విశాఖ

నేటి నుండి పి.ఎల్.జి.ఎ. వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి: ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో పి. ఎల్.జి. ఎ. వారోత్సవాలు నిర్వహించేందుకు గత కొన్ని రోజుల నుండి సి.పి. ఐ. మావోయిస్టు పార్టీ సన్నాహాలు చేపడుతుంది. నేటి నుంచి జరగబోయే వారోత్సవాల గ్రామగ్రామాన విజయవంతం చేయాలని మావోయిస్టులు పత్రికల్లో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సరిహధ్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు, ఇటీవల గూడెంకొత్తవీది మండలం పెదపాడు సమీపంలో మృతి చెందిన మావోయిస్టు నేత జాంబ్రి, కమాండర్ చిట్టిబాబుల ఫోటోలను ఏర్పాటు చేస్తూ, పెదబయలు సమీపంలో మద్దిగరువులో పెద్ద వాల్ పోస్టర్‌ను మావోలు అతికించిన విషయం తెలిసిందే. గతంలో లేని విధంగా వాల్‌పోస్టర్లు ముద్రించడంపై పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. గత కొనే్నళ్ళుగా పి. ఎల్.జి. ఎ. వారోత్సవాల నిర్వహణలో మావోయిస్టులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణంగా వరుస ఎన్‌కౌంటర్లు, నిర్భంధాలు, అరెస్ట్‌ల నేపధ్యంతో పాటు అగ్రనాయకుల నాయకత్వం లోప కూడా వారోత్సవాల నిర్వహణకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ బలహీన పడిందని పోలీసులు ప్రకటనల నేపధ్యంలో ఒక్కసారిగా మావోయిస్టుల కదలికలు మరోసారి బయట పడ్డాయి. ఇటీవల మావోయిస్టు నేత కృష్ణ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో పర్యటించి గతంలో పార్టీకి అండగా ఉన్న వారిని మేల్కోలిపి కొందరిని మిలీషియా సభ్యులుగా ఏర్పాటు చేసి పి. ఎల్. జి. ఎ.వారోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిసింది. మెట్టగూడ సమీప ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జాంబ్రి.చిట్టిబాబులకు చిహ్నాంగా స్థూపం నిర్మించేందుకు ఇప్పటికే కొందరు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరుగు పి. ఎల్. జి. ఎ.వారోత్సవాలు విజయవంతం చేసేందుకు మావోయిస్టులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క వాటిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.