మంచి మాట

నాగపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులందరికీ అత్యంత పవిత్రమైంది శ్రావణమాసం. ఏటా శ్రావణ శుద్ధ పంచమి రోజును ‘నాగపంచమి’ అంటారు. భారతీయ సంస్కృతిలో ‘నాగపూజ’కి ఒక గొప్ప విశిష్టత ఉంది. హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. ఈ రోజున నాగేంద్రుని భక్తితో పూజిస్తే సర్పభయం ఉండదని సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయని, అంతా అనుకూలంగా ఉంటుందనీ శాస్త్ర వచనం. సర్వప్రాణికోటిని ప్రేమతో చూడాలన్నది నాగుల పంచమి పండుగలోని అంతరార్థం. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తూ పరమశివుడే స్కాంధపురాణంలో వివరించారు.
‘ఓం నాగకులాయ విద్మహే విషదంతాయ ధీమహి, తన్నో సర్ప ప్రచోదయాత్’ అని కనీసం పదకొండుసార్లు ఈ రోజున జపిస్తే సర్పభం తొలగిపోతుందంటారు. భూభారాన్ని అంతా మసేది ఆదిశేషుడనే సర్పమే. క్షీరసాగర మథనంలో కవ్వంగా వాడుకున్నదీ వాసుకీ అనే సర్పానే్న. ఆదిపూజ్యుడైన వినాయకుడు యజ్ఞోపవీతంగా ధరించింది నాగసర్పానే్న. దాదాపు అన్ని జాతుల్లోనూ నాగపూజ ఏదో ఒక విధానంలో వాడుకగా ఉంది. కానీ మన భారతదేశంలో నాగులను దేవతా స్వరూపంగా భావించి పూజిస్తాం. వేదాల్లో అనేక రూపాల్లో నాగ జాతికి సంబంధించిన అంశాలున్నాయి. పురాణాల ప్రకారం ఇవి కశ్యపు మహర్షి, కద్రువ దంపతులకు కలిగిన సంతానం. శ్రీమహావిష్ణువు ఆదిశేషుపై శయనించి సృష్టి స్థితి పాలన చేస్తాడు. అగ్నిపురాణంలో 80 నాగజాతుల వర్ణన ఉంది.
‘అనంతం వాసుకీం శేషం, పద్మనాభంచ కంబలం / శంఖ పాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా / ఏతాని నవనామాని నాగానంద మహాత్మనే / సాయంకాలే పఠేన్నిత్యం, ప్రాతఃకాలే విశేషతః / తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజరుూభవేత్’ ఇలా తొమ్మిది కాల నాగుల్ని స్మరిస్తే, ప్రతీ రోజూ పఠిస్తే కాలనాగు విషభయం లేకుండా ఉంటుంది. అన్నింటా విజయం సిద్ధిస్తుంది. భగవద్గీతలో తన గురించి వర్ణిస్తూ శ్రీకృష్ణుడు నాగులలో కెల్లా పెద్దది అయిన అనంతని కూడా నేనే అని చెబుతారు. కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. సర్పాలు ధన నిధులకు కావలి కాస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం- రాహువు జన్మ నక్షత్రం భరణి. కేతువు జన్మనక్షత్రం ఆశే్లష. రాహువు జన్మనక్షత్రం భరణికి అధిదేవత అమధర్మరాజు. కేతువు జన్మనక్షత్రమైన ఆశే్లషకు అధిదవత సర్పం. రాహు-కేతు జన్మ నక్షత్రాల అధిదేవతలను ‘కాల-సౌర్ప’ అంటారు. కాల సర్పయోగం వున్నవారు తప్పక ఈరోజు సర్పపూజ చేయాలని శాస్త్ర వచనం. పాము కుండలినికి సంకేతం. అందువల్లే ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానం. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అందుకు ఆదిశేషుడు తాము ఉద్ధరించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్పపూజలు చేయలాని వరం కోరుకున్నారు. ఆదిశేషుని కోరికను మన్నించి మహావిష్ణువు ఈ నాగుల పంచమి రోజు సర్పపూజలు అందరూ చేస్తారని వరాన్ని ఇస్తాడు.
ఈ పంచమిని తెంలగాణ రాయలసీమ ఆంధ్రా ప్రాంతంలో, ఉత్తరభారతదేశం, కర్నాటకలో అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. నాగపూజవల్ల వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. జనమేజయుని సర్పయాగంలో తమ జాతంతా అంతరించిపోవడం చూసి మిగతా సర్పాలు బ్రహ్మను వేడుకోగా వాటికెలాంటి హాని కలుగకుండా మానవులంతా పూజించేలా వరమిచ్చిన రోజు ఇదే. పాములకంత విశేష ఐతిహ్యం ఉన్నందునే ఈ రోజు ఆడవాళ్లం ఉదయానే్న లేచి, మంగళస్నానాలు చేసి పట్టుచీరలు ధరించి పాలు, తేనె తీసుకెళ్లి పుట్టలలో పోసి వస్తారు. చలిమిడి, పాయసం నైవేద్యంగా నివేదిస్తారు. ఇంటిగోడలపై పసుపు, కుంకుమలతో నార మూర్తుల చిత్రాలు గీసి వాటికి పూజ చేస్తారు. ఈ విధంగా చేస్తే ఇంటిలో సర్పాలు తిరగవని ప్రతీక. నాగపంచమి కంటే ముందు రోజు నాగుల చవితి. ఈ రోజు స్ర్తిలంతా ఉపవాసం చేస్తారు. మరుసటి రోజు పంచమి. ఆ రోజు పుట్టదగ్గరకి వెళ్లలేనివారు ఇంటిదగ్గరే బంగారంతోకాని వెండితోకాని నాగప్రతిమను చేసుకుని పూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో నాగుల పంచమి జరుపుకుంటారు. చాలా ప్రాంతాల్లో తమ పిల్లలకు నాగరాజు, నాగభూషణం, నాగేశ్వరీ, నాగలక్ష్మి అని పేర్లు పెట్టుకుని తమ భక్తని చాటుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. చెట్టు పుట్టలను కూడా పూజించే గొప్పదైన ఆచారాన్ని మనం పాటిద్దాం. ఆచరింపజేద్దాం.

-కె.రామ్మోహనరావు