హైదరాబాద్

డబుల్ బెడ్‌రూం ఇళ్ల శంకుస్థాపనలో ప్రొటోకాల్ లొల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నార్సింగి, జూలై 26: కార్వాన్ నియోజకవర్గం జియాగూడ డివిజన్‌లో డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ లొల్లి చోటుచేసుకుంది. కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యానర్‌లో లోకల్ ఎమ్మెల్యే అయిన తన ఫొటో లేకపోవటంపై ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దిన్ మండిపడ్డారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరమారావు ముఖ్య అతిథిగా హాజరుకావల్సిన ఈ కార్యక్రమంలో ఆయన రాకముందే అక్కడకు చేరుకున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, జిహెచ్‌ఎంసి అధికారులను నిలదేసే ధోరణిలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నచ్చజెప్పినా ఎమ్మెల్యే విన్పించుకోకపోవటంతో తీవ్ర అసహనానికి గురైన డిప్యూటీ సిఎం మహముద్ అలీ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు అరగంట తర్వాత మంత్రి కెటిఆర్‌తో కలిసి మళ్లీ అక్కడకు వచ్చారు. అయితే, ఈ బ్యానర్‌ను స్థానిక కార్పొరేటర్ మిత్రకృష్ణ ఏర్పాటు చేశారని, ప్రొటోకాల్ విషయంలో తమను కనీసం ఒక్కసారైనా సంప్రదిస్తే ఈ పరిణామం తలెత్తేది కాదని జిహెచ్‌ఎంసి అధికారులు కూడా ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. స్థానిక ఎమ్మెల్యేకు కనీసం గౌరవం ఇవ్వకుండా, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ డిప్యూటీ సిఎం, జోనల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే నిలదీశారు. ఎమ్మెల్యే మండిపాటుతో అప్పటికే టిఆర్‌ఎస్, మజ్లిస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. దీంతో పరిస్థితి అదుపు తప్పకముందే ముందుజాగ్రత్త చర్యగా రంగంలోకి దిగిన పోలీసులు జిహెచ్‌ఎంసి సిబ్బంది వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌తో పాటు అక్కడ కట్టిన బ్యానర్లన్నీ తొలగించడంతో ఎమ్మెల్యే శాంతించారు.