంద్రరావు, గుమ్మడి సంధ్యారాణి, సోము వీర్రాజును నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా కె.వెంకటరావు, సభ్యులుగా కోళ్ల లలిత కుమారి, ప్రభాకర చౌదరి, శివరామ రాజు, పి.శ్రీనివాసులు రెడ్డి, చిరంజీవి భాస్కర రెడ్డి, జగ్గిరెడ్డి, కె.శ్రీనివాసులు, ఆమంచి కృష్ణమోహన్, జి.శ్రీనివాసులు, వివివి చౌదరి, వి.బాలసుబ్రహ్మణ్యంను నియమించారు.