హైదరాబాద్

సిటీ రోడ్లపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: మహానగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. బుధవారం కార్వాన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసినానంతరం మంత్రి మాట్లాడుతూ రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులంతా కలిసి ఓ ప్రత్యేక వ్యూహాంతో ముందుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. వీలైనంత త్వరగా రోడ్లకు శాస్ర్తియంగా మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన యంత్రాలను, సిబ్బందిని సమకూర్చుకునేందుకు వీలుగా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రోడ్లకు మరమ్మతులు, అవసరమైన చోట అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే పలుసార్లు ప్రత్యేక సమీక్షలు నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్ ఇళ్లు అనేవి సొంతిల్లు లేని పేదల కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకమని వివరించారు. ఈ ఇళ్ల కోసం లబ్దిదారులు ఎవ్వరికీ పైసా ఇవ్వనవసరం లేదని ఆయన సూచించారు.
భోజగుట్టను సందర్శించిన కమిషనర్
కార్వాన్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపనానంతరం కమిషనర్ జనార్దన్ రెడ్డి భోజగుట్టను సందర్శించారు. భోజగుట్టలో ఉన్న ఖాళీ స్థలం అన్యాక్రాంతం కాకుండా నివారించేందుకు గాను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ బంగారు ప్రకాశ్ కోరిన నేపథ్యంలో కమిషనర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ స్థలం గుట్టలు, రాళ్లతో నిం ఉన్నందున ఆయా ప్రాంతాలను సరిచేయటానికి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను చేపట్టడంపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.