నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సం
పద లోలిం గొని వచ్చి యిచ్చి ముదమొప్పం గాంచి సేవించి ర
య్యుదయాస్తాచల సేతు శీతనగ మధ్యోర్వీ పతుల్ సంతతా
భ్యుదయున్ ధర్మజుఁ దత్యభాస్థితు జగత్పూర్ణ ప్రతాపోదయున్

భావం: నేల నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులంతా ఎడతెగక వృద్ధి పొందే సంపద కలవాడు, లోకమంతటా నిండిన పరాక్రమం చేత ఔన్నత్యం వహించినవాడు అయిన ధర్మనందనుని సంతోషంతో దర్శించుకొన్నారు. ధర్మరాజు మయసభాభవన ప్రవేశం కోసం చేసే దానాలు విని ఆ సభాభవన ప్రవేశసందర్భంగా పిలిచిన రాజులందరూ ధర్మరాజు దగ్గరకు వచ్చారు. వారినందరినీ సంతోషపరిచే ధర్మరాజును అందరూ సంతోషంతో దర్శించుకొన్నారు.