నల్గొండ

అక్రమార్కుల జేబుల్లోనే ఉపాధి పైసల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో అక్రమార్కుల జేబుల పాలైన ప్రజాధనాన్ని రాబట్టడంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించలేకపోతుండటం విమర్శలకు తావిస్తుంది. ఏటా సగటున రెండు నుండి మూడు కోట్ల మేరకు ఉపాధి హామీ పథకం నిధులు సామాజిక తనిఖీల్లో, విజిలెన్స్ విచారణల్లో దుర్వినియోగమైనట్లుగా వెలుగు చూస్తున్నప్పటికి పక్కదారి పట్టిన సదరు నిధులను రికవరి చేయడంలో మాత్రం ఏళ్ల తరబడిగా జాప్యం సాగుతుంది. అక్రమాలకు పాల్పడిన వారు రాజకీయంగా ఒత్తిళ్లు, సాంకేతిక లోసుగులతో తప్పుల నుండి తప్పించుకుంటుండటంతో ఏటా ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం సాధారణమైంది. నల్లగొండ జిల్లాలో ఇప్పటిదాకా ఉపాధి హామీ పథకం పనుల తనిఖీలో భాగంగా నిర్వహించిన తొమ్మిది సామాజిక తనిఖీలో ప్రస్తుతం 3కోట్ల 96లక్షలు వివిధ పనుల కింద దుర్వినియోగమైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. వీటిపై విజిలెన్స్ విచారణలో 1కోటి 61లక్ష 19వేలు దుర్వినియోగమైనట్లుగా నిర్ధారించి ఈ మొత్తాన్ని అక్రమార్కుల నుండి తిరిగి రాబట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటిదాకా 60లక్షల 65వేలు నిధులను రికవరి చేయగా మరో 1కోటి 35వేల నిధులు అక్రమార్కుల నుండి కక్కించాల్సివుంది.
దుర్వినియోగం జాబితాలో వందలాది ఉద్యోగులు!
ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో తొమ్మిది సామాజిక తనిఖీల్లో 5,288మందిపై ఆరోణపలపై విచారణ ఎదుర్కోన్నారు. వీరిలో ఏడుగురు ఎంపిడివోలు, 88ఏపివోలు, 16మంది ఏఈలు, 656మంది టెక్నికల్ అసిస్టెంటర్లు, 1929మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 250మంది సివోలు, 77మంది ఈసిలు, 1316మంది మేట్లు, 62మంది బిపిఎం సిబ్బంది, ఇతరులు 863మంది ఉన్నారు. ఎక్కువగా టెక్నికల్ అసిస్టెంట్ల నుండి 62లక్షల 52వేలు, ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి 58లక్షల 78వేలు వసూలు కావాల్సివుంది. వీటిలో ఫీల్డ్ అసిస్టెంట్ల నుండి 11లక్షల 63వేలు, టెక్నికల్ అసిస్టెంట్ల నుండి 13లక్షల 15వేలు మాత్రమే వసూలు జరిగిన తీరు వసూల్ పర్వం నత్తనడకకు నిదర్శనం. నిధుల దుర్వినియోగం కేసుల్లో ఉన్నవారిలో కొందరు పలు సాంకేతిక, శాఖపరమైన కారణాలతో రికవరి చర్యల అందకుండా పోతున్నారు. కొంతమందిని సస్పెండ్ చేసిన రాజకీయ సిఫారసులతో కొన్నాళ్లకు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఉపాధి నిధులను రికవరి చేయాల్సిన వ్యక్తులకు పదే పదే నోటీస్‌లు జారీ చేసి స్పందించని వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామంటు విజిలెన్స్ అధికారులు చెబుతున్నా ఈ దిశగా పెద్దగా పురోగతి లేదు. ఐతే రికవరికి సంబంధించి నిర్ధిష్టమైన చట్టపర చర్యలు లేకపోవడంతో దుర్వినియోగమైన నిధుల రికవరీ ఏళ్ల తరబడిగా అసంపూర్తిగానే కొనసాగుతుంది. గత సోషల్ ఆడిట్‌లలో గుర్తించిన దుర్వినియోగం సొమ్ము రికవరి పూర్తి కాకముందే కొత్తగా నిర్వహించిన సోషల్ ఆడిట్‌లలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తుండటంతో ఉపాధి నిధుల దుర్వినియోగ నిధుల రికవరీ పర్వం లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది.