అదిలాబాద్

జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్: జిల్లాలో శాంతి భద్రతలు పర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసు నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని, జిల్లాలో ఎటువంటి మావోయిస్టుల, ఉగ్రవాదుల కార్యకలాపాలు జరగడం లేదన్నారు. మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల నుండి చొరబాట్లు లేకుండా నిరంతరం జిల్లా పోలీసు ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, వీరితో పాటు ప్రత్యేక పోలీసు నిఘా బృందాలు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజలు సైతం ఆసాంఘీక శక్తుల సమాచారం ముందస్తుగా పోలీసులకు తెలియజేస్తున్నారని తెలిపారు. మండల స్థాయి పోలీసులు ప్రతి రోజు గ్రామాలను సందర్శించి, ప్రజల వెన్నంటిగా ఉంటూ వారి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్గించే చర్యలు చేపట్టినా చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా బోథ్, ఇచ్చోడ, సిరికొండ, బజార్‌హత్నూర్, తాంసి, తలమడుగు తదితర మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిలో సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు.