విజయనగరం

ఘోషాసుపత్రి ఘటనపై జిల్లా జడ్జి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ఇటీవల ఘోషాసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ప్రసవం పొందిన శిరీష ఇద్దరు కవల పిల్లలను జన్మనిచ్చింది. ఈ సంఘటనపై జిల్లా జడ్జి జస్టిస్ ఎ.గిరిధర్ ఆరా తీశారు. గురువారం ఆయన కోర్టులో ఘోషాసుపత్రి వైద్యులను, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, ఆసుపత్రి అభివృద్ధి సంఘం వర్కింగ్ చైర్మన్ డాక్టర్ విఎస్‌ప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై డాక్టర్ సునీత మాట్లాడుతూ శిరీషకు బిపి అధికంగా ఉన్నందున హైరిస్క్‌తో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలుపగా గర్భిణివల్ల అందుకు సమ్మతించలేదని తెలిపారు. దీంతో సొంత వాహనంపై విశాఖలోని కెజిహెచ్‌కు రిఫర్ చేస్తామని తెలుపగా అందుకు శిరీష కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, స్ధానికంగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిపోతామని తెలపడంతో ఆమెకు డిశ్చార్జ్ చేశామని వివరించారు. దీనిపై డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రొటోకాల్ ప్రకారం డాక్టర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్‌ను తొలగించామన్నారు. దీనిపై జిల్లా జడ్జి స్పందిస్తూ ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.